Man dies of hantavirus in China ‘‘కరోనా వైరస్ భయానక మరణాలతో గతం గుర్తుకోచ్చింది’’

Hantavirus pulmonary syndrome hantavirus has been reported in china

Chinese virus, hantavirus, Coronavirus, Covid-19, Hantavirus pulmonary syndrome, new virus, new hantavirus, what is hantavirus, hantavirus news, hantavirus updates, hantavirus definition, hantavirus facts, china

Even as the coronavirus pandemic keeps spreading and countries around the world report new cases every day, China has reported a death due to a new virus called Hantavirus. China Global Times reported that a man from Yunnan Province died due to the new virus on a bus while returning to Shandong Province.

కరోనా కబళిస్తున్న తరుణంలోనే చైనాలో మరో వైరస్.. ‘‘గత్తెర రోగం..’’

Posted: 03/24/2020 06:09 PM IST
Hantavirus pulmonary syndrome hantavirus has been reported in china

చైనాలోని వూహాన్ నగరంలో వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ ధాటికి ప్రపంచ అగ్రదేశాలు సైతం భీతిల్లిపోతన్నాయంటే అతిశయోక్తికాదు. ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది ప్రాణాలను ఇప్పటికే కబళించిన ఈ వైరస్.. తన కబంధహస్తాలలో ఏకంగా లక్షలాధి మందిని ఇబ్బందికి గురిచేస్తున్న విషయం తెలిసిందే. నాలుగు నెలల క్రితం వెలుగులోకి వచ్చిన ఈ వైరస్.. ఇప్పటికీ ఇంకా తన ప్రభావాన్ని ప్రపంచ దేశాలపై చూపుతూనే వుంది. ఈ వైరస్ ధాటికి ఇప్పటికీ పలు దేశాలలో లాక్ డౌన్ ప్రకటించాయి. అందులో భారత్ కూడా లాక్ డౌన్ ప్రకటించింది. ఇలాంటి పరిస్థితుల్లో పలు దేశాలు హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాయి.

ఇంకా ఈ కరోనా వ్యాదికి మందును కూడా కనుగొనని తరుణంలోనే చైనాలో మరో వైరస్ పుట్టుకోచ్చి.. దడ పుట్టిస్తోంది. అయితే కొత్తగా పుట్టికొచ్చిన ఆ వైరస్‌కు టీకామందు ఉండటం ఊరట కలిగించే అంశం. ఆ వైరస్ పేరే హంటా. చైనాలోని యున్నన్‌ ప్రావిన్స్‌లో ఓ వ్యక్తి హంటా వైరస్‌తో మృతిచెందాడు. ఈ విషయాన్ని ఆ ప్రభుత్వ మీడియా సంస్థ ‘గ్లోబల్‌ టైమ్స్‌’ ట్విటర్‌ ద్వారా తెలియజేసింది. ఈ వైరస్‌ లక్షణాలు సైతం ఫ్లూ, కరోనాని పోలివుండటం గమనార్హం. ఇదిలావుంటూ ఈ వైరస్ గతంలోనూ వేలాది మంది ప్రాణాలను బలితీసుకుంది. చైనాలో 1950 నుంచి 2007 మధ్య హంటా వైరస్‌తో 46,000 మంది మృత్యువాత పడ్డారు. 2005-2010 మధ్య ఫిన్లాండ్‌లో 32వేల మందికి హంటా సోకింది. రష్యాలో 1996 నుంచి 2006 మధ్య 90,000 కేసులు నమోదయ్యాయి.

ఇటు మన దేశంలోనూ ఈ వైరస్ తన ప్రభావాన్ని చూపిందని, తెలంగాణలో దీనిని గత్తర రోగం అని పిలిచేవారని సమాచారం. ఈ హంటా వైరస్‌ ముఖ్యంగా ఎలుకలు, మూషిక జాతి జీవుల ద్వారా వ్యాప్తిస్తుంది. ఉదాహరణకు ఎలుకల మలం, మూత్రం, లాలాజలం కలిసిన గాలిని పీల్చుకుంటే ఈ వైరస్‌ సోకుంది. అయితే మనిషికి సోకిన తర్వాత మరో మనిషికి ఇది అంటుకోదు. అమెరికాలో దీనిని ‘న్యూ వరల్డ్‌’ హంటా వైరస్‌ అని, ఐరోపా, ఆసియాలో ‘ఓల్డ్‌ వరల్డ్‌’ హంటా వైరస్‌ అని అంటారు. న్యూ వరల్డ్‌తో  హంటావైరస్‌ ఫల్మనరీ సిండ్రోమ్‌ (హెచ్‌పీఎస్‌), ఓల్డ్‌ వరల్డ్‌తో హెమోరాజిక్‌ ఫీవర్‌ విత్‌ రీనల్‌ సిండ్రోమ్‌ (హెచ్‌ఎఫ్‌ఆర్‌ఎస్‌) వ్యాపిస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles