Lockdown extended upto May 17Th by MHA మరో రెండువారాల పాటు లాక్ డౌన్ పోడగింపు: కేంద్ర హోంశాఖ

Covid 19 lockdown extended by two weeks with effect from 4 may says mha

coronavirus, MHA, lockdown, covid-19, lockdown extended, corona spread, corona lockdown extension, corona red zones, corona orange zones, corona green zones, special trains, special guidelines, inter state trains, Ministry of Home Affairs

Ministry of Home Affairs issued an order under the Disaster Management Act, 2005 to further extend the lockdown for a period of two weeks beyond 4 May, 2020. MHA has also issued new guidelines to regulate different activities in this period based on risk profiling of the districts of the country into Red (hotspot), green and orange zones.

కోవిడ్-19: మరో రెండువారాల పాటు లాక్ డౌన్ పోడగింపు: కేంద్ర హోంశాఖ

Posted: 05/01/2020 06:38 PM IST
Covid 19 lockdown extended by two weeks with effect from 4 may says mha

కరోనా వైరస్ మహమ్మారి దేశంలో ఇప్పటికీ విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో మరో రెండు వారాల పాటు లాక్ డౌన్ ను పొడిగించింది. మే 4వ తేదీ నుంచి మూడో విడత లాక్ డౌన్ ప్రారంభం కానుంది. మే 3వ తేదీన రెండు విడత లాక్ డౌన్ ముగిపిపోనున్న తరుణంలో ఇవాళ ప్రధానితో జరిగిన ఉన్నత స్థాయి సమావేశం తరువాత కేంద్ర హోం మంత్రిత్వశాఖ రెండు వారాల పాటు అనగా మే 17 వరకు లాక్ డౌన్  కొనసాగించనున్నామని పేర్కోంటూ ఒక ప్రకటనను వెలువరించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ ఉత్తర్వులను జారీ చేసింది.

దేశంలో విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఉన్నత స్థాయి సమీక్ష అనంతరం లాక్ డౌన్ ను మరో రెండు వారాల పాటు లాక్ డౌన్ పోడిగింపు నిర్ణయం తీసుకున్నామని పేర్కోంది, దీంతో మే 4 నుంచి మే 17 వ తేదీ వరకు మూడో విడత లాక్ డౌన్ కొనసాగున్నట్లు తెలిపింది. మార్చి 24వ తేదీ నుంచి ఏప్రీల్ 14 వరకు తొలి విడత లాక్ డౌన్.. ఆ తరువాత ఏప్రీల్ 15 నుంచి మే 3 వరకు రెండవ విడత లాక్ డౌన్ ను కేంద్రప్రభుత్వం విధించిన విషయం తెలిసిందే.

కాగా తాజాగా మూడవ విడత లాక్  డౌన్ పొడిగింపు నేపథ్యంలో రెడ్ జోన్ లో కట్టుదిట్టమైన చర్యలు, ఆంక్షలు అలాగే కొనసాగనున్నాయి. కంటైన్మెంట్ జోన్లలో పూర్తి ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. ఆరంజ్ జోన్లలో కొన్ని మినహాయింపులనిచ్చింది. గ్రీన్ జోన్లలో అన్ని కార్యకలాపాలకు అనుమతి ఇచ్చింది. గ్రీన్ జోన్లో బస్సులు నడిపేందుకు కేంద్రం అనుమతించింది. 33 శాతం సిబ్బందితో గ్రీన్ జోన్లలో ప్రైవేట్ కార్యాలయాలు పని చేయవచ్చని తెలిపింది. వలస కూలీలను తరలించేందుకు రైళ్లకు అనుమతి ఇచ్చింది. విమాన ప్రయాణాలపై నిషేధం కొనసాగుతుందని స్పష్టం చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles