Coronavirus Updates: Two more positive cases in Telanagana తెలంగాణలో 18కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు

Coronavirus updates telangana records a total of 18 coronavirus confirmed cases

coronavirus in india, coronavirus, covid-19, corona spread, section 144, Delhi, noida, section 144 coronavirus, No Public Gathering, noida police commissioner, Gautam Budh Nagar, coronavirus news, coronavirus maharashtra, coronavirus updates, coronavirus in maharashtra, coronavirus in india update, total cases of coronavirus in india, coronavirus hyderabad, coronavirus in tamil nadu, pakistan coronavirus, coronavirus cases, coronavirus in chennai, coronavirus in hyderabad, coronavirus live update india, coronavirus tamil nadu, coronavirus in india mumbai, coronavirus in gujarat, coronavirus in india latest news

With two people who had returned from London are confirmed wih Corona virus positive. They had been shifted to Gandhi Hospital for quarantine and being treated according to Telangana Health Minister Etala Rajender.

కరోనా వైరస్ అలర్ట్.. తెలంగాణలో 18కి చేరిన పాజిటివ్ కేసులు

Posted: 03/20/2020 03:49 PM IST
Coronavirus updates telangana records a total of 18 coronavirus confirmed cases

ప్రపంచవ్యాప్తంగా కళారా నృత్యం చేస్తున్న మహమ్మారి కరోనా వైరస్.. మన దేశంలోనూ పంజా విసురుతోంది. ఇప్పటికే 200 మందిపై తన ప్రభావాన్ని చాటిన ఈ మహమ్మారి.. ఇటు తెలంగాణలనూ ప్రబలుతోంది. ఇప్పటికే ఈ వ్యాధిబారిన పడి నలుగురు వృద్దులు బలయ్యారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన ప్రభుత్వం ప్రజలకు సూచనలు చేస్తూ.. కరోనా వైరస్ పాజిటవ్ రోగులను అసుపత్రులకు తరలించి చికిత్సను అందజేస్తోంది. కరోనా వ్యాది ప్రబలకుండా విద్యాసంస్థలకు, సినిమా హాళ్లు, జనసామార్థ్యం అధికంగా వున్న ప్రాంతాల్లో నిషేదాజ్ఞలను అమల్లోకి తీసుకువచ్చింది.

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ నివేదికల ప్రకారం కరోనా పాజిటివ్ కేసులు అత్యధికంగా మహారాష్ట్రలో నమోదయ్యాయి. మహారాష్ట్రలో 48 మంది కరోనా బాధితులను గుర్తించారు. ఆ తరువాత కేరళలలో 29 మంది ఈ వైరస్ బారిన పడ్డారు. ఇక ఈ రెండు రాష్ట్రాల తరువాత ఉత్తర్ ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కరోనా బాధితులు అధికంగా వున్నారు. ఇక తాజాగా తెలంగాణలో మరో రెండు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో, ‘కరోనా’ కేసుల సంఖ్యల 18కి చేరింది. ఈ సందర్భంగా మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ, విదేశాల నుంచి వచ్చేవారితోనే ప్రమాదం పోంచివుందని అన్నారు.

తాజాగా నమోదైన రెండు కేసుల్లోనూ లండన్ నుంచి వచ్చిన ఇద్దరు భారతీయులకు ఈ వైరస్ సోకినట్టు తేలిందని అన్నారు. ప్రస్తుతం గాంధీ ఆసుపత్రికి వారిని తరలించి చికిత్స అందిస్తున్నట్లు  చెప్పారు. విదేశాల నుంచి వచ్చిన వారికే ‘కరోనా’ సోకిందని, పద్దెనిమిది కేసుల్లో ఎవరికీ ప్రాణాపాయం లేదని, ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారిలో నలుగురు రెండ్రోజుల్లో ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అవుతారని, ఈ వైరస్ నుంచి కోలుకున్న ఒకరిని డిశ్చార్జి చేశామని చెప్పారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో నివసిస్తున్న ఎవరికీ ‘కరోనా’ సోకలేదని, విదేశాల నుంచి వచ్చిన వారే దీని బారినపడ్డారని మరోమారు స్పష్టం చేశారు.

కారణం తెలియదు కానీ, బాధితుల నుంచి వైరస్ వ్యాప్తి చెందడం తక్కువగా ఉందని, బాధిత కుటుంబ సభ్యులకు, చికిత్స అందిస్తున్న ఎవరికీ ‘కరోనా’ వ్యాప్తి చెంద లేదని అన్నారు. ‘కరోనా’ విషయంలో రాష్ట్రం తీసుకున్న చర్యలను కేంద్రంగా కూడా ప్రశంసించిందని, అధిక ఉష్ణోగ్రతల ప్రదేశంలో ఈ వైరస్ బతకదని నిపుణులు చెబుతున్నారని అన్నారు. ఒకవేళ బాధితుల సంఖ్య పెరిగితే ఏం చేయాలో కూడా తాము ఆలోచించామని, ‘కరోనా’ సోకితే అద్దె ఇంట్లో ఉన్న వారిని ఖాళీ చేయిస్తారు కనుక, వేల మందిని క్వారంటైన్ చేయగలిగేలా సన్నద్ధం అయినట్టు వివరించారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles