CM YS Jagan reviews on Coronavirus outbreak కరోనా హెచ్చరిక: లాక్ డౌన్ బ్రేక్ చేస్తే జైలుకే.. వాహనాలు సీజ్..

Coronavirus centre asks state govts to strictly enforce lockdown says official statement

state lock down, center warnings, state on strict action, vehicles sieze, violaters, India, Crime, coronavirus in Andhra Pradesh, covid-19 in Andhra Pradesh, coronavirus andhra pradeesh, covid-19 andhra pradesh, coronavirus, covid-19, corona spread, state lock down, cm ys jagan,Free Ration,white ration card holders, Andhra pradesh, coronavirus in hyderabad, coronavirus live update india, coronavirus tamil nadu, coronavirus in india mumbai, coronavirus in gujarat, coronavirus in india

The Centre has asked state governments to strictly enforce lockdown and take legal action against violators, according to an official statement on Monday. The Centre and state governments on Sunday decided to completely lock down 80 districts across the country where coronavirus cases have been reported till March 31.

కరోనా హెచ్చరిక: లాక్ డౌన్ బ్రేక్ చేస్తే జైలుకే.. వాహనాలు సీజ్..

Posted: 03/23/2020 02:03 PM IST
Coronavirus centre asks state govts to strictly enforce lockdown says official statement

ప్రపంచదేశాలను భయాందోళనకు గురిచేస్తున్న కరోనా వైరస్.. మన దేశంలో కూడా ఊహించనంత వేగంగా విస్తరిస్తుంది. ఇప్పటికే ఈ వైరస్ 416మందికి సోకగా.. కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమయ్యింది. ఈ క్రమంలోనే కొద్దిసేపటి క్రితం రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. రాష్ట్రాలన్నీ లాక్‌డౌన్ చేయాలంటూ.. అత్యవసరమైన విషయాలకు తప్పితే, ఎవరైనా బయట తిరిగితే చట్టపరంగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.

ఇప్పటి వరకు సమస్యాత్మకంగా అనిపించిన 75 జిల్లాల్లోనే లాక్‌డౌన్ ప్రకటించగా దేశంలోని అన్ని రాష్ట్రాలను లాక్‌ డౌన్ చేయాలంటూ లేటెస్ట్‌గా కేంద్రం ఆదేశించింది. కరోనా వైరస్ కేసులు ఊపందుకోవడంతో చైనా, ఇటలీ తరహాలో పరిస్థితి చేయి దాటిపోకుండా కేంద్రం కఠిన చర్యలు తీసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో పరిస్థితిని అదుపులో ఉంచేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. మొత్తం కరోనా పాజిటివ్ కేసుల్లో దేశంలో మృతుల సంఖ్య 2 శాతంగా ఉంది. అంటే ఇది దాదాపు చైనాకు సమానం.

భారత్లో మృతుల సంఖ్య పెరగకుండా ప్రభుత్వాలు, వైద్యాధికారులు, పోలీసులు అత్యంత సమర్థంగా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో లాక్ డౌన్‌పై కేంద్రం తాజా అదేశాలు అందిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. కేంద్ర, రాష్ట్ర అదేశాలను పట్టించుకోకుండా కనపడటంతో పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారు. ఈ మేరకు రోడ్లపైకి వాహనాలు రాకుండా ఉండాలని అత్యవసరమైతేనే రావాలని సూచించారు. సాయంత్రం 7గంటల నుంచి ఉదయం 6గంటల వరకూ ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రావడానికి వీల్లేదని ఆదేశిస్తుంది తెలంగాణ ప్రభుత్వం. ఈ మేరకు అత్యవసరంగా మీడియాతో భేటీ అయిన డీజీపీ మహేందర్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు సూచనలు ఇచ్చారు.

* రోడ్లపై వచ్చేందుకు బలమైన కారణం ఉండాలి.
* వచ్చే 10-15రోజులు అత్యంత కీలకమైనవి
* ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోకపోతే కఠిన చర్యలు తప్పవు.
* పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వాహనాలకు రోడ్లపైకి అనుమతుల్లేవ్.  
* కారణం లేకుండా బయటకు వస్తే కఠిన చర్యలు తప్పవు.
* గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులకు మాత్రమే అనుమతిస్తాం.
* ఐదుగురికి మించి అనుమతులివ్వొద్దు.
* బైక్ మీద ప్రయాణించే వారు ఇద్దరు మాత్రమే వెళ్లాలి. కారులో వెళ్లాలనుకుంటే ఇద్దరికే పర్మిషన్.
* అత్యవసర షాపులు తప్ప అన్నీ బంద్.
* ప్రజలు సహకరించకుండా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles