ktr hilarious batter with twitterati fed up with wife భార్యబాధిత భర్తకు చమత్కార బదులిచ్చిన మంత్రి

Coronavirus alert ktr reply to a twitterati who is fed up with wife during lockdown

coronavirus in india, coronavirus, covid-19, corona spread, ktr, ktr tweets, ktr twitter, ktr news, ktr on ap students, KTR Suman Yadav, Twitter, frustrated Husband, wife and Husband, coronavirus in india update, total cases of coronavirus in india, coronavirus hyderabad, coronavirus cases, coronavirus in hyderabad, lockdown in hyderabad, telangana lockdown, coronavirus live update india, coronavirus in india, coronavirus in india latest news

In the wake of a spike in Covid-19 cases in India, Central Government has lockdown entire country, Telangana Minister KTR reply to a twitterati who is fed up with wife during lockdown is hilarious batter

భార్యబాధిత భర్తకు చమత్కార బదులిచ్చిన మంత్రి కేటీఆర్

Posted: 03/28/2020 02:25 PM IST
Coronavirus alert ktr reply to a twitterati who is fed up with wife during lockdown

కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో ప్రజలు అంతా ఇళ్లకే పరిమితం అవుతున్నారు. అయితే, ఈ లాక్ డౌన్ రోజులను ఎలా గడపాలా? అని చాలా మంది సందేహిస్తున్నారు. కొందరు తమ కుటుంబంతో అన్యోన్యంగా గడుపుతుంటే, మరికొందరు పిల్లలతో, పెద్దవారితో గడిపేందుకు సమయం వచ్చిందని ఆనంద పడుతున్నారు. మందుబాబులం మేము మందుబాబులం అంటూపాడే వారికి అది కూడా దూరమయ్యింది. దీంతో మందుపడితే తప్ప తమకు కోపం రాని భర్తలు.. మౌన మునుల మాదిరిగా భార్యలకు దొరికిపోయారు.

అయితే, ఓ వ్యక్తికి క్లిష్టమైన సమస్య ఎదురైంది. లాక్ డౌన్ వల్ల ఇంటి దగ్గర పెళ్లాంతో చస్తున్నా అంటూ ఓ వ్యక్తి కేటీఆర్‌ కు ట్యాగ్ చేసి ట్వీట్ చేశాడు. ‘కేటీఆర్ అన్నా, ఇంటి దగ్గర పెళ్లాంతో చస్తున్నా. నా రిక్వెస్ట్ ఏంటంటే, టీవీ చానల్ వాళ్లను కొంచెం మంచి సినిమాలు వేయమని చెప్పు. లేకపోతే నాకు ఒకే దారి ఉంది. కాబట్టి, ప్లీజ్.’ అంటూ ట్వీట్ చేశాడు. అందుకు కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. ‘మీ ఆవిడ ట్విట్టర్‌లో లేదనుకుంటున్నా. (నీ మంచి కోసం)’ అని కేటీఆర్ రిప్లై ఇచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles