Megastar Greets Naidu With Praises చంద్రబాబుకు చిరంజీవి పుట్టిన రోజు శుభాకాంక్షలు

Chiranjeevi greets chandrababu on his 71st birthday on twitter

covid-19, coronavirus, lockdown, fight aginst covid-18, Chiranjeevi, megastar, twitter, Chandrababu, former Chief Minister, TDP, Birthday, Hyderabad, Chennai

Chandrababu Naidu former CM of Andhra Pradesh is celebrating his 70th Birthday today. Wishes are showered on Naidu from all quarters on his birthday.Megastar Chiranjeevi took to social media to greet Naidu. Chiranjeevi has shared a photo in which he and Chandrababu were in a happy mood.

చంద్రబాబుకు మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు శుభాకాంక్షలు

Posted: 04/20/2020 05:07 PM IST
Chiranjeevi greets chandrababu on his 71st birthday on twitter

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదినం రోజును పురస్కరించుకుని ఆయనకు పలు రంగాలకు చెందిన ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లివిసురుతున్నాయి. ఈ నేపథ్యంలో టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవి కూడా చంద్రబాబు 71వ జన్మదినాన్ని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు చంద్రబాబు  పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు ట్విటర్‌ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు సంకల్పబలం అనితర సాధ్యమని కొనియాడారు. ప్రజాసేవలో దశాబ్దాలుగా కొనసాగుతున్న నేత చంద్రబాబు అని ప్రశంసించారు.

చంద్రబాబు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో లాక్‌డౌన్ కారణంగా హైదరాబాద్‌లోని తన నివాసంలోనే చంద్రబాబు నిరాడంబరంగా జన్మదిన వేడుకలు జరుపుకోనున్నారు. పుట్టినరోజు సందర్భంగా తమ అధినేతకు నేతలు, కార్యకర్తలు సామాజిక మాధ్యమాల ద్వారా పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. పలువురు నేతలు, కార్యకర్తలు పలు చోట్ల సేవా కార్యక్రమాలు చేపట్టారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chiranjeevi  megastar  twitter  Chandrababu  former Chief Minister  TDP  Birthday  Hyderabad  coronavirus  covid-19  

Other Articles