YSRCP activists obstruct oppositions from nominations అధికార పార్టీ కార్యకర్తల జులుం.. ప్రత్యర్థుల నామినేషన్లకు ఆటంకం

Ruling ysrcp activists obstruct opposition leaders from nominations

polling officials deny to give nomination papers to oppositions, nomination papers, ruling party activist ruckus, ruling party hurdles, ysrcp activists attack oppositions, local body elections, zptc elections, mptc elections, panchayat elections, YSRCP, BJP, TDP, opposition parties, Andhra pradesh, Politics

Andhra Pradesh Ruling YSRCP party activists obstruct opposition party leaders from taking and submitting their nominations form in the state.

అధికార పార్టీ కార్యకర్తల జులుం.. ప్రత్యర్థుల నామినేషన్లకు ఆటంకం

Posted: 03/11/2020 10:27 AM IST
Ruling ysrcp activists obstruct opposition leaders from nominations

స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ల పర్వం ప్రారంభం కావడంతోనే.. రాష్ట్రంలో పలు చోట్ల అధికార పార్టీ కార్యకర్తలు జులుం చలాయిస్తున్నారు. పలు చోట్లు దౌర్జన్యాలు కూడా చోటుచుసుకున్నాయి. ఇది చాలదన్నట్లు అధికారుల అధికార పార్టీకి నేతల పరపతికి తలొగ్గి వ్యవహరించి నామినేషన్ పత్రాలను కూడా ఇచ్చేందుకు జంకుతున్నారు. ఇక బకాయిలు చెల్లించేందుకు కూడా అధికారగణం ముప్పుతిప్పలు పెడుతోంది. దీంతోపాటు పోలీసులు కూడా ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులుగా భావిస్తున్న వ్యక్తుల పాత కేసులు తిరగదోడేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థలు ఎన్నికలలో ప్రత్యర్థి పార్టీల నేతలు పోటీ చేయడానికే వెనుకంజవేసే పరిస్థితులు ఉత్పన్నమవతున్నాయి.

గుంటూరు జిల్లా పల్నాడులో స్థానిక ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయడానికి వీల్లేకుండా కొందరు భయభ్రాంతులకు గురి చేశారు. వెల్దుర్తి మండలం బోదిలవీడు ఎంపీటీసీ స్థానాలకు టీడీపీ అభ్యర్థులు శోభనాల నాగేంద్రం, బెల్లంకొండ రాజ్యలక్ష్మి నామినేషన్‌ పత్రాలతో రిటర్నింగ్‌ అధికారి వద్దకు వెళ్లాగా.. ఆర్వో ఎదుటే.. మహిళలను తోసేసి.. నామినేషన్‌ పత్రాలను బలవంతంగా లాక్కుని వెళ్లారు. అక్కడే వున్న పోలీసులు వారిని నిలువరించకపోగా.. చేష్టలుడికి చూశారన్న విమర్శలున్నాయి.  

మాచవరం మండలం పిన్నెల్లి గ్రామంలో ఎంపీటీసీ-3వ స్థానానికి నామినేషన్‌ వేయడానికి వెళ్లిన టీడీపీ అభ్యర్థిపై వైసీపీ వర్గీయుల జులుం కొనసాగింది. నామినేషన్‌ దాఖలు చేయకుండా అడ్డుతగలడంతో పాటు ఎదరు ప్రశ్నించిన కార్యకర్తలపై దాడి చేశారు. విషయం తెలుసుకుని ప్రతిఘటించేందుకు వచ్చిన టీడీపీ కార్యకర్తలు అక్కడకు చేరుకోగా వారిని వెంటాడి.. దొరికిన వారిని దొరికినట్లు చితకబాదారు. రాళ్లు, కర్రలతో దాడులు చేయడంతో పలువురికి రక్తపు గాయాలయ్యాయి. దీంతో టీడీపీ  అభ్యర్థిని నామినేషన్‌ దాఖలు చేయకుండానే వెనుదిరిగారు.

