Rishi Kapoor: Bollywood's romantic hero dies at 67 బాలీవుడ్ లో మరో విషాదం.. అగ్రనటుడు రుషీకపూర్ కన్నుమూత

Veteran actor rishi kapoor dies in mumbai

Rishi Kapoor,Rishi Kapoor Death,Rishi Kapoor Dies,Rishi Kapoor Passes Away,RIP Rishi Kapoor,Rishi Kapoor Cancer,Rishi Kapoor News, bollywood, movies, Entertainment

Veteran actor Rishi Kapoor has died at 67 after a two-year-long battle with cancer. The 67-year-old actor was admitted in H N Reliance hospital, where he breathed his last today morning. His brother Randhir Kapoor confirmed the news.

బాలీవుడ్ లో మరో విషాదం.. అగ్రనటుడు రుషీకపూర్ కన్నుమూత

Posted: 04/30/2020 11:54 AM IST
Veteran actor rishi kapoor dies in mumbai

బాలీవుడ్‌ లో వరుస విషాదాలు అలుముకున్నాయి, నిన్న ప్రముఖ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మరణిచిన 24 గంటలు కూడా గడవకముందే మరో అగ్ర నటుడు రిషీకపూర్‌(67) కన్నుమూశారు. క్యాన్సర్‌తో బాధపడుతూ ఇవాళ ఉదయం ముంబయిలోని హెచ్‌ఎన్‌ రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. నిన్న రాత్రి రిషీ కపూర్‌ శ్వాసకోశ సంబంధిత సమస్యతో బాధపడుతూ తీవ్ర అస్వస్థతకు గురవడంతో ఆస్పత్రికి తరలించినట్లు ఆయన సోదరుడు రణ్​ధీర్​కపూర్ ​తెలిపారు. చికిత్స కొనసాగుతుండగానే ఇవాళ ఉదయం మృతి చెందారు.

రుషికాపూర్ మరణంతో బాలీవుడ్ లో విషాధఛాయలు అలుముకున్నాయి. ఓ వైపు లాక్ డౌన్ కొనసాగుతుండగానే బాలీవుడ్ లో వరస విషాదాలు చోటుచేసుకోవడం ప్రముఖులను దిగ్ర్భాంతికి గురిచేస్తోంది, గతేడాది సెప్టెంబరులోనే క్యాన్స​ర్ కు చికిత్స తీసుకుని అమెరికా నుంచి భారత ​కు తిరిగి వచ్చారు రిషీ కపూర్​. ఆ తర్వాత వైరల్​ ఫీవర్​, ఇన్​ఫెక్షన్​వంటి సమస్యలతో ఫిబ్రవరిలో రెండు సార్లు ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఎప్పుడు సోషల్​మీడియాలో చురుగ్గా ఉండే రిషి కపూర్.. ఏప్రిల్​ 2వ తేదీ నుంచి ఆయన ట్విటర్ ఖాతాలో ఎటువంటి పోస్ట్​ చేయలేదు.

1952 సెప్టెంబరు 4న ముంబయిలో జన్మించిన రిషీ కపూర్‌.. బాలీవుడ్‌ దిగ్గజం రాజ్‌ కపూర్‌ రెండో కుమారుడు. ఆర్‌.కె.ఫిలిమ్స్‌ బ్యానర్‌ పై పలు చిత్రాలు నిర్మించారు. ఉత్తమ బాలనటుడిగా జాతీయ పురస్కారం అందుకున్నారు. 1973లో తొలిసారి హీరోగా రిషీ కపూర్‌ బాబీ చిత్రంలో నటించారు. దాదాపు 51 చిత్రాల్లో కథానాయకుడిగా నటించి మెప్పించారు. 41 చిత్రాల్లో మల్టీ స్టారర్‌ కథానాయకుడిగా నటించారు. బాబీ, లైలా మజ్నూ, సర్గమ్‌, నగీనా, చాందినీ, హనీమూన్‌, దీవానా, గురుదేవ్‌ చిత్రాలు రిషీకపూర్‌కు మంచి గుర్తింపు తెచ్చాయి. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన‌ మృతిపట్ల సంతాపం తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles