కరోనా వైరస్ పేరు చెబితే.. జనం గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. పేరు చెబితేనే దడుచుకునేలా చేస్తున్న ఈ వ్యాధి.. తమకు సోకిందని తెలిస్తే.. ఆ రోగుల పరిస్థితి ఎలా వుంటుందో తలచుకుంటేనే భయమేస్తోంది. లక్షణాలు బయటపడితేనే కారంటైన్ చేస్తుండగా, ఇక వారి రిపోర్టులో పాజిటివ్ అని తేలితే.. వారిని ఐసోలేషన్ వార్డుకు తరలించడంతో పాటు కోలుకునే వరకు చికిత్సను అందిస్తారు. ఈ విషయం తెలుసుకున్న ఓ మహిళ.. కరోనా లక్షణాల వున్నాయని తెలుసుకుందో ఏమో తెలియదు కానీ.. అమె ఏకంగా తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోయింది. ఇంతకీ ఎవరామె అంటారా..
బెంగుళూరులోని గూగుల్ ఇండియాకు చెందిన సాప్ట్ వేర్ ఇంజనీరుకు కరోనా వైరస్ సోకిందన్న విషయం తెలిసిందే. దీంతో అతడ్ని అదుపులోకి తీసుకున్న వైద్యులు.. క్వారంటైన్ చేసి చికిత్సను అందిస్తున్నారు. ఈ క్రమంలో భయాందోళనకు గురైన అతని భార్య పుట్టింటికి పారిపోయింది. బెంగళూరు నుంచి ఢిల్లీ వరకు విమానంలో ప్రయాణించిన అమె అక్కడి నుంచి రైలులో అగ్రాకు చేరుకుంది. అయితే టెక్నీ తన భార్యతో కలసి ఇటలీకి హనీమూన్ ట్రిఫ్ కు వెళ్లివచ్చారని, అక్కడే ఆయన ఈ వైరస్ బారిన పడ్డాడని తెలుసింది. దీంతో అతన్ని అదుపులోకి తీసుకున్న వైద్యులు చికిత్సను అందిస్తున్నారు.
అదే సమయంలో క్యాంపస్ లోని ఉద్యోగులందరినీ 'వర్క్ టు హోం'కు ఆదేశించారు. దీంతో భర్తతోపాటు భార్యకు వైరస్ సోకే అవకాశం ఉందని బెంగళూరు వైద్యులు ఆగ్రా అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆగ్రా చీఫ్ మెడికల్ ఆఫీసర్ నేతృత్వంలోని వైద్యుల బృందం టెకీ భార్య పుట్టింటికి వచ్చారు. వారు వైద్య పరీక్షలు చేయించుకునేందుకు నిరాకరించడంతో కలెక్టర్, పోలీసులు జోక్యం చేసుకోవడంతో టెకీ భార్య అంగీకరించింది. ఆమెకు వైరస్ సోకిందని నిర్ధారణ కావడంతో వైద్యులు అప్రమత్తమయ్యారు. ఆమెతోపాటు మొత్తం కుటుంబ సభ్యులు తొమ్మిది మందిని ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఇక మన దేశంలో కరోనా వైరస్ జడలు విప్పుతోంది. క్రమంగా ఈ సంఖ్య వంద మార్కును దాటుతోంది. ఇదే సమయంలో దేశంలో నేటికి రెండు కరోనా వైరస్ మరణాలు సంభవించాయి. ఈ నేపథ్యంలో, కరోనా లక్షణాలతో ఐసొలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్న 9 మంది అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. వీరిలో పంజాబ్ కు చెందిన ఏడుగురు వ్యక్తులు ఉన్నారు. మిగిలిన ఇద్దరు అమెరికాకు చెందిన దంపతులు. వీరిద్దరూ కేరళలోని ఆసుపత్రి నుంచి వెళ్లిపోయారు. కరోనా బాధితులు అదృశ్యం కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. గాలింపు చర్యలు చేపట్టారు. ఐసోలేషన్ వార్డుల నుంచి తప్పించుకున్న రోగులకు సంబంధించిన సమాచారం అన్ని రాష్ట్రాలకు కేంద్ర అరోగ్యశాఖ పంపించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more