AP Government to distribute hosuing plots on Ugadi సుప్రీంలో ఏపీ ప్రభుత్వానికి ఊరట.. అర్హులకు గుడ్ న్యూస్..

Yrscp government to distribute hosuing plots to homeless poor on ugadi

AP Govt to distribute housing plots, YSRCP Govt to distribute housing plots, Govt to distribute housing plots on Ugadi, Govt to distribute housing plots on New Year, AP Government, YSRCP Government, CM YS Jagan, Housing Plots, Supreme Court, Homeless Poor, Andhra Pradesh, Politics

Andhra pradesh government shares good news with the beneficieries of homeless poorm says its going to distribute the pattas of house plot to the poor on Telugu new Year day Ugadi, as the supreme court has pronounced verdict in favour of YSRCP Government

సుప్రీంలో ఏపీ ప్రభుత్వానికి ఊరట.. అర్హులకు గుడ్ న్యూస్..

Posted: 03/18/2020 12:01 PM IST
Yrscp government to distribute hosuing plots to homeless poor on ugadi

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఉగాది రోజున పేదల ఇళ్ల పట్టాల పంపిణీకి లైన్ క్లియర్ అయ్యింది. తక్షణమే ఎన్నికల కోడ్ ఎత్తేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశంతో ఇళ్ల పట్టాల పంపిణీకి అడ్డంకులు తొలిగాయి. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా పిటిషన్ పై ఇవాళ అత్యున్నత న్యాయస్థానం విచారణ జరిపింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసిన న్యాయస్థానం.. స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాను సమర్థించింది. ఎన్నికల నిర్వహణ విషయంలో ఈసీ నిర్ణయమే ఫైనల్ అని తేల్చి చెప్పింది.

అయితే అదే సమయంలో తక్షణమే ఎన్నికల కోడ్ ఎత్తేయాలని ఎన్నికల కమీషన్ ను సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. అభివృద్ధి కార్యక్రమాలకు కోడ్ అడ్డుకాకూడదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఎన్నికల కోడ్ ఎత్తి వేయాలంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో మార్చి 25 తెలుగువారి ఉగాది సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని ఇల్లు లేని 25లక్షల పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీకి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ ఇళ్ల పట్టాల పంఫిణీని నిలిపివేయాలని హైకోర్టు అదేశించింది. కాగా తాజాగా సుప్రీం కోర్టు ఎన్నకిల కోడ్ ఎత్తివేయడంతో ఇళ్ల పట్టాల పంఫిణీకి మార్గం సుగమైంది.

రాష్ట్రంలో స్థానిక సంస్థల కోడ్ ఎత్తివేస్తూ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. ఎన్నికల కోడ్ ఎత్తేయడం సంతోషం అన్నారు. కోడ్ ఎత్తేయడంతో పథకాలు యథావిధిగా కొనసాగిస్తామని చెప్పారు. షెడ్యూల్ ప్రకారమే ఉగాది రోజున రాష్ట్రంలోని ఇల్లు లేని పేదలకు 25లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం చేపడతామన్నారు. కరోనా మరింత వ్యాప్తి చెందకముందే ఎన్నికలు నిర్వహించాలని మంత్రి కోరారు. కరోనా అడ్డుకునేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని వివరించారు.

కాగా, ఎన్నికలు వాయిదా పడటం దురదృష్టకరమని వైసీపీ నేతలు వాపోయారు. షెడ్యూల్ ప్రకారమే నిర్వహించి ఉంటే వారం 10 రోజుల్లో ఎన్నికలు అయిపోయేవి అన్నారు. కరోనా నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేస్తూ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయం దుమారం రేపింది. రాజకీయ రగడకు దారి తీసింది. దీనిపై తీవ్రంగా స్పందించిన జగన్ ప్రభుత్వం న్యాయపోరాటానికి దిగింది. సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. ఎన్నికల వాయిదా నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుని ఆశ్రయించింది.

ప్రభుత్వంతో ఎలాంటి సంప్రదింపులు లేకుండా.. కనీసం ఇంతటి కీలక నిర్ణయం తీసుకునే సమయంలో కనీసం సమాచారం కూడా లేకుండా.. ఎన్నికల కమిషనర్ ఎన్నికలు వాయిదా వేశారని వాదనలు వినిపించింది. కరోనా వైరస్ కట్టడికి స్థానిక ప్రజాప్రతినిధులు అవసరం చాలా ఉందని కోర్టుకి విన్నవించింది. కాగా, ఏపీలో కరోనావైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకే ఎన్నికలు వాయిదా వేశామని ఈసీ వాదించింది. ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం.. ఎన్నికల కమీషన్ నిర్ణయమే ఫైనల్ అని చెప్పింది. ఎన్నికల వాయిదా నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని తేల్చిచెప్పింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles