coronavirus: US spy agencies concerns about India భారత్ కరోనా కట్టడిపై.. అందోళనలలో అగ్రరాజ్యం.!

Coronavirus in india us spy agencies monitor coronavirus spread concerns about india

US spy agencies concerns about India, corona virus spread in India, US concerns about India, Mike Pompeo, Coronavirus In India, coronavirus in china, coronavirus, china virus, US spy agencies, US news, Crime

US intelligence agencies are monitoring the global spread of coronavirus and the ability of governments to respond, sources familiar with the matter said, warning that there were concerns about how India would cope with a widespread outbreak.

భారత్ కరోనా కట్టడిపై.. అందోళనలలో అగ్రరాజ్యం.!

Posted: 02/28/2020 01:33 PM IST
Coronavirus in india us spy agencies monitor coronavirus spread concerns about india

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌(కొవిడ్‌-19) వ్యాప్తి విజృంభిస్తున్న నేపథ్యంలో పలు దేశాలు మాత్రం దీనిని తేలిగ్గా తీసుకుంటున్నాయని అగ్రరాజ్యం అమెరికా అభిప్రాయపడింది. ఈ క్రమంలో అమెరికాకు చెందిన ఇంటెలిజెన్స్ సంస్థలు దీనిపై దృష్టి సారించాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడంపై పలు దేశాల సామర్థ్యాన్ని అంచనా వేస్తున్నాయని సమాచారం. ఈ నేపథ్యంలో భారత్ లో వైరస్‌ విజృంభించిన పక్షంలో దాన్ని ఎలా నిలువరిస్తారన్న దానిపై ఆందోళన వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది.

జనసాంద్రత అధికంగా ఉన్న ఇండియాలో కరోనా వైరస్ సోకిన పక్షంలో ఇది తీవ్ర ఆందోళన కలిగించే అంశమని అమెరికా నిఘా విభాగానికి చెందిన ఓ అధికారి తెలిపారు. ఇరాన్ లో ఆరోగ్య శాఖ ఉపమంత్రికే వైరస్‌ సోకడం పట్లా అమెరికా సంస్థలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. వైరస్‌ వ్యాప్తిని ఇరాన్‌ కప్పిపుచ్చేందుకు ప్రయత్నించినట్లు కనిపిస్తోందని యూఎస్‌ ఆరోపిస్తోంది. మహమ్మారి ఎదుర్కొనే సామర్థ్యాన్ని సమకూర్చుకోవడంలో ఇరాన్‌ ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించిందని చెప్పుకొచ్చింది.

పలు ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనూ సన్నద్ధత కొరవడిందని నిఘా సంస్థలు అభిప్రాయపడ్డాయి. ఈ మేరకు హౌజ్ ఆఫ్‌ రిప్రంజెంటేటివ్స్‌ ఇంటెలిజెన్స్ కమిటీకి సదరు సంస్థలు సమాచారం అందించాయి. వివిధ దేశాల వైరస్‌ కట్టడి సామర్థ్యాన్ని అంచనా వేయడంలో అమెరికా నిఘా సంస్థలు అక్కడి ‘సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌’ వంటి సంస్థలతో కలిసి పని చేస్తున్నట్లు కమిటీలోని ఓ ప్రతినిధి తెలిపారు. అనేక పద్ధతులను అనుసరించి ఆయా దేశాల సామర్థ్యాన్ని, సన్నద్ధతను అంచనా వేస్తున్నారని పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles