Coronavirus: No mask, no fuel rule in goa పెట్రోల్ కావాలా నయనా.. మాస్క్ వేసుకుంటేనే..

Coronavirus no ration petrol to those not wearing masks in goa

mask Mandatory, No Ration, No petrol, Goa, Coronavirus, Goa Coronavirus cases, Goa Coronavirus news, goa petrol pumps, goa ration, goa mask compulsory, Chief Secretary, Parimal Rai, Goa, Politics

he Goa government has decided that people not wearing masks will not be given fuel at petrol pumps or ration at fair price shops in the state. The decision was taken during a meeting of the State Executive Committee (SEC) chaired by Chief Secretary Parimal Rai.

పెట్రోల్ కావాలా నయనా.? రేషన్ కావాలా నాయనా.? మాస్క్ వేసుకుంటేనే..

Posted: 05/01/2020 05:47 PM IST
Coronavirus no ration petrol to those not wearing masks in goa

ఇందుగలదు అందులేదన్న సందేహము వలదు.. ఎందెందు వెతికినా కలదు కరోనావైరస్‌ మహమ్మారి అని అనాల్సిన రోజులు దాపురించాయి. యావత్ ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న కరోనా వైరస్ మహమ్మారిని ఎక్కడికక్కడ కట్టడి చేసే పనిలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించారు. అయితే ఇక మరో రెండు రోజుల వ్యవధిలో లాక్ డౌన్ ఎత్తివేసిన పక్షంలోనూ ప్రజలు కరోనావైరస్ పట్ల అప్రమత్తతో వ్యవహరించాలని ఇప్పటికే పలువురు సందేశాలు ఇస్తున్నారు. సామాజిక దూరం పాటించాలని, చేతులు శుభ్రంగా కడుక్కోవాలని సూచనలు ఇస్తున్నారు.

ఈ క్రమంలో ఇప్పటికే ఒడిషా ప్రభుత్వం మాస్క్ వాడకం తప్పనిసరి చేసింది. మాస్క్ లేకుండా బయటకు రాకూడదని చెప్పిన ప్రభుత్వం.. ఇలా వెళ్తే పెట్రోల్ బంకుల్లో కూడా పెట్రోల్ కూడా పోయరాదని అదేశాలను జారీ చేసింది. ఈ క్రమంలో ఒడిశా  ప్రభుత్వం బాటలో నడిచేందుకు సన్నధమైన గోవా కూడా ప్రజలకు పలు కీలకమైన అదేశాలను జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఒడిశా కన్న ఓ అడుగుముందుకేసీన ప్రభుత్వం.. కరోనావ్యాప్తి నియంత్రణకు కఠిన చర్యలను చేపడుతోంది. ఇకపై ముఖాలకు మాస్క్‌ లేకపోతే వాహనాలకు పెట్రోల్‌ పోసేదిలేదని స్పష్టం చేసింది. అంతేకాదు ప్రజా సరఫరాల నుంచి రేషన్ కూడా ఇవ్వరని స్పష్టం చేసింది.

ఈ మేరకు రాష్ట్రంలో పెట్రోల్‌, డీజిల్‌ బంకుల యాజామాన్యలకు ఆదేశాలు జారీచేసింది. అలాగే రేషన్‌ షాపుల వద్దకు కూడా మాస్క్‌లతో రావాలని, లేకపోతే రేషన్‌ నిలిపివేస్తామని హెచ్చరించింది. కరోనా నివారణ చర్యల్లో భాగంగానే ఈ చర్యలు చేపట్టినట్టు ప్రభుత్వం పేర్కొంది. కాగా గోవాలో ఇప్పటి వరకు కేవలం 7 కరోనా పాజిటివ్‌ కేసులు మాత్రమే నమోదైన విషయం తెలిసిందే. వారంతా వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ గతంలోనే ప్రకటించింది. అయినప్పటికీ దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ముందుస్తు జాగ్రత్త చర్యలను చేపడుతోంది. దీనిలో భాగంగా బహిరంగ ప్రదేశాలకు వచ్చిన్నప్పుడు ప్రజలంతా మాస్క్‌లు ధరించేలా ప్రజల్లో చైతన్యం కలిగిస్తంది

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mask Mandatory  No Ration  No petrol  Goa  Coronavirus  covid -19  Chief Secretary  Parimal Rai  Goa  Politics  

Other Articles