Telangana records 7 new cases of coronavirus తెలంగాణలో కొత్తగా మరో 7 పాజిటివ్ కేసులు నమోదు

Telangana reports 7 new covid 19 cases total count 13

coronavirus in india, coronavirus, covid-19, corona positive case, covid-19 positive case, Indonesia, Telangana Health Ministry, Scotland, Hyderabad, Telangana, coronavirus news, coronavirus maharashtra, coronavirus updates, coronavirus in maharashtra, coronavirus in india update, total cases of coronavirus in india, coronavirus hyderabad, coronavirus in tamil nadu, pakistan coronavirus, coronavirus cases, coronavirus in chennai, coronavirus in hyderabad, coronavirus live update india, coronavirus tamil nadu, coronavirus in india mumbai, coronavirus in gujarat, coronavirus in india latest news

Seven new cases of coronavirus have been reported in Telangana, taking the total number of positive cases to 13. The newly-detected patients are all Indonesian nationals.

తెలంగాణలో కరోనా బాధితులు.. 13కు చేరిన పాజిటివ్ కేసులు

Posted: 03/18/2020 07:07 PM IST
Telangana reports 7 new covid 19 cases total count 13

ప్రపంచ దేశాలను తీవ్ర కలవరానికి గురిచేస్తున్న కరోనా వైరస్ నెమ్మదిగా భారత దేశానికి కూడా విస్తరించి అందోళనరేపుతోంది. దేశంలో మహరాష్ట్రలో అధ్యధిక కరోనా కేసులు నమోదు కాగా ఆ తరువాత ఈ జాబితాలో కేరళా రాష్ట్రం వుంది. ఈ తరుణంలో తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. రోజురోజుకు కరోనా కేసులు పెరిపోతుండడంతో భయాందోళనలు మొదలయ్యాయి. ఇప్పటివరకు తెలంగాణలో ఆరు కేసులు పాజిటివ్ అని తేలగా.. ఇవాళ(18 మార్చి 2020) ఒక్కరోజే కేసులు డబుల్ అయిపోయాయి. మరో ఏడుగురికి కరోనా సోకినట్లు నిర్ధారించారు వైద్యులు. ఏడు మందికి కరోనా ఉన్నట్లుగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.

ఈ నెల 16వ తేదీ నుంచి ఐసోలేషన్‌లో ఉంచిన  ఏడుగురి రక్త నమూనాల రిపోర్ట్‌లు వచ్చిన తర్వాత ఈ విషయాన్ని వెల్లడించారు అధికారులు. తెలంగాణలో కరోనా కేసులు సంఖ్య 13కు చేరుకోగా.. వైద్య ఆరోగ్యశాఖ మరింత అప్రమత్తం అయ్యింది. ఇవాళ్టి వరకు ఆరు కేసులు అంటేనే భయాందోళన చెలరేగగా.. 13కేసులు అవ్వడంతో కంగారు పడుతున్నారు. ఇండోనేషియా నుంచి వచ్చిన 10మందిలో ఏడుగురికి కరోనా ఉన్నట్లుగా నిర్ధారించారు వైద్యులు. రోనా వైరస్‌ కట్టడికి వైద్య ఆరోగ్యశాఖ వేగంగా చర్యలు చేపడుతుంది. ‘కరోనా’ పై ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని, ఎప్పటికప్పుడు సీఎస్‌, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తూ నివారణ చర్యలపై ఆరా తీస్తున్నామని మంత్రి ఈటెల కూడా చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles