7 new covid cases in Telangana during last 24 hours తెలంగాణలో తగ్గిన కోరానా.. 24 గంటల్లో 7 పాజిటివ్ కేసులు..

Telangana may soon be covid 19 free by may 7 only 7 cases in last 24 hours

coronavirus, coronavirus in Telangana, Telangana coronavirus cases, coronavirus cases in Telangana, coronavirus count in india, india coronavirus count, Tabilghi Jamat Telangana, Tabilghi jamat Telangana cases, Nizamudding event Telangana, Delhi coronavirus cases, Delhi Nizamuddin coronavirus cases, coronavirus india, coronavirus update, coronavirus in india, coronavirus cases, coronavirus cases india, coronavirus update india, coronavirus news, COVID-19, COVID 19 update, coronavirus in ts, coronavirus Hyderabad, Telangana

The decline in the number of COVID-19 cases continued in Telangana on Wednesday with only seven fresh cases being reported. With this, the number of positive cases reported in the state went up to 1,016. Of this, the number of active cases till date was 582, a COVID-19 bulletin said.

తెలంగాణలో గణనీయంగా తగ్గిన కోరానా.. 24 గంటల్లో 7 పాజిటివ్ కేసులు..

Posted: 04/30/2020 12:49 PM IST
Telangana may soon be covid 19 free by may 7 only 7 cases in last 24 hours

తెలంగాణలో కరోనా మహమ్మారి మళ్లి నెమ్మదించింది. ప్రభుత్వం, అరోగ్యశాఖ అధికారులు, వైద్యులు, పోలీసులు, హెల్త్ వర్కర్లు, శానిటేషన్ సిబ్బంది అహర్నిశలు శ్రమించి చేస్తున్న కృషి ఎట్టకేలకు ఫలితానిస్తోంది. వీరితో పాటు ఈ మహమ్మారిని రాష్ట్రం నుంచి తరమికొట్టడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలకు విలువనిచ్చి.. ఇళ్లకు మాత్రమే పరిమితమైన ప్రజల పాత్ర కూడా అధికంగానే వుంది. సీఎం కేసీఆర్ చెప్పిన విధంగానే ప్రజలు కూడా ఫాలో కావడం.. కేవలం నిత్యావసరాలు తెచ్చుకునేందుకు తప్ప ఇతర పనులపై బయటకు వెళ్లకపోవడం కూడా కరోనా రాష్ట్రంలో నెమ్మదించడానికి కారణం,

దీంతో పాటు అక్కడక్కడా లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిని పోలీసులు కాసింత భయాలకు గురిచేయడంతో పాటు అలాంటి వారిపై టాఠీలు జుళిపించినప్పుడు వీడియోలు తీసి.. వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో అనవసరంగా రోడ్డుపై వచ్చేందుకు యువత కూడా జడిశారు. ఇక ఇందుకు సంబంధించిన టిక్ టాక్ వీడియోలు కూడా కరోనాను కట్టడి చేయడానికి కారణమయ్యాయి, గత వారం రోజులుగా 20 లోపు కేసులు నమోదవుతున్నాయి. ఒక్కో రోజు 50 నుంచి 70 కేసులు నమోదైన సంగతి తెలిసిందే.

2020, ఏప్రిల్ 29వ తేదీ బుధవారం 7 కేసులు నమోదయ్యాయి. ఈ కేసులు కూడా.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే నమోదయ్యాయి. తాజా కేసులతో కలుపుకుని...రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 1, 016కి పెరిగింది. ఎలాంటి మరణాలు సంభవించలేదు. 409 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ వైరస్ బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య 25గానే ఉంది. కాగా గత అదివారం నుంచి తెలంగాణ వ్యాప్తంగా కేసులు పూర్తిగా తగ్గినట్లు గణంకాలు స్పష్టం చేస్తున్నాయి, ఆదివారం రోజున 11 కేసులు, సోమవారం 2 కేసులు, మంగళవారం 6 కేసులు, బుధవారం 7 కేసులు మాత్రమే నమోదయ్యాయి.

రాష్ట్రంలో 11 జిల్లాను కరోనా రహిత జిల్లాలుగా వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో వరంగల్ గ్రామీణ, వనపర్తి, యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, నాగర్ కర్నూలు, ములుగు జిల్లాల్లో కేసులు నమోదైనా కూడా వీరందరూ కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిథిలోనూ కంటైన్మెంట్ జోన్లు, రెడ్ జోన్లను కూడా క్రమంగా అధికారులు ఎత్తివేస్తున్నారు. దీంతో సీఎం కేసీఆర్, ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ చెప్పినట్లు మే 8 తేది నాటికి తెలంగాణ కరోనా విముక్త రాష్ట్రంగా మారుతుందనడంలో సందేహం లేదన్న వాదనలు కూడా తెరపైకి వస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles