'Approach Union Home Ministry afresh for security' రేవంత్ రెడ్డి భద్రతపై ఆరువారాల్లోగా స్పందించండీ..

Act within 6 weeks on security to revanth telangana high court

Revanth Reddy, Malkajgiri MP, Congress, CM KCR, My Home Rajeshwar Rao, KTR, Life Threat, Telangana High Court, Abhinand Kumar Shavili, My Home Constructions, Jupally Rameshwar Rao, Central agency, Central Government, Telangana, Politics

The Telangana High Court directed the Ministry of Home Affairs to consider the petitioner’s plea in accordance with law and dispose off such plea within six weeks from the date of submission of fresh representation by Congress MP A Revanth Reddy seeking to provide 4+4 security along with escort from Central agency or any other independent agency.

రేవంత్ రెడ్డి భద్రతపై ఆరువారాల్లోగా స్పందించండీ.. కేంద్రానికి హైకోర్టు అదేశం

Posted: 03/04/2020 11:39 AM IST
Act within 6 weeks on security to revanth telangana high court

ముఖ్యమంత్రి కేసీఆర్, పారిశ్రామికవేత్త ‘మై హోం కన్స్ ట్రక్షన్స్’  అధినేత జూపల్లి రామేశ్వరరావుల నుంచి తనకు ప్రాణహాని ఉందని సంచలన అరోపణలు చేసిన రేవంత్ రెడ్డి భద్రత విషయంలో చర్యలు తీసుకోవాలని న్యాయస్థానం కేంద్రప్రభుత్వాన్ని అదేశించింది. రాష్ట్రానికి చెందిన పెద్దల నుంచే తనకు ప్రాణహానీ వుందన్న ఆరోపణల నేపథ్యంలో రేవంత్ రెడ్డి భద్రత కల్పన విషయంలో ఆరు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని తన అదేశాల్లో పేర్కోంది. ఈ మేరకు రేవంత్ దాఖలు చసిన పిటీషన్ను విచారించిన న్యాయమూర్తి జస్టిస్ అభినంద్ కుమార్ సావిలి అదేశించారు.

తనకు కేంద్ర ప్రభుత్వం లేదంటే, స్వతంత్ర ఏజెన్సీల నుంచి 4 ప్లస్ 4 గన్ మెన్లతో ఎస్కార్ట్ కల్పించాలని కోరుతూ రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి పిటీషన్ ను విచారించిన న్యాయస్థానం కేంద్రప్రభుత్వానికి ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. ఆరు వారాల వ్యవధిలో ఎంపీ రేవంత్ రెడ్డి దాఖలు చేయునున్న కొత్త పిటీషన్ పై చర్యలు తీసుకోవాలని ఆయన అదేశించింది. ఈ క్రమంలో రేవంత్ రెడ్డిని కొత్తగా మరో పిటీషన్ను కేంద్రహోం మంత్రిత్వశాఖకు సమర్పించాల్సిందిగా సూచించింది.
కాగా, ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తున్న తనకు ప్రభుత్వ పెద్దల నుంచి ప్రాణహాని పొంచి వుందని పేర్కోంటూ రేవంత్ రెడ్డి ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు. ఒకసారి ఎమ్మెల్సీగా, రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన తాను ప్రస్తుతం ఎంపీగా ఉన్నానని, తనకు రక్షణ కల్పించాలని కోరుతూ హైకోర్టులో దాఖలు చేసిన పిటీషన్ లో ఆయన పేర్కోన్నారు. గతంలో తనకున్న 3 ప్లస్ 3 గన్‌మెన్లతో రక్షణ ఉండేదని, ఆ తర్వాత దాన్ని 2 ప్లస్ 2కు తగ్గించినట్టు కోర్టుకు తెలిపారు. తన ప్రాణాలకు హాని ఉండడంతో భద్రత పెంచాలని ఆయన న్యాయస్థానాన్ని కోరారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Revanth Reddy  Malkajgiri MP  Congress  CM KCR  Rajeshwar Rao  KTR  Life Threat  Patnam Gosa  Kukatpally  Telangana  Politics  

Other Articles