Passenger trains, flight ban extended till May 3 రైళ్లు, విమాన సర్వీసులపై మే 3 వరకు నిషేధం

No domestic international flights train travel till may 3 centre

domestic flights May 3, passenger flights May 3, international flights May 3, train travel May 3, May 3, lockdown extension May 3" itemprop="keywords

With Prime Minister Narendra Modi confirming on Tuesday that the pan-India lockdown will be continued till May 3, the travel restrictions will also be extended till the new lockdown deadline.

ప్యాసింజర్ రైళ్లు, దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు కూడా రద్దు..

Posted: 04/14/2020 06:52 PM IST
No domestic international flights train travel till may 3 centre

కరోనా వైరస్ మహమ్మారిని నియంత్రించడంలో భాగంగా దేశంలో విధించిన లాక్ డౌన్ ను మే 3వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రకటించడంతో దేశంలో మరోమారు జనజీవనం స్థంభించనుంది. ఇందులో భాగంగా గూడ్స్ వాహనాల రవాణాకు త్వరలో మినహాయింపు కల్పిస్తామని ప్రభుత్వం చెప్పినప్పటికీ.. మనుషుల ప్రయాణాలకు మాత్రం బ్రేక్ పడింది. గత నెల 24 నుంచి ఈనెల 14 వరకు ప్రకటించిన తొలిదశ లాక్ డౌన్ ను మరో 19 రోజల పాటు పొడగించడంలో రెండో దశ కొనసాగుతుంది.

ఈ నేపధ్యంలో రైల్వేశాఖ కూడా మే 3వ తేదీ అర్ధరాత్రి వరకు తమ సర్వీసులను నిలిపివేస్తున్నట్టు తెలిపింది. ఈ మేరకు ట్విటర్‌లో ఒక ప్రకటన చేసింది. అయితే గూడ్స్‌ సర్వీసులు యథావిథంగా కొనసాగనున్నాయి. ఇక విమాన సేవల గురించి కేంద్ర  పౌర విమానాయాన శాఖ ఇప్పటికే స్పష్టత ఇచ్చింది. అన్ని దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులను మే 3వ తేదీ రాత్రి 11.59 గంటల వరకు నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. కాగా, మార్చి 24న మోదీ లాక్‌డౌన్‌ ప్రకటన చేయడానికి ముందే అంతర్జాతీయ సర్వీసులపై భారత్‌ నిషేధం విధించింది.

ఆ తర్వాత ఒకటి రెండు రోజుల్లోనే దేశీయ విమాన సర్వీసులను కూడా నిలిపివేశారు. అయితే గతవారం కొన్ని విమాన సర్వీసులను పునరుద్దరించాలని చర్చలు జరిపినప్పటికీ.. ప్రస్తుత పరిస్థితుల కారణంగా అందుకు ఆమోదం లభించలేదు. ఈ నేపథ్యంలో మే 3 వరకు గూడ్స్‌, పార్శిల్ మినహా అన్ని రకాల రైళ్ల సర్వీసులను రద్దు చేస్తున్నట్లు భారతీయ రైల్వే వెల్లడించింది. తాజాగా మే 3 వరకు ముందస్తు టికెట్లు బుకింగ్ చేసుకున్న వారికి పూర్తి నగదును వాపసు ఇవ్వనున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. ఈ మేరకు ఆన్‌లైన్‌లో టికెట్‌ బుక్‌ చేసుకున్న వారి టికెట్లు వాటంతటవే రద్దయి, పూర్తి సొమ్ము ప్రయాణికుల ఖాతాల్లో పడుతుందని తెలిపింది. అలానే టికెట్‌ కౌంటర్లలో బుక్‌ చేసుకున్న వారు జులై 31 వరకు రిఫండ్ పొందవచ్చు. ఇప్పటి వరకు టికెట్లు రద్దు చేసుకోని వారికి కూడా పూర్తి నగదును తిరిగి చెల్లించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles