Man held for cheating job seekers దేవుడి సన్నిధిలో ఉద్యోగం.. నిరుద్యోగులకు శఠగోపం

Vijayawada man held for cheating jobseeksers in vijayawada

Ramdev, fraudster, cheating, collecting money, job seekers, Tirumala temple, laddu distribution counter, vijayawada, andhra pradesh, crime

The Vijayawada police have arrested a man for defrauding people on the promise of job offers. Ram Dev a resident of Vijayawada collected lakhs of Rupees from job seekders on the pretext of jobs in TTD laddu distribution counters.

దేవుడి సన్నిధిలో ఉద్యోగం.. నిరుద్యోగులకు శఠగోపం

Posted: 03/18/2020 06:16 PM IST
Vijayawada man held for cheating jobseeksers in vijayawada

దేవుడి సన్నిధిలో ఉధ్యోగం.. అందునా అలాంటి, ఇలాంటి దేవాలయం కాదు.. సాక్ష్యాత్తు కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల తిరుపతి వెంకటేశ్వరస్వామి కొలువైన సప్తగిరులపై ఉద్యోగం అంటే ఎవరు మాత్రం వద్దంటారు. ఇక అసలు ఉద్యోగమే లేని నిరుద్యోగులు మాత్రం కొంత మొత్తం చెల్లించైనా అక్కడ ఉద్యోగం పోందాలని భావిస్తుంటారు. సరిగ్గా ఇలాంటి వారినే టార్గెట్ చేశాడు ఓ ఘనుడు. వారి వద్ద నుంచి లక్షల రూపాయలు వసూలు చేసి.. తీరా ఉద్యోగం అనేసరికి శఠగోపం పెట్టాడు. డబ్బులు తీసుకుని నెలలు గడుస్తున్నా ఉద్యోగం రాకపోవడంతో బాధితులకు అనుమానం కలిగింది.

ఇలా ఒకరు కాదు పదుల సంఖ్యలో నిరుద్యోగులు ఆయన కోసం తన ఇంటి చుట్టూ తిరగడంతో చివరకు బెదిరింపులకు దిగాడా ఘనుడు. దీంతో బాధిత నిరుద్యోగులు అందరూ కలసి సదరు ఘనుడ్ని పోలీసులకు అప్పగించగా వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. టీటీడీలో లడ్డూ కౌంటర్లలో ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగుల నుంచి ఏకంగా 60లక్షల రూపాయలను సేకరించాడు, బాధితులు ఉద్యోగాల గురించి అడిగితే బెదిరించడంతో వారు ఆగ్రహించి... రాందేవ్‌ అనే ఘనుడ్ని పట్టుకుని విజయవాడ టూటౌన్‌ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles