AP reports 43 new COVID-19 cases total tally at 87 ఆంధ్రప్రదేశ్ లో ఒక్క రోజునే 43 కరోనా పాజిటివ్ కేసులు..

Ap reports 43 new covid 19 cases total tally at 87 all of them attended delhi event

coronavirus,coronavirus in Andhra Pradesh,Andhra Pradesh coronavirus cases,coronavirus cases in Andhra Pradesh,coronavirus count in india,india coronavirus count,Tabilghi Jamat,'Tabilghi jamat cases,Nizamudding event,Delhi coronavirus cases,Delhi Nizamuddin coronavirus cases,coronavirus india,coronavirus update,coronavirus in india,coronavirus cases,coronavirus cases india,coronavirus update india,coronavirus news,COVID-19,COVID 19 update,coronavirus in ap,coronavirus andhra pradesh

Andhra Pradesh witnessed a massive jump in COVID-19 count as 47 fresh cases were reported since last night. At present, there are 87 coronavirus patients in the state, Andhra Pradesh government confirmed.

ఆంధ్రప్రదేశ్ లో ఒక్క రోజునే 43 కరోనా పాజిటివ్ కేసులు..87కు చేరిన బాధితుల సంఖ్య

Posted: 04/01/2020 12:28 PM IST
Ap reports 43 new covid 19 cases total tally at 87 all of them attended delhi event

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ కేసుల సంఖ్య భారీగా పెరిగింది. ఈ ఒక్క రోజే 43 కొవిడ్‌ కేసులు నమోదు కావడం గమనార్హం. దీంతో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య రాష్ట్రంలో 87కి చేరిందని వైద్య ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించింది. నిన్న రాత్రి 9 గంటల నుంచి ఉదయం 9 గంటల మధ్య 43 కొత్త కేసులు నమోదైనట్లు తాజా బులిటెన్‌లో తెలిపింది. ఇద్దరి ఆరోగ్య పరిస్థితి మెరుగైనట్లు పేర్కొంది. దిల్లీలో మతపరమైన ప్రార్థనలకు హాజరై తిరిగివచ్చిన వారి ఆరోగ్య పరిస్థితిని తనిఖీ చేయడంతో పెద్ద ఎత్తున కేసులు వెలుగులోకి వచ్చాయి.

గత 12 గంటల వ్యవధిలో 373 మంది నమూనాలను పరీక్షించగా.. అందులో 330 నెగిటివ్‌గా నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు. ఈ ఒక్క రోజే తొలిసారిగా కడప జిల్లాలో 15, పశ్చిమగోదావరి జిల్లాలో 13 కొత్త కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. చిత్తూరు జిల్లాలో 5, ప్రకాశం జిల్లాలో 4, తూర్పుగోదావరి జిల్లాలో 2, నెల్లూరు జిల్లాలో 2, కృష్ణ 1, విశాఖ జిల్లాలో 1 కొత్త కేసు నమోదయ్యాయి. నిజాముద్దీన్‌ ఘటన నేపథ్యంలో ఆయా జిల్లాలు పూర్తిగా అప్రమత్తమయ్యాయి.

11 జిల్లాలకు విస్తరించిన కరోనా..

రాష్ట్రంలో రెండు, మూడు జిల్లాలకు మాత్రమే పరిమిమైన  కరోనా వైరస్.. తాజాగా 11 జిల్లాలకు విస్తరించింది. ఢిల్లీలో నిజాముద్దీన్ మర్కజ్ మసీదులో జరిగిన మతప్రచార కార్యక్రమాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వందల సంఖ్యలో వెళ్లిన ముస్లింలతో ఈ రోజు కొత్తగా పలు జిల్లాల్లో కేసులు నమోదయ్యాయి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఇప్పటి వరకూ ఎలాంటి కేసులు నమోదు కాలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles