Nirbhaya Case: execution set to convicts దేవుడి సన్నిధిలో ఉద్యోగం.. నిరుద్యోగులకు శఠగోపం

Nirbhaya case president sc delhi court reject last minute pleas execution set

nirbhaya, nirbhaya case, nirbhaya case convicts, delhi patiala house, delhi high court, supreme court, president, ramnath kovind, live udpates, pawan kumar gupta, vinay sharma, akshay thakur, mukesh singh, ap singh, nirbhaya case executions, asha devi, new delhi, crime

2012 Nirbhaya gang-rape and murder case: A Delhi court on Thursday rejected a plea seeking a stay on the executions of the four convicts. The four convicts are set to be hanged at 5:30 am in Tihar Jail.

నిర్భయ కేసు: దోషులకు రేపు మరణశిక్ష అమలు.. క్యూరేటివ్ పిటీషన్ కొట్టివేత

Posted: 03/19/2020 02:54 PM IST
Nirbhaya case president sc delhi court reject last minute pleas execution set

నిర్భయ కేసులో దోషులకు న్యాయస్థానం విధించిన శిక్ష నుంచి తప్పించుకునేందుకు వేస్తున్న ఎత్తులను మూడు నెలల పాటు ఉపేక్షించిన న్యాయస్థానాలు ఇక నాల్గవ పర్యాయం న్యాయస్థానం జారీ చేసిన డెత్ వారెంటును అమలు చేసేందుకు తీహార్ జైలు అధికారులు ఉరి ట్రయల్స్ ను కూడా వేశారు. ప్రస్తుతం జైలులో శిక్ష అనుభవిస్తున్న నలుగురు దోషుల్లో ఒకరైన పవన్ గుప్త ఉరిశిక్షకు ఒక్కరోజు ముందు పెట్టుకున్న క్యూరేటివ్ పిటిషన్‌ను గురువారం దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కొట్టివేసింది. 2012లో నిర్భయ‌పై సామూహిక అత్యాచారం జరిగినప్పుడు తాను మైనర్ బాలుడినంటూ పవన్ గుప్త చేసిన వాదనను కోర్టు తోసిపుచ్చింది.

కాగా నిర్భయ ఘటన జరిగినప్పుడు తాను ఢిల్లీలో లేనంటూ నిన్న మరో దోషి ముఖేష్ సింగ్ పెట్టుకున్న పిటిషన్ ను పటియాలా కోర్టు ఇవాళ కొట్టివేసింది. దీంతో పాటు ఈ ఘటన జరిగినప్పుడు తాను మైనర్‌ అయినందున ఉరిశిక్షను యావజ్జీవ శిక్షగా మార్చాలంటూ పవన్ గుప్తా తన పిటిషన్లో కోరగా, న్యాయస్థానం ఈ పీటీషన్ ను సైతం కొట్టివేసింది. తమకు ఇంకా న్యాయపరంగా అర్హమైన అవకాశాలు ఉన్నాయని, తమ ఉరిని ఆపాలంటూ నిందితులు దాఖలు చేసిన పిటిషన్లను పటియాలా కోర్టు కొట్టేసింది ఇప్పటివరకు ఎటువంటి లీగల్ రెమెడీస్ పెండింగ్ లో లేవని పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇర్ఫాన్ అహ్మద్ కోర్టుకి తెలిపారు.

దీంతో ఇటీవల నాల్గవ పర్యాయం జారీ చేసిన డెత్ వారెంట్ ప్రకారం శనివారం ఉదయం నలుగురు దోషులను ఒకేసారి ఉరి తీయబడతారని పటియాలా కోర్టు సృష్టం చేసింది. కాగా, ఈ తీర్పుపై నిర్భయ తల్లి ఆశాదేవి మీడియాతో మాట్లాడుతూ....కోర్టు ఇప్పటికే వాళ్లకు చాలా అవకాశాలు ఇచ్చింది. సరిగ్గా ఉరిశిక్ష అమలుకు ముందు వాళ్లు ఏదో ఒక వాదన తీసుకొచ్చి వాయిదా వేయించుకున్నారు. వాళ్ల యుక్తుల గురించి ఇప్పుడు కోర్టులకు కూడా అవగాహన వచ్చింది. రేపు నిర్భయకు న్యాయం జరుగుతుందని ఆశాదేవి తెలిపారు. మార్చి 20 ఉద‌యం 5.30 నిమిషాల‌కు నిందితుల‌ను ఉరితీయాల‌ని ఈ నెల5న పటియాలా కోర్టు నాలుగోసారి కొత్త డెత్ వారెంట్ ను జారీ చేసిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles