Ranjan Gogoi takes oath as Rajya Sabha member రాజ్యసభ సభ్యుడిగా మాజీ సీజేఐ రంజన్ గొగోయ్ ప్రమాణ స్వీకారం

Amid opposition protests ranjan gogoi takes oath as rajya sabha member

Ranjan Gogoi, opposition members, Supreme Court, former chief justice of India, president, ram nath kovind, KTS Tulsi, Rajya Sabha, India, Politics

Former Chief Justice of India Ranjan Gogoi took oath as a nominated member of Rajya Sabha amidst unprecedented scenes of opposition members shouting slogans and walking out of the House. This is the first time ever that the House has witnessed slogan shouting and walkout during oath taking.

విపక్షాల వాకౌట్ మధ్య మాజీ సీజేఐ రంజన్ గొగోయ్ ప్రమాణ స్వీకారం

Posted: 03/19/2020 01:54 PM IST
Amid opposition protests ranjan gogoi takes oath as rajya sabha member

దేశ సర్వోన్నత న్యాయసథానం సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్‌కి రాజ్యసభ నిండు కొలువులో చేదు అనుభవం ఎదురైంది. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తొలిసారి ఓ రాజ్యసభ సభ్యుడిగా రంజన్ గొగోయ్ ప్రమాణస్వీకారం చేస్తున్న తరుణంలో విపక్షాలకు చెందిన సభ్యులు నిరసనలు, నినాదాలతో సభ పెల్లుబిక్కేలా చేశారు. అంతటితో ఆగకుండా సభలో సభ్యుడి ప్రమాణ స్వీకారోత్సవం నేపథ్యంలో వాకౌట్లు కూడా చోటుచేసుకున్నాయి. స్వత్రంత్య రాజ్యసభ చరిత్రలో సభ్యుల ప్రమాణస్వీకారం సందర్భంగా ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం ఇదే ప్రప్రథమం.

విపక్షాల నిరసనల మధ్యే ఆయన  రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో ప్రతిపక్షాలు పెద్దఎత్తున నిరనసను వ్యక్తం చేశాయి. షేమ్ షేమ్..అంటూ నినాదాలు చేయడంతో సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు పలుమార్లు అభ్యంతరం తెలిపారు. నినాదాలు చేయవద్దని..సూచించారు. అయినా..ప్రతిపక్షాలు వినిపించుకోలేదు. ఈయన ప్రమాణ స్వీకారాన్ని నిరసిస్తూ...ప్రతిపక్షాలు సభ నుంచి వాకౌట్ చేశాయి. గొగోయ్ ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ప్రతిపక్షాలనుద్దేశించి వెంకయ్య నాయుడు పలు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రపతి అధికారాలను ధిక్కరించడం.. సరికాదని.. రంజన్ గొగోయ్ ను రాజ్యసభకు నిమయించింది రాష్ట్రపతేనని సూచించారు.

ఈ తరుణంలో సభలో ఇలాంటి ఆందోళనలు, నినాదాలు చేయవద్దని, ఏవీ రికార్డులోకి రావని స్పష్టం చేశారు. ఏవైనా అభ్యంతరాలుంటే..పార్లమెంట్ బయట చెప్పుకోవచ్చన్నారు. రంజన్ గొగోయ్‌ని రాజ్యసభకు నామినేట్ చేస్తూ...రాష్ట్రపతి నిర్ణయం తీసుకున్నారు. అనంతరం రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ చేస్తూ..హోం మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేశారు. నామినేట్ చేయగానే..విపక్షాల నుంచి పలు విమర్శలు చేశాయి. గతంలో కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పునిచ్చారని, అందుకే..రంజన్ గొగోయ్‌ని కేంద్రం రాజ్యసభకు పంపిందని విపక్షాలతో పాటు న్యాయమూర్తులు విమర్శలు గుప్పించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles