3 more deaths take toll to 15 in India దేశవ్యాప్తంగా 500కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు

Coronavirus updates deaths top 21 200 worldwide mostly in europe afp tally

coronavirus in india, coronavirus, covid-19, corona spread, Italy, Spain, Coronavirus, COVID-19, Coronavirus news, section 144 coronavirus, No Public Gathering, noida police commissioner, Gautam Budh Nagar, coronavirus news, coronavirus maharashtra, coronavirus updates, coronavirus in maharashtra, coronavirus in india update, total cases of coronavirus in india, coronavirus hyderabad, coronavirus in tamil nadu, pakistan coronavirus, coronavirus cases, coronavirus in chennai, coronavirus in hyderabad, coronavirus live update india, coronavirus tamil nadu, coronavirus in india mumbai, coronavirus in gujarat, coronavirus in india latest news

The coronavirus pandemic has killed at least 20,599 people worldwide since it first appeared in China in December, according to an AFP tally at 1900 GMT Wednesday using official figures. More than 447,030 cases of infection have been officially diagnosed in 182 countries and territories since the start of the pandemic.

కరోనా కరాళ నృత్యం: ప్రపంచవ్యాప్తంగా 21 వేలు.. దేశంలో 15 మంది మృతులు

Posted: 03/26/2020 09:07 AM IST
Coronavirus updates deaths top 21 200 worldwide mostly in europe afp tally

యవత్ ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మరణమృదంగం మ్రోగిస్తోంది. ఏకంగా 21 వేల మంది ప్రజల ప్రాణాలను కబళించి వేసింది. ఈ మరణాలు ప్రపంచవ్యాప్తంగా అంతకంతకూ పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఈ మహమ్మారి బారినపడి మృతిచెందిన వారి సంఖ్య శనివారం 15 వేలు దాటగా,. ఇవాళ్టికి 21 వేలకు చేరింది. తాజా గణాంకాల ప్రకారం.. కోవిడ్-19 బారినపడి ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 21,200 మంది చనిపోయారు. చైనా నుంచి వ్యాపించిన ఈ వైరస్ కొద్ది రోజుల్లోనే దేశాలకు పాకింది. ఈ వైరస్ కు విరుగుడు, మందు లేకపోవడంతో జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు.

వైరస్ ని కట్టడి చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా అవి కొంత మేరకు మాత్రమే సత్ఫలితాలు ఇస్తున్నాయి. చైనా ఈ వైరస్ ని నియంత్రించడానికి కఠినమైన నిర్ణయాలు తీసుకోవడంతో ఇప్పుడిప్పుడే కంట్రోల్ అవుతోంది. ఇటలీలో మాత్రం మరణమృందంగం మ్రోగిస్తోంది. వేలాది సంఖ్యలో చనిపోతున్నారు. గురువారం ఉదయం వరకు ప్రపంచ వ్యాప్తంగా 21, 200 మందిని బలి తీసుకుంది ఈ మహమ్మారి. మొత్తం 4 లక్షల 68 వేల 905 మందికి ఈ వైరస్ సోకింది. అందులో 14 వేల 792 మందికి సీరియస్ గా ఉంది. 3 లక్షల 33 వేల 487 మంది ఈ వైరస్ తో పోరాడుతుంటే...లక్షా 14 వేల 218 మంది కోలుకున్నారు. 198 దేశాకు కరోనా వైరస్ విస్తరించింది.
 

ఏ దేశంలో ఎంత మంది చనిపోయారంటే..
ఇటలీ : 7,503. స్పెయిన్ : 3,647. చైనా : 3,287, ఇరాన్ : 2, 077. ఫ్రాన్స్ : 1,331, యూఎస్ఐ : 994. యూకే : 465. నెదర్లాండ్స్ : 356. జర్మనీ : 206, బెల్జియం : 178. స్విట్జర్లాండ్ : 153. సౌత్ కొరియా : 126.

మన దేశంలోనూ కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు ఏకంగా 630 కేసులు నమోదుకాగా, తాజాగా మూడు మరణాలతో దేశంలో మృతుల సంఖ్య 15కు చేరింది. గురువారం దేశవ్యాప్తంగా మొత్తం పది కరోనా కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 128 కేసులు నమోదు కాగా, ఆ తరువాత కేరళలో 118 కేసులు నమోదయ్యాయి. ఇటు తెలుగు రాష్ట్రాలలోనూ కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 51కు చేరింది. తెలంగాణలో ఏకంగా 41 కేసులు నమోదు కాగా, ఇటు ఏపీలో తాజాగా నమోదైన రెండు కేసులతో ఈ సంఖ్య పదికి చేరింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : coronavirus  covid-19  COVID-19 news  Coronavirus news  coronavirus hit countries  Italy  Europe  Spain  India  

Other Articles