Scindia was 'not at all sidelined': Digvijay Singh మహారాజా జ్యోతిరాధిత్యకు శుభాకాంక్షలు: దిగ్విజయ్ వ్యంగోక్తులు..

Scindia was not at all sidelined senior congress leader digvijay singh

Digvijay singh, Jyotiraditya Scindia resigns congress, Congress, Sonia Gandhi, Rahul Gandhi, PM Narendra Modi, Amit Shah, JP Nadda, Kamal Nath, Jyotiraditya Scindia, cabinet ministers, Shivraj singh chouhan, BJP, defamation, Madhya Pradesh, Politics

Senior Congress leader Digvijay singh rejected the claims that Scindia resigned because he was sidelined by the party. Taking to microblogging website Twitter, Singh said that he was 'not at all sidelined' and no decision in Gwalior Chambal Division of Madhya Pradesh was taken without his consent in the last 16 months since the Congress came to power.

మహారాజా జ్యోతిరాధిత్యకు శుభాకాంక్షలు: దిగ్విజయ్ వ్యంగోక్తులు..

Posted: 03/11/2020 11:29 AM IST
Scindia was not at all sidelined senior congress leader digvijay singh

మధ్యప్రదేశ్‌లోని ముఖ్యమంత్రి కమల్ నాథ్ సర్కారుకు షాకిచ్చిన సినియర్ నేత జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి త్వరలో బీజేపిలో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటూ.. రాజ్యసభకు ఎంపికై ఆ తరువాత కేంద్రమంత్రిగా కూడా బాధ్యతలను చేపట్టాలని భావిస్తున్న తరుణంలో.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ తనదైన శైలిలో సింధియాపై వ్యంగోక్తులు విసిరారు. అంతేకాదు కేంద్రంలోని అధికార బీజేపి పార్టీలో ప్రజలు ఎదుర్కోంటున్న అసలైన సమస్యలను ఎత్తిచూపారు. ప్రజలను నిత్యం భావోద్వేగాలకు గురిచేయడం ఎవరి తరం కాదని.. ప్రజలు అసలు విషయం గ్రహిస్తే.. బీజేపి కనీసం యాభై, అరవై ఏళ్లు అధికారానికి దూరంగా వుంటుందని విమర్శించారు.

భారత్‌కు ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా నేతృత్వంలో గొప్ప భవిష్యత్తు ఉంటుందని జ్యోతిరాదిత్య భావిస్తున్నారని దిగ్విజయ్ సింగ్ ఎద్దేవా చేశారు. ఎన్డీఏ పాలనలో బ్యాంకులు కుప్పకూలుతున్నాయని, రూపాయి మారకం విలువ పతనమవుతోందని ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశ ఆర్థిక వ్యవస్థ సమస్యల్లో చిక్కుకుందని, సామాజిక వ్యవస్థ నాశనం అవుతోందని ఆయన చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో మోదీ, అమిత్ షాల నేతృత్వంలో దేశానికి మంచి భవిష్యత్తు ఉందని జ్యోతిరాదిత్య భావిస్తున్నారని చురకలంటించారు.

నిత్యావసర సరుకుల ధరలు ఆకాశానంటుతున్నాయి.. అన్నదాతలు తమను ఆదుకునే వారెవరంటూ అర్థనాథాలు చేస్తున్నారు.. నిరుద్యోగులు తమకు ఉపాధి అవకాశాలు ఎప్పుడోచ్చేనా అని ఎదురుచూస్తున్నారు అయినా జ్యోతిరాధిత్య సింధియాకు మాత్రం బీజేపిలో చక్కని భవితవ్యం కనిపించిందంటూ ఆయన వ్యంగోక్తులు విసిరారు. కేంద్ర మంత్రిగా అమిత్ షాను లేక నిర్మల సీతారామన్‌ను తొలగించి ఆ స్థానంలో జ్యోతిరాదిత్యను నియమించాలని ఆయన అన్నారు. వారిద్దరు చేసే పనిని ఆయన కచ్చితంగా వారి కన్నా మెరుగ్గా చేస్తారని వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. చివరగా 'మహారాజా.. మీకు మా శుభాకాంక్షలు’ అని దిగ్విజయ్‌ సింగ్‌ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ లో పోస్టులు పెట్టారు.

కాగా తాను గత 18 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో క్రీయాశీలకంగా పనిచేశానని పేర్కోన్నసింధియా.. ఇప్పుడు మరో దిశగా అడుగులు వేయాల్సిన సమయం వచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి తాను రాజీనామా చేస్తున్నానని... తాను ఈ దిశగా ఏడాది క్రితం నుంచే ఆలోచిస్తున్నాననే విషయం మీకు తెలుసని చెప్పారు. రాష్ట్ర ప్రజలకు, దేశానికి సేవ చేయాలనే లక్ష్యం తనకు ముందు నుంచి ఉందని... అయితే, కాంగ్రెస్ పార్టీలో ఉంటూ తన లక్ష్యాన్ని తాను సాధించలేనని చెప్పారు. కాగా కాసేపట్లో ఆయన ప్రధాని, అమిత్ షా సమక్షంలో బీజేపి జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డా ఆధ్వర్యంలో బీజేపిలో చేరనున్నారని సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles