Man jailed for spreading rumours in Chittoor సిద్దిపేటవాసిని అరెస్టు చేసిన చిత్తూరు పోలీసులు..

Siddipet man held on charge of spreading rumours against kanipakam temple

Coronavirus Pandemic, Coronavirus, community spread, lockdown, coronavirus outbreak, coronavirus, covid 19, Vishnuvardhan Reddy, YSRCP Govt, Corona Virus, Fake News, Socia media, Twitter, Facebook, Siddipet, Srikalahasti Temple, Telangana. Kanipakam Temple. AP Police, Chittoor District, Andhra Pradesh, Crime

The Chittoor district police have arrested a man from Siddipet in Telangana on charges of criminal conspiracy, sedition, promoting enmity among different communities, and issuing statements amounting to public mischief.He is accused of spreading rumours against the devasthanam of Sri Varasiddhi Vinayaka Swami Temple at Kanipakam near Chittoor.

తెలంగాణ వాసిని అరెస్టు చేసిన ఏపీ పోలీస్.. సోషల్ మీడియాలో తప్పుడు పోస్టు..

Posted: 04/16/2020 01:49 PM IST
Siddipet man held on charge of spreading rumours against kanipakam temple

దేశప్రజలందరూ కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన లాక్ డౌన్ నేపథ్యంలో ఇళ్లకు మాత్రమే పరిమితం అయ్యారు. దీంతో అనునిత్యం సోషల్ మీడియాను అంటిపెట్టుకునే వుంటున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు పోస్టులతో వారు కలవరానికి గురువుతున్నారు. దీంతో అపత్కాల సమయంలో ప్రజలు ఎలాంటి అందోళనకు గురికాకుండా వుండేందుకు తప్పుడు పోస్టులతో పాటు అలాంటి పోస్టులను అప్ లోడ్ చేసిన వ్యక్తులపై పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు. ఇదే సమయంలో ప్రజల మధ్య వర్గవైషమ్యాలను రెచ్చగొట్టేలా.. పోస్టులు పెట్టినవారిపైనా అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు.

తాజాగా, చిత్తూరు జిల్లా కాణిపాకంలో ఉన్న వరసిద్ధి వినాయక స్వామి ఆలయంపై తప్పుడు పోస్టులను ప్రచారం చేసిని తెలంగాణ వాసిని చిత్తూరు పోలీసులు అరెస్టు చేశారు. ఈ వ్యక్తి తప్పుడు పోస్టులు అప్ లోడ్ చేయడంతో పాటు తమ వాట్సాప్ ఖాతాల ద్వారా ఎంతో మందికి పంపడంలో రంగంలోకి దిగిన చిత్తూరు పోలీసులు తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేటకు వచ్చి మరీ వ్యక్తి అదుపులోకి తీసుకుని చిత్తూరు జిల్లా కోర్టులో హాజరుపర్చారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, సిద్దిపేట జిల్లాకు చెందిన ఎం విష్ణువర్ధన్‌ రెడ్డి (56) తన ఫేస్‌ బుక్, ట్విటర్‌ ఖాతాల ద్వారా, కాణిపాకం ఆలయాన్ని క్వారంటైన్‌ సెంటర్‌ గా మార్చారంటూ ప్రచారం చేశాడు.

దీనిపై కాణిపాకం ఆలయం ఎగ్జిక్యూటివ్ అధికారి (ఈఓ) పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విష్ణు వర్ధన్ రెడ్డిని చిత్తూరు పోలీసులు అరెస్ట్ చేసి, ఏపీకి తరలించారు. కోర్టు ఆదేశాలతో చిత్తూరులోని జిల్లా జైలుకు తరలించారు. కాగా, ఈ కేసులో నేరం రుజువైతే 2 ఏళ్లకు పైగా జైలు శిక్షపడుతుందని పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు. ఓ కాలనీ పేరును చెబుతూ, అక్కడ అన్ని కేసులు వచ్చాయని ప్రచారం చేయడం తప్పని, వైరస్ పాజిటివ్ వచ్చిన వారి చిత్రాలను పోస్ట్ చేస్తే మరిన్ని కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles