lover arrested for duping college officials as Raw Agent ‘ప్రేమ కోసమై’ జైలు గొడల మధ్యకు యువకుడు..

Lover arrested for duping college officials as raw agent in guntur

lover dupes as Raw Agent, lover dupes college mangament as Raw Agent, guntur youth in khamman jail, guntur youth dupes as Raw Agent, Guntur District, Khammam District, Wyra College, Youth Arrest, Raw Agent, college management, Khammam police, Telangana, Crime

A youth Uday kiran from Guntur disrict pretends as Raw Agent and attempts to dupes the Wyra college management as the same to meet with his lover during the college hours, but is now behind the bars.

‘ప్రేమ కోసమై’ జైలు గొడల మధ్యకు యువకుడు..

Posted: 02/28/2020 01:05 PM IST
Lover arrested for duping college officials as raw agent in guntur

ప్రేమ కోసమై వలలో పడనే పాపం పసివాడు అంటూ పాతాళభైరవి చిత్రంలో కపటమాయావి వెంట వెళ్లిన అమాయకపు ఎన్టీఆర్ కోసం పాడిన పాట ఇది. ఇదే తరహాలో కొంత అతి తెలివి ప్రదర్శించిన ఓ ప్రేమికుడు.. తాను ప్రేమించే ప్రియురాలి మోజులో పడి కటకటాలు లెక్కబెడుతున్నాడు. ప్రేమ కోసం ఈ యువకుడు ఏకంగా పెద్ద తప్పటడుగు వేసి.. కాలేజీ యాజమాన్యాన్ని కూడా బురడా కొట్టించాలని ప్రయత్నించి.. అడ్డంగా బుక్ అయ్యాడు. వెరసి ఏడు ఊచలు లెక్కపెడుతూ.. తనను విడిపించేందుకు ఎవరైనా రాకపోతారా అంటూ ఎదురు చూస్తున్నాడు.

ప్రియురాలు  చదువుతున్న కళాశాలకు వెళ్లి తాను రీసెర్చి అండ్‌ అనాలిసిస్‌ వింగ్‌ (రా) ఏజెంట్ అని తనకు తానుగా కళాశాల ప్రధానోపాధ్యాయుడికి పరిచయం చేసుకున్నాడు. యువకుడి వేషాధారణ చూసి కాసింత అనుమానంతో కొంత సమయానికి మళ్లీ అడగ్గా.. తాను సిబిఐ అధికారి.. రా కు డెఫ్యూటేషన్ పై వెళ్లాలని చెప్పాడు. అనుమానంతో అప్రమత్తంగా వ్యవహరించిన కాలేజీ యాజమాన్యం అతడ్ని గదిలో నిర్భంధించి.. పోలీసులకు పిర్యాదు చేశారు. అసలే అమ్మాయిలపై అఘాయిత్యాలు పెరుగుతున్న ఈ రోజుల్లో ఎవరు మనిషో.. ఎవరు మృగాడో తెలియక కాలేజీ యాజమాన్యం చేసిన చర్యలను స్తానికులు అభినందిస్తున్నారు.

పోలీసుల కథనం మేరకు...గుంటూరు జిల్లా ముస్తాఫానగర్‌కు చెందిన ఉదయ్‌కిరణ్‌ సీఏ చదువుతున్నాడు. ఖమ్మం జిల్లా వైరా ఇంజనీరింగ్‌ కళాశాలకు చెందిన ఓ యువతితో ప్రేమలో పడ్డానని చెబుతున్నాడు. సదరు యువతితో మాట్లాడేందుకు ఉదయ్ కిరణ్‌ ఏకంగా ‘రా’ ఏజెంట్‌ అవతారం ఎత్తాడు. కళాశాలకు వెళ్లి తాను ‘రా’ ఏజెంట్‌నని ప్రిన్సిపాల్‌కి పరిచయం చేసుకున్నాడు. ఓ యువతి పేరు చెప్పి ఆమెను విచారించాల్సిన అవసరం ఉందని, ఆమెను తన వద్దకు పంపాలని కోరాడు. మరోమారు ప్రిన్సిఫల్ విచారించగా, తాను సిబిఐ అని బదులిచ్చాడు.

ఓ యువకుడు వచ్చి అమ్మాయితో ఏకాంతంగా విచారించాలని చెప్పడం.. మహిళలపై జరుగుతున్న అకృత్యాలు నేపథ్యంలో కాలేజీ ప్రధానోపాధ్యాయుడు అప్రమత్తంగా వ్యవహరించాడు. ఉదయ్ కిరణ్ ను తన చాంబర్ లోనే నిర్భంధించి.. పోలీసులకు సమాచారం అందించాడు. అయితే ఇందుకు ఉదయ్‌ కిరణ్‌ ప్రవర్తన, వేషాధారణతో ప్రిన్సిపాల్ కు అనుమానం కలిగింది. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా, ‘నేను ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ఆమెతో ఏకాంతంగా మాట్లాడేందుకే ఈ ఎత్తుగడ వేశాను’ అంటూ చెప్పడంతో పోలీసులే ఆశ్చర్యపోయారు. బంగారం లాంటి భవిష్యత్తును ఇటువంటి తప్పిదాలతో యువత పాడుచేసుకుంటున్నారని పోలీసులు విచారం వ్యక్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles