Kamal blames Modi, shoots letter to PM కరోనాపై యుద్దం: ప్రధాని మళ్లీ అదే తప్పు చేశారన్న కమల్ హాసన్

Kamal hassan flays modi govt for delayed handling covid 19 situation in india

Kamal Hassan flays Modi govt, Kamal Hassan, Makkal Needhi Maiam (MNM) founder, Narendra Modi, same mistake of demonetisation, noteban in india, Coronavirus, Narendra Modi news, power crids Trip, Narendra Modi latest, Narendra Modi video, Narendra Modi message, Narendra Modi about coronavirus, Coronavirus news, Coronavirus updates, Narendra Modi New Video Message About Coronavirus, Narendra Modi, PM Modi, New Video Message, Coronavirus, LIghts, candles, Oil Lamps, electrical bulbs, Covid-19, People of India

Makkal Needhi Maiam (MNM) founder Kamal Haasan on Monday flayed the BJP-led government at the Centre for its handling of the situation arising out of Covid-19 pandemic, saying the "same mistake of demonetisation is being repeated,.

కరోనాపై యుద్దం: ప్రధాని మళ్లీ నోట్ల రద్దు తప్పును చేశారన్న కమల్ హాసన్

Posted: 04/06/2020 05:10 PM IST
Kamal hassan flays modi govt for delayed handling covid 19 situation in india

కరోనా కట్టడిని చేసేందుకు కేంద్రంలోని బీజేపి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. దేశం మొత్తాన్ని లాక్ డౌన్ చేయడం ఎంతో సాహాసోపేత నిర్ణయమని.. ఇలా చేయాని దేశాల్లో పరిస్థితులు తలకిందులుగా మారాయిన ఇప్పటికే పలువురు దేశాధినేతలు ప్రధానమంత్రి నరేంద్రమోడీని ప్రశంసలు కురిపిస్తుండగా, విభిన్ననటుడు, రాజకీయ నేత కమల్ హాసన్ మాత్రం ప్రధాని తప్పు చేశారని విమర్శించారు. అంతేకాదు ప్రధాని తప్పుచేశారని ఆయన ఏకంగా బహిరంగ లేఖను ప్రధానికి రాశారు. మళ్లీ గతంలో  చేసినతప్పునే ప్రధాని పునారావృతం చేశారని అన్నారు.

నోట్ల రద్దు నిర్ణయం ఎంత పెద్ద తప్పో తర్వాత కాలంలో తేలిందని, ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పుడు మరో తప్పు చేస్తున్నారని మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) పార్టీ అధినేత కమలహాసన్ విమర్శించారు. ఈ మేరకు ఆయన ప్రధానికి బహిరంగ లేఖ రాశారు. నోట్ల రద్దు నిర్ణయం తరహాలోనే అకస్మాత్తుగా లాక్ డౌన్ ప్రకటించారని ఆరోపించారు. నాడు నోట్ల రద్దుతో  పేద ప్రజల పొట్టకొట్టారని, నేడు లాక్ డౌన్ కారణంగా జీవనోపాధితో పాటు జీవితాలే గల్లంతవుతున్నాయని తెలిపారు.

"మీరు దీపాలు వెలిగించమంటే మీ వాళ్లు బాల్కనీల్లో ఎంచక్కా మంచినూనెతో దీపాలు వెలిగించారు, కానీ పేదలు మాత్రం రొట్టెలు చేసుకునేందుకు నూనె దొరక్క అవస్థలు పడుతున్నారు. మీ ప్రసంగాలు కూడా బాగానే ఉన్నాయి. బాల్కనీలు 'ఉన్న'వాళ్ల భయాలు తొలగించేందుకు మీ ప్రసంగాలు ఉపయోగపడుతున్నాయి, కానీ, నెత్తిన పైకప్పు తప్ప మరేమీ లేని బడుగుల మాటేమిటి? జీడీపీకి ప్రధాన వనరు అనదగ్గ పేదవాళ్లను విస్మరించడం తగదు. అలాంటివారిని అణగదొక్కాలని జరిగిన ప్రయత్నాలకు చరిత్రలో ఎలాంటి జవాబులు వచ్చాయో మీరు తెలుసుకోవాలి.

చైనాలో తొలి కరోనా కేసు వచ్చినప్పటి నుంచి మీరు ఎందుకు స్పందించలేదు? మీ దార్శనికత ఏమైంది? హడావుడిగా లాక్ డౌన్ నిర్ణయం ప్రకటించారు. దార్శనికత ఉన్న నాయకులైతే సమస్య తీవ్రతరం కాకముందే స్పందిస్తారు. ఈ విషయంలో మీరు విఫలం అయ్యారనే భావిస్తున్నాం. మీరు అందరినీ కలుపుకుని ముందుకుపోవాలనుకుంటే మేము సైతం మీకు తోడుగా ఉంటాం, మాకు ఎంతో ఆగ్రహం కలుగుతున్నా గానీ మేం ఇప్పటికీ మీవెంటే ఉన్నాం" అంటూ లేఖను ముగించారు. అయితే ఈఎంఐలపై వడ్డీ రాయితీల మాటేమిటీ అని ప్రశ్నించినందుకే కాంగ్రెస్ పార్టీని ఈ సమయంలో రాజకీయాలా.? అంటూ ప్రశ్నించిన బీజేపి మరి కమల్ హాసన్ బహిరంగ లేఖపై ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles