Setback to YSRCP Government in Supreme court వైఎస్ జగన్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ..

Setback to ysrcp government in supreme court upholds highcourt order

AP government, YSRCP, Supreme Court, Panchayat Buldings, YSRCP Colors, Local body Elections, Andhra Pradesh, Politics

Two weeks back the High Court of AP has ordered the YSRCP government to remove the colors of the party (blue & green) painted to all the government offices, graveyards and stuff. However, AP CM YS Jagan led YSRCP government expressed unhappy towards this decision and decided to knock the Supreme Court.

వైఎస్ జగన్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ..

Posted: 03/23/2020 02:57 PM IST
Setback to ysrcp government in supreme court upholds highcourt order

దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రంలోని స్థానిక సంస్థలు, గ్రామ పంచయితీలు, జెడ్సీటీసీ. ఎంపీటీసీ ఎన్నికలపై రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. అక్కడ జగన్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. గ్రామ పంచాయితీ ఎన్నికలకు, స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తున్న తరుణంలో ప్రభుత్వం తప్పక రాష్ట్రోన్నత న్యాయస్థానం ఇచ్చిన అదేశాలను అమలు పర్చాల్సిందేనని తాజాగా సర్వోన్నత న్యాయస్థానం అదేశాలను జారీ చసింది.

గతంలో రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన అదేశాలను సమర్థించిన న్యాయస్థానం.. హైకోర్టు ఉత్తర్వులను పాటించాల్సిందేనని అదేశించింది. పంచాయతీ భవనాలకు వైసీపీ జెండా రంగులు వేయడంపై సుప్రీం కోర్టులో పిటిషన్ వేయగా.. హైకోర్టు ఆదేశాలను సవాల్ చేయడంతో ఏపీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేసిన పిటిషన్‍ను విచారించిన ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం కేంద్ర ప్రభుత్వ భవనాలకు కాషాయ రంగు వేస్తే ఒప్పుకుంటారా అంటూ ప్రశ్నించింది. హైకోర్టు ఆదేశాలను సమర్థిస్తూ పిటిషన్‍ను కొట్టివేసింది సుప్రీంకోర్టు.

రాషట్రంలోని పంచాయితీ కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలకు వేసే రంగుల అంశాన్ని ప్రజాప్రయోజన వ్యాజ్యం కింద హైకోర్టులో విచారణ జరపడంపై రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ భవనాలకు ఇప్పుడు ఉన్న రంగుల స్థానంలో వేరే రంగులు వేయాలంటూ హైకోర్టు ఇటీవల ఆదేశించింది. దీనిని సవాల్‌ చేస్తూ ఏపీ ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించగా.. హైకోర్టు తీర్పునే సుప్రీంకోర్టు సమర్ధించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles