Telanagana Government keeps price check on Goat meat మటన్ రేటుపై సర్కార్ చెక్.. అధిక ధరకు అమ్మితే కఠిన చర్యలు..

Telanagana government keeps price check on goat meat orders to sell at rs 700 per kg

Corona, Corona Alert, Coronavirus, Coronavirus Crisis, meat cost, goat meat, mutton cost, GHMC, Animal Husbandry, lockdown, corornavirus, covid-19, Coronavirus impact, Coronavirus India, Coronavirus outbreak, coronavirus pandemic, Covid_19, Covid_19 australia, Covid_19 india, COVID_2019, Lockdown in Hyderabad, mutton price in telangana

Telanagana Government keeps price check on Goat meat, as the mutton shop vendors are selling mutton at higher prices, In this view Goverment orders all the vendors to sell goat meat at Rs 700 per KG, If any one violates this rule action will be initiated against them.

మటన్ రేటుపై సర్కార్ చెక్.. అధిక ధరకు అమ్మితే కఠిన చర్యలు..

Posted: 04/28/2020 02:31 PM IST
Telanagana government keeps price check on goat meat orders to sell at rs 700 per kg

ప్రపంచంపై తీవ్ర ప్రభావం చూపుతున్న కరోనా వైరస్ మ‌హ‌మ్మారిని నియంత్రించేందుకు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. ఇదే అదనుగా భావించిన మేక మాంసం విక్రయదారులు.. మటన్ రేట్లను అమాంతం పెంచేశారు. మొదట్లో కోడి మాంసంతో కూడా కరోనా వ్యాధి వస్తుందన్న వదంతుల నేపథ్యంలో చికెన్ కొనేందుకు ఎవరూ ముందకురాలేదు. ఫలితంగా చికెన్ ను పలు దుకాణాదారులతో పాటు కోళ్లఫారమ్ యజమానులు కూడా వాటిని ఉచితంగా స్థానికులకు పంచిపెట్టారు.

ఈ క్రమంలో చికెన్ ధరలు గణనీయంగా పడిపోయాయి. అయితే సీఎం కేసీఆర్ ప్రకటన నేపథ్యంలో చికెన్ అమ్మాలు జోరందుకున్నాయి. క్రమంగా చికెన్ ధరలకు కూడా రెక్కలు రావడం ప్రారంభమైయ్యాయి. ప్రస్తుతం చికెన్ ధరలు కిలోకు రూ. 240 వరకు కొనసాగుతున్నాయి. అయితే ఇదే సమయంలో మటన్ ధరలు మాత్రం ఆకాశాన్ని అంటుతున్నాయి. ఏకంగా కిలో మటన్ రూ.900 నుంచి వెయ్యి రూపాయల ధర పలుకుతోంది. దీంతో వెంటనే రంగంలోకి దిగిన ప్రభుత్వం.. మటన్ ధరలను అమాంతం పెంచడంపై దిద్దుబాటు చర్యలకు దిగింది.

మాంసం డిమాండ్ ఎక్కువ‌గా ఉండ‌టంతో వ్యాపారులు విచ్చ‌ల‌విడిగా ధ‌ర‌లు పెంచి విక్ర‌యిస్తున్నారు. అంతేకాదు, చాలా చోట్ల మాంసం క‌ల్తీ చేసి అమ్ముతున్న‌ట్లుగా ప్ర‌భుత్వం దృష్టికి వ‌చ్చింది. ఈ నేపథ్యంలో పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ ఆదేశాల మేరకు మాంసం ధరలను నియంత్రించేందుకు ప్ర‌త్యేక క‌మిటీని ఏర్పాటు చేశారు. కమిటీ సభ్యులు న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల్లో పర్యటించారు. సుమారు 11 మాంసం దుకాణాల్లో సోదాలు చేశారు. ఈ క్రమంలో లైసెన్స్‌ లేని దుకాణాలపై కొరడా ఝుళిపించారు. ఈ మేర‌కు మాంసం ధ‌ర‌ను కూడా నిర్ణ‌యించారు.

సికింద్రాబాద్‌లోని కొన్ని మటన్ షాపుల్లో మాంసం క‌ల్తీ చేసి విక్రయిస్తున్నారన్న సమాచారం మేరకు జీహెచ్ఎంసీ, పశుసంవర్థక శాఖ ప్రత్యేక బృందాలు త‌నిఖీలు చేశాయి. లోపల సోదాలు చేసిన అధికారులు నకిలీ మాంసం అమ్ముతున్న దుకాణాలను సీజ్ చేశారు. లాక్ డౌన్ స‌మ‌యంలో మాంసాన్ని ఎక్కువ ధరలకు విక్రయించ‌డంతో పాటు, ధరల సూచీని కూడా ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ మేర‌కు మ‌ట‌న్ ధ‌ర కిలో రూ. 700లుగా నియ‌మించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధర మేరకు ప్రతి దుకాణం ముందు అందరికీ కనిపించేలా బోర్డులు ఏర్పాటు చేయాల‌ని సూచించారు. ప్ర‌భుత్వ నిబంధ‌న‌లు ఉల్లంఘించి ఎవ‌రైనా అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పశుసంవర్థక శాఖ హెచ్చ‌రించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : meat cost  goat meat  mutton cost  GHMC  Animal Husbandry  lockdown  corornavirus  covid-19  

Other Articles