Prashant Kishor takes dig at Scindia's exit ఎంపీ ప్రభుత్వానికి ఢోకాలేదన్న నకుల్.. స్పందించిన పీకే..

Madhya pradesh government is safe congress mlas will return nakul nath

Prashant Kishor, Nakul nath, Digvijay singh, Jyotiraditya Scindia resigns congress, Congress, Sonia Gandhi, Rahul Gandhi, PM Narendra Modi, Amit Shah, JP Nadda, Kamal Nath, Jyotiraditya Scindia, cabinet ministers, Shivraj singh chouhan, BJP, defamation, Madhya Pradesh, Politics

Poll strategist Prashant Kishor took a huge dig at Jyotiraditya Scindia shortly after his resignation from the Congress, saying he had nothing to show other than his surname. Kishor posted to Twitter that he had "little to show as mass leader, political organiser or administrator."

ఎంపీ ప్రభుత్వానికి ఢోకాలేదన్న నకుల్.. స్పందించిన పీకే..

Posted: 03/11/2020 04:17 PM IST
Madhya pradesh government is safe congress mlas will return nakul nath

మధ్యప్రదేశ్‌ లోని కాంగ్రెస్ ప్రభుత్వానికి జ్యోతిరాదిత్య సింధియా సహా 22 మంది ఆయన వర్గం ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం వల్ల వచ్చిన నష్టమేమి లేదనిఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ తనయుడు, ఎంపీ నకుల్‌ నాథ్‌ ధీమా వ్యక్తం చేశారు. కర్ణాటకకు వెళ్లిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు త్వరలోనే కాంగ్రెస్‌ గూటికి చేరుకుంటారని తనకు పూర్తి విశ్వాసం ఉందన్నారు. రాష్ట్రంలోని కమల్‌నాథ్‌ ప్రభుత్వం మైనార్టీలో పడిందని, ఇక బీజేపి త్వరలో పగ్గాలను అందుకుంటుందని వస్తున్న వార్తలను ఆయన తోసిపుచ్చారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు తిరిగి సొంతగూటికి చేరుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.

పార్లమెంటు​ వద్ద మీడియాతో మాట్లాడిన ఆయన.. ‘‘కమల్‌నాథ్‌​ ప్రభుత్వానికి వచ్చి ఢోకా ఏమీలేదు. సర్కారు కచ్చితంగా నిలదొక్కుకుంటుంది. కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేల రాజీనామాలు స్పీకర్‌ ఇంకా ఆమోదించలేదు. నిజానికి వాళ్లు వ్యక్తిగతంగా ఆయనను సంప్రదించలేదు. మధ్యప్రదేశ్‌ ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తున్న 92 మంది ఎమ్మెల్యేలను మేం కాపాడుకుంటాం’’ అని నకుల్‌నాథ్‌ పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స్వభావం అందరినీ కలుపుకుని వెళ్లేలా వుంటుందని, అయితే బీజేపి మాత్రం విబేధాలతో విధ్వంసం, విచ్చిన్నం చేసే చర్యలకు పాల్పడుతుందని.. ఇది తెలిసిన ఎమ్మెల్యేలు తిరిగి పార్టీలోకి వచ్చేస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

మధ్యప్రదేశ్‌ తాజా రాజకీయ పరిణామాలపై ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, జనతాదళ్‌ పార్టీ మాజీ ఉపాధ్యక్షుడు ప్రశాంత్‌ కిషోర్‌ స్పందించారు. గాంధీ కుటుంబాన్ని విమర్శించే వారు... జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్ ను వీడటాన్ని అతిపెద్ద కుదుపుగా ఎలా భావిస్తారంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ మేరకు.. ‘‘ఇంటి పేరు కారణంగా... కాంగ్రెస్‌ అధినాయకత్వాన్ని తప్పుబట్టేవారు... ఇప్పుడేమో సింధియా పార్టీని వీడితే.. పార్టీకి ఇదొక ఝలక్‌ అంటున్నారు. ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉంది. వాస్తవం ఏమిటంటే.. జ్యోతిరాదిత్య సింధియా కూడా ఇంటిపేరు కారణంగానే మాస్‌ లీడర్‌, రాజకీయవేత్త, పాలకుడిగా ఉన్నారు’’అని ట్విటర్లో వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

ఇదిలావుండగా, అధికారం నిలబెట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న కాంగ్రెస్‌ పార్టీ.. స్వతంత్రులు, బీజేపీయేతర పార్టీ ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక మధ్యప్రదేశ్‌ అసెంబ్లీలో ఉన్న మొత్తం సభ్యుల సంఖ్య 228(మొత్తం- 230 స్థానాలు.. ఇద్దరు సభ్యులు చనిపోవడంతో రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి). ఇందులో తిరుగుబాటు బావుటా ఎగురువేసిన 22 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల రాజీనామాలు ఆమోదం పొందితే సభలో సభ్యుల సంఖ్య 206కు చేరుకుంటుంది. అదే విధంగా కాంగ్రెస్‌ సొంత బలం 92కు పడిపోతుంది. ఇదే సమయంలో బీజేపీకి అసెంబ్లీలో 107 సభ్యుల బలం ఉంది. ఈ క్రమంలో మ్యాజిక్‌ ఫిగర్‌ 104 అయినప్పటికీ.. స్పీకర్‌ నిర్ణయంపైనే అంతా ఆధారపడి ఉన్న నేపథ్యంలో... స్వతంత్రులు, బీఎస్పీ, ఎస్పీకి చెందిన ఏడుగురు సభ్యులను తమవైపునకు తిప్పుకొనేందుకు ఇరుపార్టీలు రంగంలోకి దిగినట్లు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles