82 new Covid-19 cases reported in AP ఏపీలో కరోనా విజృంభన.. 24 గంటల్లో 82 కేసులు

Ap records 82 new covid 19 cases in the last 24 hours taking the overall tally to 1 259

covid-19, coronavirus, coronavirus in india, coronavirus in ap, covid-19 in ap, coronavirus updates, coronavirus pandemic, fight against coronavirus, covid-19 outbreak, coronavirus outbreak in andhra pradesh, coronavirus in nellore, coronavirus in Krishna, coronavirus in prakasam, coronavirus in in kadapah, coronavirus in west godavari, coronavirus news, coronavirus latest news, coronavirus latest update, coronavirus andhra pradesh, coronavirus updates,

Andhra Pradesh reported 82 new Coronavirus positive cases, with this, the number of positive cases as of positive cases as of Tuesday morning reaches 1259. In all, 258 persons completed treatment and were discharged from hospitals.

ఆంధ్రప్రదేశ్ లో వేగంగా వ్యాపిస్తున్న కరోనావైరస్.. 24 గంటల్లో 82 కేసులు

Posted: 04/28/2020 01:24 PM IST
Ap records 82 new covid 19 cases in the last 24 hours taking the overall tally to 1 259

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల వ్యాప్తి వేగంగా పెరుగుతోంది. ఢిల్లీ హజ్రత్ నిజాముద్దీన్ లింకు బయటపడిన తరువాత విసృతంగా వ్యాప్తిం చెందుతూ క్రమంగా రాష్ట్రంలో తన ప్రభావం బారిన అనేకలను పడేసింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూ ఏకంగా వెయ్యి మార్కును దాటి.. 1250 మార్కును కూడా దాటేసింది. కోవిడ్ విస్తరణ రాష్ట్ర ప్రజలను కలవరపాటుకు గురిచేస్తోంది. సోమవారం ఉదయం పదకొండు గంటల నుంచి ఇవాళ ఉదయం పదకొండు గంటల వరకు రాష్ట్రంలో కొత్తగా 82 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య అరోగ్యశాఖ వెల్లడించింది. వీటితో కలిపి రాష్ట్రంలో కొవిడ్‌ కేసుల సంఖ్య 1259కి చేరింది.

ఇక రాష్ట్రంలో మరణాల సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతూ వుండటం ప్రజలను కలవరానికి గురిచేస్తోంది. రాష్ట్రంలో తాజాగా మరణాలు నమోదు చేసుకోనప్పటికీ.. పోరుగు రాష్ట్రాలతో పోల్చితు 31 మరణాలు సంభించడం కలవరానికి గురిచేస్తోంది. ఇక ఇప్పటి వరకు కరోనావైరస్ బారిన పడినవారిలో మొత్తంగా 258 మంది వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్ అయ్యారు. ఇవాళ నమోదైన కేసుల్లో అత్యధికంగా కృష్ణాలో 13, కర్నూలులో 40, గుంటూరు జిల్లాలో 17 కేసులు, కడపలో ఏడు, చిత్తూరు, అనంతపురంలో ఒక్కటి చోప్పునా, నెల్లూరులో 3 కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 1259కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ ఆసుపత్రుల్లో ప్రస్తుతం 970 మంది చికిత్స పొందుతున్నారు.

జిల్లాల వారీగా ఇప్పటి వరకు నమోదైన కరోనా వైరస్ పాజిటివ్ కేసుల వివరాలు ఇలా వున్నాయి,. రాష్ట్రంలో అత్యధికంగా కర్నూలు జిల్లాలో 332 కేసులు నమోదు కాగా, తాజాగా మరో మరణంతో మొత్తంగా 9 మరణాలు సంభవించాయి. ఆ తర్వాత గుంటూరు జిల్లాల్లో 254 కేసులు ఎనమిది మరణాలు నమోదుకాగా, కృష్ణా జిల్లాలో 223 పాజిటివ్ కేసులు, ఎనమిది మరణాలు సంభవించాయి. నెల్లూరు-82 కేసులు రెండు మరణాలు, ప్రకాశం- 56, పశ్చిమగోదావరి-39, చిత్తూరు-74,  విశాఖపట్నం-22, కడప జిల్లాలో 65 కేసులు, అనంతపురం-54 కేసులు నాలుగు మరణాలు సంభవించాయి. తూర్పుగోదావరి జిల్లాలో 39 కేసులు, ఇక తాజాగా శ్రీకాకుళంలో అత్యల్పంగా నాలుగు కేసులు నమోదయ్యాయి, ఇక విజయనగరం జిలాలో ఇప్పటికీ ఒక్క కరోనా కేసు నమోదు కాకపోవడంతో జిల్లా అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles