Bus Driver Jamming With Toddler on a Taylor Swift Song తన డాన్సుతో చిన్నారిని సంతోషపెట్టిన బస్సు డ్రైవర్..

Toddler tells bus driver her fave song he stops everything to dance with her

kid dance to shake it off, kid dancing with bus driver video, kid dance bus driver shake it off video, viral video, twitter video, Brette-Ashley Schmitt, bus driver, bus driver grooving, dance, emerson, facebook, Shake It Off, Taylor Swift, Taylor Swift Instagram, toddler, toddler dance, video

A video of a bus driver from Orlando stopping the vehicle to jam with a toddler on her favourite track is going viral. The two-year-old video is an embodiment of cuteness. Both the driver and the child can be seen grooving to the tunes of Taylor Swift’s hit song 'Shake It Off'.

ITEMVIDEOS: తన డాన్సుతో చిన్నారిని సంతోషపెట్టిన బస్సు డ్రైవర్..

Posted: 03/03/2020 05:29 PM IST
Toddler tells bus driver her fave song he stops everything to dance with her

చిన్నారులు ముద్దులొలికే మాటలు వింటే ఎంతటి కరుడుగట్టిన హృదయాలైనా ఇట్టే కరిగిపోతాయి. ఎంత కోసంలో వున్నవారైనా ఇట్టే మంచుకన్న చల్లగా మారిపోతారు. ఇధి నిజంగా నిజం. ఇక వారు ఏదైనా అడిగితే కాదని చెప్పలేం. అలాంటి ఘటనే ఒకటి అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో జరిగింది. బస్సులో తన తల్లిదండ్రులతో కలసి ప్రయాణిస్తున్న చిన్నారి గమ్యస్థలం రాగానే వారితో పాటు దిగేందుకు రెడీ అయ్యింది. అయితే అంతకుమందు వరకు బస్సులో పెట్టిన పాటపై డాన్స్ చేయాలని కోరిక మాత్రం చిన్నారిలో కలిగింది.

దీంతో నేరుగా ఆ చిన్నారి మాత్రం నేరుగా డ్రైవర్ దగ్గరకు వెళ్లి ముచ్చటించింది. అప్పటికే అతను మరో ట్రిప్పు వేయడం కోసం సిద్ధం కావాల్సి ఉంది. కానీ అతను ఎలాంటి చిరాకు ప్రదర్శించకుండా ఆమెతో ముచ్చట్లాడాడు. ఇక పాప తనకు అంతకుముందు పెట్టిన టైలర్ స్విఫ్ట్ పాడిన ‘షేక్‌ ఇట్‌ ఆఫ్‌’ పాటంటే ఎంతో ఇష్టమని చెప్పింది. వెంటనే ఆయన అవునా! అయితే మనిద్దరం ఇప్పుడా పాటకు డ్యాన్స్‌ చేద్దాం అంటూ మరోమారు ఆ పాటను ప్లే చేశాడు. అది ఎంతలా అంటే రోడ్డుపై బస్సును నిలిపి ఫుల్ సౌండ్ పెట్టి మరీ చిన్నారిని సంతోషపెట్టాడు.

అంతటితో చిన్నారి సంతోషిస్తుండగానే అతను తన సీట్లోనే కూర్చోని స్టెప్పులేయం ప్రారంభించాడు. దీంతొ ఆ చిన్నారి సంతోషంతో గెంతులు వేస్తూ పాటకు తగ్గట్టుగా కాలు కదిపింది. ఇక బస్సు డ్రైవర్‌ సీటు బెల్టు కూడా తీయకుండా కూర్చున్న సీటులో నుంచే డ్యాన్స్‌ చేయడం అందరినీ ఆకట్టుకుంది. ఇది సరిగ్గా వాలెంటైన్స్ డే రోజునే జరిగింది. ప్రేమ, ప్రేమికుల రోజు అంటూ యూత్ అంతా అమ్మాయిల వెంట పరిగెడితే.. ఓ చిన్నారి ప్రేమను మాత్రం ఈ బస్సు డ్రైవర్ గెలుచుకున్నాడని నెటిజనులు మాత్రం ప్రశంసలు కురిపించారు.

ఇదంతా 2018 నాటి సంగతి కాగా దీనికి సంబంధించిన వీడియోను 11 మిలియన్ల మందికి పైగా వీక్షించారు. తాజాగా రెక్స్‌ చాప్‌మన్‌ అనే వ్యక్తి ఈ వీడియోను తిరిగి పోస్ట్‌ చేశాడు.  కొద్ది గంటల్లోనే దీన్ని వీక్షించిన వారి సంఖ్య 8 మిలియన్ల మార్క్‌ను దాటి ట్రెండింగ్‌లో నిలిచింది. దీనిపై నెటిజన్లు పలురకాలుగా స్పందిస్తున్నారు. ‘నాకంటే బాగా డ్యాన్స్‌ చేశాడు, సీటుబెల్టు ధరించి కూర్చున్న చోట నుంచే ఆడిపాడాడు’, ‘బెస్ట్‌ చెయిర్‌ డ్యాన్సింగ్‌ అవార్డు ఇవ్వాలి’ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘ఇలాంటి ప్రేమే కావాలి, ప్రపంచమంతా దానితో నిండిపోవాలి’, ‘ఇది కదా మాక్కావాల్సింది..’ అంటూ కొంతమంది మీమ్స్‌ ద్వారా రిప్లై ఇస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Taylor Swift  bus driver  dance  emerson  facebook  Shake It Off  Instagram  toddler  viral video  twitter  video  

Other Articles

Today on Telugu Wishesh