ఆంధప్రదేశ్ రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. సాక్ష్యాత్తు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు దర్యాప్తును సిబిఐకి అప్పగిస్తూ తీర్పును వెలువరించింది. ఈ మేరకు ఇటీవల తీర్పును రిజర్వు చేసిన న్యాయస్థానం ఇవాళ తీర్పును వెలువరిస్తూ కేసును సీబీఐకి అప్పగించాలని ఆదేశించింది. ఈ కేసులో రాష్ట్ర పోలీసుల దర్యాప్తు తీరుపై న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. హత్యకేసులకు సంబంధించిన సమయం కూడా కేసుల్లో కీలక ఆధారంగా మారుతుందని అభిప్రాయపడిన న్యాయస్థానం.. ఈ కేసును వెంటనే సీబిఐకి అప్పగించాలని అదేశించింది.
ఈ సందర్భంగా సాధ్యమైనంత త్వరగా ఈ కేసు దర్యాప్తు పూర్తి చేయాలని సీబీఐని న్యాయస్థానం ఆదేశించింది. ఈ హత్య జరిగి ఏడాదిన్నర కాలం గడుస్తున్నా దర్యాప్తులో ఎటువంటి పురోగతి లేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. కేసు దర్యాప్తులో సమయం చాలా కీలకం కనుక ఈ కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్టు న్యాయస్థానం పేర్కొంది. ఈ కేసుకు సంబంధించి సీఎం జగన్ పిటిషన్ ఉపసంహరణ ప్రభావం దర్యాప్తుపై ఉండకూడదని సూచించింది.
పులివెందుల పోలీస్ స్టేషన్నుంచి సీబీఐ దర్యాప్తు ప్రారంభించాలని ఆదేశించింది. కాగా, 2019 మార్చి 15 వైఎస్ వివేకా హత్య జరిగింది. ఈ కేసును ఛేదించేందుకు మూడుసార్లు సిట్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయినా, ఈ కేసు దర్యాప్తులో పురోగతి లేకపోవడంతో నిందితులను ఇంతవరకూ తేల్చలేదు. వివేకా హత్య కేసును సీబీఐకి అప్పగించాలని కోరుతూ ఆయన భార్య సౌభాగ్యమ్మ, కూతురు సునీత, తదితరులు గతంలో పిటిషన్లు వేశారు.
ఇదిలావుండగా న్యాయస్థానం తీర్పుపై టీడీపీ సీనియర్ నేత, అధికార ప్రతినిధి వర్ల రామయ్య స్పందిస్తూ.. వివేకా హత్యకేసును సీబీఐకి అప్పగించాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును చారిత్రాత్మకం అని అభివర్ణించారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలన్న న్యాయస్థానం నిర్ణయంతో కొందరికి కాళ్లలో వణుకు, వెన్నులో చలి, కళ్లలో బెరుకు తదితర లక్షణాలు మొదలయ్యాయని వ్యంగ్యం ప్రదర్శించారు. హైకోర్టు తీర్పుతో తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసం కంపించిపోయిందని, ఈ నిర్ణయం సీఎం జగన్ కు, ప్రభుత్వానికి చెంపదెబ్బ వంటిదని అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more