paracetamol is the medicise for corona virus: gagandeep kung పారాసెటమాల్ తో కరోనాకు చికిత్స: శాస్త్రవేత్త గగన్ దీప్ కంగ్..

Scientist gagandeep kung says paracetamol is the medicise for corona virus

The Royal Society, FRS, Gagandeep Kang, Translational Health Science, scientist, paracetamol, medicine, viral news

The Royal Society fellowship scientist from health sciences stream gagandeep kung says paracetamol is the medicine for the deadly carona virus.

పారాసెటమాల్ తో కరోనాకు చికిత్స: శాస్త్రవేత్త గగన్ దీప్ కంగ్..

Posted: 03/06/2020 10:55 AM IST
Scientist gagandeep kung says paracetamol is the medicise for corona virus

యావత్ ప్రపంచాన్ని కలవరపెడుతున్న భయానక కరోనా వైరస్ గురించి ఇకపై ఎవరూ భయపడాల్సిన పనిలేదని ఈ ప్రాణాంతక వ్యాధికి అత్యుత్తమ, అత్యంత చౌకన మాత్రతోనే చెక్ పెట్టవచ్చునని అంటున్నారు హెల్త్ సైన్స్ శాస్త్రవేత్త, ది రాయల్ సోసైటీ ఫెలో షిప్ పోందిన తొలి భారతీయ శాస్త్రవేత్త గగన్‌దీప్‌ కంగ్‌. ఈ చౌకైన మాత్రను అత్యధికులు వారే స్వయంగా కొనుగోలు చేసుకుని వినియోగిస్తున్నారని, కేవలం ప్రతీ నలుగురిలో ఒక్కరు ఫార్మాసిస్ట్ సూచనతో.. పదిమందిలో ఒకరు వైద్యుడి సూచనతో తీసుకుంటున్నారని అమె తెలిపారు.

కేవలం వార్తలు వింటూనే కలవరపాటుకు గురవుతున్న ప్రజలను మరింత దిగ్ర్భాంతికి గురిచేసేలా ఈ వ్యాధి వ్యాప్తి జరుగుతుందని అయితే దీనిపై అంత అందోళన చెందాల్సిన అవసరం లేదని అమె చెబుతున్నారు. ఈ వ్యాధిని కట్టడి చేయడానికి పారాసెటమాల్ ట్యాబ్లెట్లు చాలునని అమె అన్నారు. క్రమపద్దతిలో మూడు రోజుల పాటు ప్రతీ ఆరుగంటల వ్యవధిలో ఒక్క పారాసెటమాల్ ట్లాబెట్లు తీసుకుంటే చాలునని అమె తెలిపారు. సాధారణంగా దగ్గు, జ్వరం తగ్గడానికి వినియోగించే ఈ పారాసెటమాల్ ట్యాబ్లెట్లను వాడితే సరిపోతుందన్నారు.

కరోనా నిర్ధారిత కేసుల్లో ప్రతి ఐదుగురిలో నలుగురు తమంత తామే కోలుకుంటున్నారని, ఒక్కరు మాత్రమే వైద్యుడిని సంప్రదించాల్సి వస్తోందని తెలిపారు. ప్రతి రోజూ మనం ఎన్నో వైరస్‌ల ప్రభావానికి గురవుతుంటామన్నారు. చేతులను శుభ్రంగా కడుక్కోవడం, క్రిముల్ని హరించే ద్రవాలతో నేలను శుభ్రం చేసుకుంటే సరిపోతుందని కంగ్ తెలిపారు. అలాగే, చేతులను తరచూ ముఖంపై పెట్టకపోవడమే మేలని అన్నారు. శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారు మాత్రం వీలైనంత త్వరగా వైద్యులను సంప్రదించాలని సూచించారు. కరోనా వైరస్ ‘సార్స్’ అంతటి ప్రమాదకారి కాదని అయితే, ‘ఫ్లూ’తో పోలిస్తే మాత్రం తీవ్రత కొంత ఎక్కువని వివరించారు. బీపీ, డయాబెటిస్, గుండెజబ్బులతో బాధపడే వారు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలని ఆమె సూచించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles