COVID-19: Karimnagar citizens asked to stay indoors వణుకుతున్న కరీంనగరవాసీ.. రంగంలోకి వైద్యబృందాలు..

Coronavirus telangana s karimnagar under lockdown after 8 indonesians test positive

coronavirus in india, coronavirus, covid-19, telangana case count, telangana covid 19, telangana coronavirus, Telangana, coronavirus news, coronavirus maharashtra, coronavirus updates, coronavirus in maharashtra, coronavirus in india update, total cases of coronavirus in india, coronavirus hyderabad, coronavirus in tamil nadu, pakistan coronavirus, coronavirus cases, coronavirus in chennai, coronavirus in hyderabad, coronavirus live update india, coronavirus tamil nadu, coronavirus in india mumbai, coronavirus in gujarat, coronavirus in india latest news

Health authorities in Telangana's Karimnagar sounded a high alert after as many as eight Indonesian citizens who had come to visit the town on a religious program, tested positive for the coronavirus

కరోనావైరస్: వణుకుతున్న కరీంనగరవాసీ.. రంగంలోకి వైద్యబృందాలు..

Posted: 03/19/2020 10:19 AM IST
Coronavirus telangana s karimnagar under lockdown after 8 indonesians test positive

కరోనా వైరస్ ప్రభావం తెలంగాణ వాసుల గుండెల్లో అలజడి రేపుతోంది. ఇప్పటికే హైదరాబాద్ నగరంపైన స్పష్టంగా కనపిస్తోన్న ప్రభావం తాజాగా కరీంనగర్ వాసుల్ని తీవ్రంగా కలవరపరుస్తోంది. అందుకు కారణం నిన్న ఒక్కరోజు తెలంగాణలో నమోదైన ఏడు కొత్త పాజిటివ్ కేసులు. ఇండోనేషియాకు చెందిన వ్యక్తులకు పరీక్షలు చేయగా వారిందరికీ కరోనా వైరస్ వుందని తేలింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు సంఖ్య ఆరు నుంచి ఒకేసారి 13కు చేరింది. అయితే ఇదే వార్త ఇప్పుడు కరీంనగర్ వాసులను వణికిస్తోంది.

ఇండోనేషియాకు చెందిన కొందరు వ్యక్తులు ఈ నెల 14, 15 తేదీల్లో పట్టణంలో పర్యటించారు. వారిలో 8 మందికి కరోనా సోకినట్టు తేలడంతో పట్టణం ఉలిక్కిపడింది. విషయం తెలిసిన ప్రభుత్వ వర్గాలు అప్రమత్తమయ్యాయి. పట్టణంతోపాటు వారు ఇండోనేషియా వాసులు పర్యటించిన ప్రాంతాలపై దృష్టిసారించారు. వారు ఎవరెవరిని కలిశారు? ఏయే ప్రాంతాల్లో పర్యటించారన్న దానిపై ఆరా తీస్తున్నారు. ఇందుకోసం సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. అలాగే వారు తిరిగిన ప్రాంతాలను తమ అధీనంలోకి తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నారు.

కరోనా పాజిటివ్‌ కేసుల నిర్ధారణ కావడంతో తెలంగాణ ప్రభుత్వం ఆ జిల్లాలో మరిన్ని చర్యలు తీసుకుంటోంది. ఇండోనేషియా వ్యక్తులు కరీంనగర్‌లో 48 గంటలపాటు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇండోనేషియా నుంచి వచ్చిన వారు పర్యటించిన కలెక్టరేట్ కు మూడు కిలోమీటర్ల పరిధిలోని ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రజలు ఇళ్లలోంచి బయటకు రావద్దని అధికారులు సూచించారు. ఆ ప్రాంతాల ప్రజలు వైద్యులకు సహకరించాలని ప్రభుత్వం కోరుతోంది. ఆ జిల్లాలో 100 ప్రత్యేక బృందాలతో వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. అవసరమైతే ఆయా ప్రాంతాల్లో నిర్బంధం విధించాలని అధికారులు భావిస్తున్నారు. ఈ రోజు ఆ జిల్లాలో తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ పర్యటించి,  వైద్య సిబ్బందితో మాట్లాడి పరిస్థితులను సమీక్షించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles