Liquor being sold at medical store amid lockdown వాటర్ బాటిల్స్ లో బీరు విక్రయం.. మెడికల్ షాపు యజమానికి అరదండాలు

Liquor being sold at medical store amid lockdown in maharashtra

medical store sells alcohol, medial store raided, coronavirus outbreak, coronavirus in india, coronavirus news, coronavirus india, coronavirus, lockdown in india, lockdown news update today, lockdown in maharashtra, lockdown stories, india lockdown, coronavirus india, india coronavirus, coronavirus update, india corona, coronavirus cases in india, india coronavirus news, india coronavirus lockdown, covid 19

In Nagpur, the rules of lockdown are being easily broken. Liquor was being sold at a medical store. The Police conducted a raid at the place and caught the boxes in which the liquor was being sold. The owner was solding beer in the boxes of mineral water bottles.

వాటర్ బాటిల్స్ లో బీరు విక్రయం.. మెడికల్ షాపు యజమానికి అరదండాలు

Posted: 04/16/2020 04:52 PM IST
Liquor being sold at medical store amid lockdown in maharashtra

సాధారణంగా వేసవిలో చల్లని వాటర్ బాటిల్స్ కు డిమాండ్ ఎక్కువ. సాధరణ దనవంతులు రూ.20 పెట్టి ఫ్యాకేజ్ వాటర్ బాటిల్ కొంటారు. అదే కుబేరులైతే ఏ హిమాలయా వాటర్ బాటిల్ కొనుకుంటారు. అయితే దేశంలో కరోనా వైరస్ పుణ్యమా అని దేశంలో లాక్‌ డౌన్ కారణంగా దుకాణాలు అన్ని బంద్ వుంటే.. ఇక చల్లని నీరు అడిగే వారే లేరు. అందునా.. కరోనా వైరస్ కు విరుగుడుగా గరు వెచ్చని నీళ్లు తాగాలని వైద్యుల నుంచి అయుష్ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో ఇక చల్లని నీరుకు డిమాండ్ తక్కువగా వుండటం కాదు.. అసలే లేదని చెప్పక తప్పదు.

ఇదిలావుంటే ఇక లాక్ డౌన్ వేళ మద్యం బాబుల అగచాట్లు చెప్పనలవి కాదు. కొందరు మద్యం వ్యాపారులు మాత్రం ఇప్పటికే తమ వద్దనున్న స్టాక్ మొత్తం బ్లాక్ లో అమమెశారు. ఇక మద్యం మత్తు దొరకక నానా అవస్థలూ పడుతున్న వేళ, వీరి దురవస్థను క్యాష్ చేసుకునేందుకు ప్రయత్నించిన ఓ మెడికల్ షాపు యజమానికి పోలీసులు అరదండాలు వేశారు. ఈ ఘటన మహారాష్ట్రలోని నాగపూర్ లో జరిగింది.  పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల్లోకి వెళితే, లాక్ డౌన్ కారణంగా బార్లు, వైన్ షాపులు మొత్తం బంద్ అయిపోయిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో నాగపూర్, గణేష్‌పేట్ ప్రాంతంలోని ఓ మెడికల్ షాపు యజమాని నిషాంత్ అలియాస్ బంటీ ప్రమోద్ గుప్తా(36), తన షాపులోనే బీర్ అమ్మకాలు ప్రారంభించాడు. మంచినీళ్ల బాటిల్స్ లో బీర్ ను నింపి ఆయన అమ్మకాలు ప్రారంభించాడు. ఈ విషయం ఆనోటా, ఈనోటా పాకి, చివరకు పోలీసులకు చేరింది. దీంతో వారు సడన్ గా రైడ్ చేయగా, లీటర్ల కొద్దీ బీర్ లభించింది. దీంతో అతన్ని అరెస్ట్ చేసిన పోలీసులు, పలు సెక్షన్ల కింద కేసును రిజిస్టర్ చేశారు. ఇదే కేసులో తప్పించుకున్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నట్టు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Beer  Medical Shop  Sales  Water Bottles  Liquor shop  Arrest  Police  lockdown  coronavirus  covid 19  Nagpur  Maharashtra  Crime  

Other Articles