చిత్తూరు జిల్లాలోని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరు నియోజకవర్గంలో ఇదే తరహా పరిస్థితులు నెలకోన్నాయి. ఇక్కడ అధికారులే టీడీపీ కార్యకర్తల అవతారం ఎత్తారన్న విమర్శలు వినిపించాయి. ప్రతిపక్ష అభ్యర్థులకు నామినేషన్‌ పత్రాలను ఇవ్వడానికి కొందరు అధికారులు నిరాకరించడంతోనే ఈ ఆరోపణలొచ్చాయి. పులిచెర్ల ఎంపీడీవో కార్యాలయానికి నామినేషన్‌ పత్రాల కోసం బీజేపి కార్యకర్తలు రాగా వైకాపా కార్యకర్తలు అడ్డుకుని దాడిచేసి గాయపర్చారు. కారును ధ్వంసం చేశారు.

ఇదే మండలంలో నామినేషన్‌ దాఖలు కోసం ఇంటి పన్ను చెల్లింపునకు టీడీపీ అభ్యర్థులు రాగా కావేటివారిపల్లె పంచాయతీ కార్యదర్శి నిరాకరించారు. ఇంటిపన్ను ఎందుకు తీసుకోవడం లేదని నిలదీస్తే పంచాయితీ కార్యదర్శి పొంతనలేని సమాధానాలు చెబుతున్నాడని టీడీపీ కార్యకర్తలు అరోపించారు.  ఇదే తరహాలో జిల్లాలో పలుచోట్ల దౌర్జన్యాలు, బెదిరింపులు, అధికారుల సహాయ నిరాకరణలు కొనసాగుతున్నట్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని శ్రీకాళహస్తిలో విచిత్ర పరిస్థితి ఎదురైంది. జనరల్‌ సీటులో పోటీ చేస్తున్న ఓసీ కులానికి చెందిన టీడీపీ అభ్యర్థులను ఎన్నికల అధికారులు కుల ధ్రువీకరణ పత్రాలు అడిగారు.

టీడీపీ, బీజేపి నేతల పాత కేసులను పోలీసులు తిరగదోడుతున్నారన్న అరోపణలు కూడా గుప్పుమంటున్నాయి. తిరుపతిలో టీడీపీకి చెందిన జేబీ శ్రీనివాస్‌, కఠారి మోహన్‌ తదితరులను అరెస్టు చేశారు. వైసీపీ దౌర్జన్యాలపై బీజేపి నేతలు భానుప్రకాష్ రెడ్డి, సైకం జయచంద్రారెడ్డి, చంద్రారెడ్డి చిత్తూరు ఎస్పీకి ఫిర్యాదు చేశారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేట మండలానికి చెందిన టీడీపీ కార్యదర్శి, మాజీ ఎంపీటీసీ సభ్యుడు పాకం వెంకటసుబ్బయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విషయం తెలుసుకున్న పలువురు నేతలు, కార్యకర్తలు పోలీసు ఠాణాకు వచ్చారు. వీరు ఎస్సైతో మాట్లాడాక వెంకట సుబ్బయ్యపై బైండోవర్‌ కేసు నమోదు చేసి విడిచిపెట్టారు.

తమ నేతలపై పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తున్నారని గుంటూరు జిల్లా టీడీపీ కార్యకర్తలు, నాయకులు రోడ్డెక్కారు. 2 గంటలకుపైగా రాస్తారోకో చేసి నిరసన తెలిపారు. ఈదుపల్లి గ్రామానికి చెందిన ఆళ్ల చౌదరి సహా అతని సోదరుడిపై అక్రమ మద్యం కేసులను బనాయించి స్టేషన్ కు తరలించారని అరోపించారు. విషయం తెలియగానే రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  సుమారు 500 మందికిపైగా టీడీపీ కార్యకర్తలు పోలీస్ స్టేషన్ కు చేరుకుని ఆందోళనకు దిగారు. అధికార పార్టీ నేతలు టీడీపీ నాయకులపై అక్రమ కేసులు బనాయించి భయాందోళనలకు గురి చేస్తున్నారని.. పచ్చని పల్లెసీమల్లో వైసీపీ చిచ్చు పెడుతోందని ఎమ్మెల్యే అనగాని మండిపడ్డారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles