Coronavirus: Telangana on High alert తెలంగాణలో కరోనా వైరస్ హైఅలర్ట్

Telangana govt on high alert over coronavirus outbreak

Coronavirus outbreak, Telangana high alert, telangana corona outbreak, Health administration, Infectious diseases, Coronavirus, covid-19, coronavirus pandemic, Coronavirus, covid-19, foreigners quarantine, vikarabad tourism resort isolation ward, mohammad hussian siddiqui, Gulburga hospital staff, Bengaluru, karnataka, politics

The health officials have confirmed a second case coronavirus. A patient with a travel history to Italy has tested positive for COVID-19. Two more persons, with a similar travel history to Italy, are also suspected to be COVID-19 positive. For further confirmation, the authorities have sent their samples to National Institute of Virology (NIV), Pune.

కరోనా వైరస్: తెలంగాణలో హై-అలర్ట్.. అనంతగిరి రిసార్ట్ కు విదేశీయులు

Posted: 03/14/2020 01:35 PM IST
Telangana govt on high alert over coronavirus outbreak

కరోనా వైరస్ ఉష్ణవాతావరణ స్థితి కలిగిన తెలంగాణలోకి రాదంటూ చేసిన ప్రచారాలు నిజం కావాలని కోరుకుంటున్న తెలంగాణ ప్రభుత్వం.. రాష్ట్రంలో రెండో కరోనా వైరస్ బారిన పడిన పేషంట్ కు పాజిటివ్ రిపోర్టు రావడంతో.. తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రంలో ప్రజారోగ్యం పరిస్థితులను పరిరక్షించేందుకు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నామని ప్రకటించింది.. ఈ మేరకు రాష్ట్ర అసెంబ్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో హైఅలర్ట్ ప్రకటించామని చెప్పారు. కేవలం ముందస్తు చర్యల్లో భాగంగానే ఈ విధంగా తాము వ్యవహరిస్తున్నామన్నారు.

రాష్ట్రానికి ఇటలీ నుంచి వచ్చిన మహిళలలో కరోనా వ్యాధి లక్షణాలు వున్నాయని తెలుసుకన్న అధికారులు అమెను గాంధీ అసుపత్రికి తరలించి ఐసోలేషన్ వార్డులో చికిత్సను అందిస్తున్నామని సీఎం కేసీఆర్ చెప్పారు. కాగా, సదరు మహిళకు పరీక్షలు నిర్వహించామని.. నివేదికలో అమె పాజిటివ్ అని వెలువరించిందని తెలిపారు. ఇక ఈమెతో పాటు వచ్చిన మరో ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకుని క్వారంటైన్ చేస్తున్నామని, వారి నివేదికలు వచ్చిన తరువాత తదుపరి వైద్యం అందిస్తామన్నారు. ఈ క్రమంలో వైరస్ లక్షణాలు వున్నవారి సంఖ్య అంతకంతకూ పెరుగుతన్న క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది.

అయితే ఈ నేపథ్యంలో భయాందోళనకు గురికావాల్సినంద అవసరం లేదన్నారు. యావత్ దేశంలో ఇప్పటి వరకు 65 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని... ఇద్దరు మరణించారని చెప్పారు. ప్రపంచాన్ని ప్రతి వందేళ్లకు ఒకసారి ఇలాంటి వ్యాధులు వణికిస్తాయని అన్నారు. మందుస్తుచర్యల్లో భాగంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న విషయమై అరోగ్యశాఖ.. మిగతాశాఖలను సమన్వయంతో సమావేశం నిర్వహిస్తోందని.. ఈ కమిటీతో సాయంత్రం క్యాబినెట్ కూడా భేటీ కానుందని.. ఈ తరుణంలో ముందస్తుగా మరిన్నీ చర్యలను ఎలా తీసుకోవాలన్న విషయమై చర్చించనున్నామని తెలిపారు.

ఇప్పటికే రాష్ట్రానికి చెందిన ప్రజలు ఎవరైనా ఈ లక్షణాలు కనిపిస్తే వారిని గాంధీ అసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్న ప్రభుత్వం.. విదేశాల నుంచి వచ్చేవారిని మాత్రం మిగతా ప్రాంతాలకు తరలిస్తామన్నారు. వికారాబాద్ లోని అనంతగిరిపై వున్న టూరిజం శాఖ గెస్ట్ హౌజ్ సహా దూలపల్లిలో ఫారెస్ట్ గెస్ట్ హౌజ్ ను కూడా ఆరోగ్యశాఖ అధీనంలోకి తీసుకుందని, విదేశీయుల్ని ఇక్కడకు తరలిస్తామని పేర్కోన్నారు. కరోనా ప్రభావం ఉన్న దేశాల నుంచి ఎవరొచ్చినా... వారిని 14 రోజులు ఐసొలేషన్ లో ఉంచుతున్నారని తెలిపారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో 200 మంది ఆరోగ్యశాఖ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles