corona scare: Marriage conducted on internet కరోనా కళ్యాణం.. చేసింది అంతర్జాలం..

Couple gets hitched online as travel ban due to coronavirus throws spanner in groom s plans

Bareilly, Uttar Pradesh, definitely read, Corona virus, Corona in Bareilly, Coronas awe, Corona effect, Bareilly family, Sandesh, bride-groom rounds, Bareilly news, Bareilly bulletin, Bareilly latest news, now, Corona virus Avoid,

When the coronavirus outbreak has forced several couple across the world to rethink about their wedding plans, a Telangana-based couple has come out with a unique idea to get hitched on the date and time decided prior by the respective families.

కళ్యాణంపై కరోనా వైరస్ ప్రభావం.. అయినా ఒక్కిటి చేసింది అంతర్జాలం..

Posted: 03/20/2020 04:59 PM IST
Couple gets hitched online as travel ban due to coronavirus throws spanner in groom s plans

వదువరులతో పాటు వారి తల్లిదండ్రులకు కూడా తమ బిడ్డల కల్యాణమంటే ఎంతో సంబరంగా చేయాలని భావించే ఓ ఘనమైన పండుగ. బందుమిత్రులందరితో కలసి అట్టహాసంగా, కనువిందుగా, ఎంతో సరదాగా చేయాల్సిన కార్యక్రమం. ఈ తంతుతో తమ కొడుకుపైన తమ పూర్తి బాధ్యతను వదులుకునే తల్లిదండ్రులు వారు వదులుకునే భాగాన్ని అతని అర్థాంగికి అప్పగిస్తారు. ఇక అమ్మాయి ఇంటివారైతే తమ కూతురి పూర్తిబాధ్యతను వరుడి చెతికి అప్పగించేస్తారు. బంధుమిత్రుల మధ్య, వేదమంత్రోచ్చరణ మధ్య,ఫంప్రదాయాల ప్రకారం రంగరంగ వైభవంగా జరుగుతుందీ కార్యక్రమం.

అలాంటి కళ్యాణవేడుకలను కరోనా వైరస్ ప్రభావంతో ఆకాశమంత పందిరి.. భూదేవి అంత ముగ్గులా కాకుండా అత్యంత తక్కువ మందితో మమ అని అనిపించామా అన్నట్లుగా సాగుతున్నాయి. ఇక మరికొందరైతే ఏకంగా తమ సంతానం పెళ్లిళ్లను వాయిదా కూడా వేసుకున్నారు. పెళ్లిళ్లు వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితులు ఉత్పన్నమయ్యాయంటే అందుకు కారణం కరోనా వైరస్సే. ఈ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పలు దేశాలకు తూర్పు, మధ్యప్రాశ్చ, అగ్రరాజ్యం, ఈశాన్య రాష్ట్రాల నుంచి విమానాల రాకపోకలపై నిషేధాజ్ఞలు కొనసాగుతున్నాయి.

సరిగ్గా ఇలాంటి పరిణామాలు ఉత్పన్నం కావడంతో బంధుమిత్రుల మధ్య చేసుకోకపోయినా పర్వాలేదు.. కనీసం తల్లిదండ్రుల మధ్య తన కాబోయే భార్య మెడలో తాళి కట్టి తనదాన్ని చేసుకోవాలని కలలు గన్న ఓ వరుడి అశలు అడియాశలయ్యాయి. అయితే మతపెద్దల అనుమతితో చివరకు అంతర్జాలంలో వారిద్దరి వివాహం జరిగిపోయింది. అదెలా అంటే.. విమానాలు రద్దవడంతో ఎంతో మంది మాదిరిగా పెళ్లి కావాల్సిన వరుడు కూడా మారిషస్ లో నిలిచిపోగా, ముహూర్తం మించిపోతుండడంతో కుటుంబసభ్యులు వీడియో కాల్ సాయంతో పెళ్లి చేశారు.

వివరాల్లోకి వెళ్తే ఉత్తరప్రదేశ్ లోని అంటాచౌరాహే ప్రాంతానికి చెందిన తౌసిఫ్ మారిషస్ లో ఇంజినీర్ గా పనిచేస్తున్నాడు. అతనికి షాజహాన్ పూర్ కు చెందిన యువతితో పెళ్లి నిశ్చయమైంది. ఈ నెల 19న వివాహ ముహూర్తం నిర్ణయించారు. అయితే మారిషస్ నుంచి భారత్ కు విమానాలు రద్దు చేయడంతో తౌసిఫ్ అక్కడే నిలిచిపోయాడు. దాంతో ఇరు కుటుంబాల వారు వీడియో కాల్ తో పెళ్లి చేయాలని భావించారు. ఈ క్రమంలో తౌసిఫ్ కుటుంబసభ్యులు షాజహాన్ పూర్ లోని వధువు ఇంటికి వెళ్లి పెళ్లి సమ్మతమేనంటూ ఆమెతో  అంగీకార పత్రంపై సంతకం చేయించుకున్నారు. ఆపై, వీడియో కాల్ ద్వారా తౌసిఫ్ తో నిఖా జరిపించారు. పరిస్థితి కుదుటపడిన తర్వాత తౌసిఫ్ వస్తే అతడికి అమ్మాయిని అప్పగిస్తామని బంధువులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Video Call  Wedding  Mauritius  Coronas awe  Corona effect  Sandesh  bride-groom  Uttar Pradesh  India  Corona Virus  

Other Articles