Abdul Karim Tunda acquitted in blasts case 1998 పేలుళ్ల కేసులో నిర్దోషిగా కరీం తుండా

Hyderabad court acquits alleged let operative abdul karim tunda

Abdul Karim Tunda, Tamil Nadu Serial Blasts, coimbatore bomb Blasts, Karim Tunda Acquitted, Metropolitan Sessions Court, , Nampally Court, Hyderbad, Lashkar-e-Taiba, Hyderabad, Tamil Nadu, Crime

A court in Hyderabad acquitted terror suspect Syed Abdul Karim alias Tunda in connection with a case of allegedly conspiring to carry out a series of blasts in Hyderabad in 1998.

హైదాబాద్ సీరియల్ బాంబు బ్లాస్టుల కేసులో అబ్దుల్ కరీం తుండా నిర్దేషి..

Posted: 03/04/2020 10:41 AM IST
Hyderabad court acquits alleged let operative abdul karim tunda

హైదరాబాద్ వరుస బాంబు పేలుళ్లకు కుట్ర పన్నారన్న అభియోగాలపై నమోదైన కేసులో నాంపల్లి న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న లష్కరే తోయిబా ఉగ్రవాది సయ్యద్ అబ్దుల్ కరీం తుండాను మెట్రోపాలిటిన్ సెషన్స్ కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. ఈ మేరకు నాంపల్లిలోని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. అయితే బాంబు పేలుళ్లకు కుట్ర పన్నారన్న అభియోగాలను నిరూపించేందుకు అధికారులు సరైన ఆధారాలు సమర్పించలేకపోయారని న్యాయస్థానం ఈ సందర్భంగా పేర్కోంది.

ప్రస్తుతం ఉత్తర్ ప్రదేశ్ లోని గజియాబాద్ జైలులో వున్న తుండా గతంలో భారత్ లో బాంబు పేలుళ్లతో విధ్వంసాలు సృష్టించేందుకు కుట్ర పన్నారని కేసులు నమోదయ్యాయి. లష్కరే తోయిబాకు చెందిన కరుడుగట్టిన నేరస్థుడైన తుండా.. ఆ సంస్థకు బాంబులు తయారి చేయడంతో పాటు.. వాటిని తయారు చేసే విధానాన్ని కూడా పలువురు లష్కరే తోయిబా సభ్యులకు నేర్పించారని కూడా అనుమానాలు వున్నాయి. సిసిఎస్ కు చెందిన ప్రత్యేక దర్యాప్తు బృందం తుండాపై విధ్వంసాలకు కుట్ర చేస్తున్నారన్న అభియోగాలతో పాటు ఆయుధాలు, పేలుడు సామాగ్రి, పాస్ పోర్టు, విదేశీ చల్టం సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది.

తుండా సుమారు 40 బాంబు దాడి కేసుల్లో ప్రధాన సూత్రధారిగా, మాస్టార్ మైండ్ గా వున్నారు. అయితే 1998లో వరుస బాంబు పేలుళ్లకు కుట్ర కేసులో ఏకంగా 28 మందిపై కేసులు నమోదు చేయగా, వారిలో తప్పించుకుని తిరుగుతున్న వారిలో తుండా ఒకడు. పాకిస్థాన్ కు చెందిన మోస్ట్ వాంటెండ్ జాబితాలో వున్న ఈ కరుడుగట్టిన నేరగాడ్ని.. ఇండో నేపాల్ సరిహద్దులోని బాన్ బాసాలో తలదాచుకుంటున్న సయ్యద్ అబ్దుల్ కరీం తుండాను 2013 ఆగస్టు 16న కేంద్ర భద్రతా బలగాలు దేశానికి తీసుకువచ్చాయి. ఈ క్రమంలో అతనిపై అంతుకుముందే నమోదైన కేసుల్లో న్యాయస్థానాలు విచారణ చేశాయి.

కాగా, ఈ కేసులో కరీంపై ఆరోపణలకు సంబంధించి సరైన ఆధారాలను పోలీసులు కోర్టుకు సమర్పించలేకపోయారు. దీంతో, డిఫెన్స్ వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం, కరీంను నిర్దోషిగా ప్రకటించింది. 1992లో బాబ్రీ మసీదు కూల్చివేతకు ప్రతీకారంగా దేశ వ్యాప్తంగా అల్లర్లు జరగడమే కాదు, బాంబు పేలుళ్లకు కుట్ర పన్నారు. ఇందులో భాగంగా టిఫిన్ బాక్సుల్లో బాంబులు అమర్చి హైదరాబాద్ లోని హుమాయున్ నగర్, సీసీఎస్ వద్ద, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో విధ్వంసానికి కుట్ర పన్నాడని ఆరోపిస్తూ పోలీసులు కేసులు నమోదు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles