BJP MP welcomes AP CM YS Jagan in Airport సీఎం జగన్ కు బీజేపి ఎంపీ స్వాగతం, సన్మానం

Bjp mp tg venkatesh welcomes ap cm ys jagan in airport at orvakallu

YS Jagan, BJP party, YCP party, TG Venkatesh, Orvakallu airport, Judicial Capital, Kurnool, Andhra Pradesh, Politics

BJP MP TG Venkatesh comes to Orvakallu (Kurnool) airport to welcome Andrha Pradesh Chief Minister YS JaganMohan Reddy and fecilitated him for picking up of Kurnool as Judicial capital of the state.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు బీజేపి ఎంపీ స్వాగతం, సన్మానం

Posted: 02/27/2020 03:15 PM IST
Bjp mp tg venkatesh welcomes ap cm ys jagan in airport at orvakallu

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు కర్నూలు జిల్లాలో అరుదైన నేత నుంచి స్వాగతాన్ని అందుకున్నారు. తమ పార్టీకి చెందిన నేతలు ఆయన వస్తున్న సమాచారం అందుకుని విమానాశ్రాయాలకు చేరకుని ఘనస్వాగతాన్ని పలుకుతుండటం పరిపాటి. కానీ అందుకు భిన్నంగా ఇవాళ ఆయన కర్నూలు పర్యటనలో ప్రముఖ బీజేపీ ఎంపీ ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఆయన మరెవరో కాదు. టీజీ వెంకటేష్. కర్నూలు జిల్లాలో జరిగిన ఓ వివాహ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు వచ్చిన జగన్‌కు టీజీ స్వాగతం పలికారు.

అంతటితో ఆగని బీజేపి ఎంపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను శాలువాతో సత్కారించారు. బీజేపీ ఎంపీ అయినా సీఎం జగన్‌ను కలిసి సన్మానించడం ఆసక్తికరంగా మారింది. అయితే ఇందుకు కారణాలు ఏంటీ.?.. ఒకనాటి రాష్ట్ర రాజధానిగా బాసిల్లిన తమ జిల్లాకు.. మరోమారు అంతటి ఘనకీర్తిని అందించడమేనని టీజీ చెబుతున్నారు. కర్నూలు జిల్లాను న్యాయరాజధానిగా ఏర్పాటు చేస్తూ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నందుకు జగన్‌ను టీజీ వెంకటేష్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. సన్మానం తర్వాత ఇద్దరి మధ్య ఎయిర్‌పోర్టులో ఆసక్తికర సంభాషణ జరిగింది.

కర్నూలుకు రావాల్సిన హైకోర్టు ఎంతవరకు వచ్చిందని జగన్ ను ఎంపీ టీజీ అడగ్గా.. కేంద్రం అనుమతి కోరామని.. నివేదిక కూడా పంపించామని సీఎం చెప్పారని సమాచారం. రాయలసీమ డిక్లరేషన్‌లో, బీజేపీ మేనిఫెస్టోలో హైకోర్టు అంశం ఉందని.. కాబట్టి హైకోర్టుకు సంబంధించి కేంద్రం నుంచి త్వరలోనే సానుకూల ప్రకటన రావొచ్చని ఎంపీ టీజీ వెంకటేష్ వ్యాఖ్యానించారట. ముఖ్యమంత్రి జగన్ పత్తికొండ ఎమ్మెల్యే కె.శ్రీదేవి కుమారుడు రామ్మోహన్‌రెడ్డి పెళ్లి వెళ్లిన సంగతి తెలిసిందే. ఓర్వకల్లు విమానశ్రయంలో జగన్‌కు ఎంపీ టీజీతో పాటూ మంత్రులు, ఎమ్మెల్యేలు, వైఎస్సార్‌సీపీ నేతలు ఘన స్వాగతం పలికారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles