Amaravati farmers gives representation to YSR statue వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి అమరావతి రైతుల వినతిపత్రం..

Amaravati farmers gives representation to ys rajashekar reddy statue

YCP Activists, slogans, Pro Govt, Anti Govt protest, Farmers agitations, Decentralisation, CRDA, Three Capital Plan, Amaravati, three capital, State Assembly, joint action committee, YS Jagan, ys jagan mohan reddy, chandrababu naidu, andhra pradesh capital, amaravati lands case, Chief Justice JK Maheshwari, Justice AV Sesha Sai, Justice M Satyanarayana Murthy, Supreme Court, Vijayawada, farmers, Andhra Pradesh, Politics

Amaravati farmers gives representation to YS Rajashekar Reddy statue, which states that the government should drop three capital proposal.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి అమరావతి రైతుల వినతిపత్రం..

Posted: 02/29/2020 03:33 PM IST
Amaravati farmers gives representation to ys rajashekar reddy statue

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏకైక పూర్తిస్థాయి రాజధానిగా అమరావతిని కొనసాగించాలని కోరుతూ ఆ ప్రాంత రైతులు చేస్తున్న ఆందోళనలు 74వ రోజుకు చేరాయి. ఇన్ని రోజులుగా తాము దీక్షలు, నిరసనలు చేస్తున్నా.. ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని, తమ మెర వినడం లేదని, తమను, తమ సమస్యను నిర్లక్ష్యం చేస్తోందని అమరావతి రైతలు పేర్కొంటున్నారు. తూళ్లూరు రైతులు, మహిళలు తమ ఆక్రందనను ఇప్పటికైనా ప్రభుత్వం అర్థం చేసుకునేలా చేయాలని కోరుతూ.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి వినతిపత్రం అందజేశారు.

రాజధాని ప్రాంతంలోని 29 గ్రామల ప్రజలు.. ఆయా గ్రామాల పరిధిలో దీక్షలు, నిరసనలు ఉదృతంగా కొనసాగుతున్నాయి. రైతులు, మహిళలు, రైతు కూలీలు రోజుకో రీతిలో తమ నిరసనను తెలియజేస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ తుళ్లూరులో రైతులు దీక్షా శిబిరం నుంచి స్థానిక వైఎస్‌ విగ్రహం వరకు వెనక్కి నడుస్తూ నిరసన తెలిపారు. ‘జై అమరావతి’, ‘ఒకే రాష్ట్రం.. ఒకే రాజధాని’, ‘రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలి’ అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

అనంతరం వైఎస్‌ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించేలా జగన్‌ మనసు మార్చాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. వెలగపూడిలో రైతులు, మహిళలు దీక్షలు కొనసాగిస్తున్నారు. రాజధాని భూములను పేదల ఇళ్ల  స్థలాలకోసం ఇస్తామనడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకించారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ తీరు మారే వరకు తమ ఆందోళనలు కొనసాగుతాయని ఈ సందర్భంగా రైతులు తేల్చి చెప్పారు.

అమరావతి నుంచి రాజధాని తరలిపోతుందన్న ఆందోళనతో ఇవాళ మరో ఇద్దరు రైతు కూలీల గుండె ఆగింది. వెలగపూడికి చెందిన సలివేంద్ర సంశోను(33) గుండెపోటుతో మృతి చెందాడు. అమరావతికి మద్దతుగా గత కొన్ని రోజులుగా సంశోను ఆందోళనల్లో పాల్గొంటున్నాడని బంధువులు తెలిపారు. రాయపూడికి చెందిన మస్తాన్‌ అనే రైతు కూలీ ఈరోజు ఉదయం గుండె పోటుతో మృతి చెందాడు. అమరావతిపై ఆందోళనతోనే చనిపోయాడని కుటుంబసభ్యులు తెలిపారు. దీక్షా శిబిరంలో రైతులు.. మస్తాన్‌ మృతికి సంతాపం తెలిపి నివాళులర్పించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles