YSRC workers plan protest against Chandrababu Naidu చంద్రబాబు విశాఖ పర్యటన ఉద్రిక్తం.. వైసీపీ నిరసనలు..

Tension at visakhapatnam airport as ysrcp supporters oppose chandrababu naidu s visit

CM Jagan, AP CM YS Jagan, YS Jagan on Chandrababu, chandrababu Praja Chaitanya Yatra, TDP Praja Chaitanya Yatra, chandrababu visakhapatnam, Praja Chaitanya Yatra Visakhapatna, YCP party, TDP party, Visakha airport, Praja Chaitanya Yatra, vizag, Visakhapatnam, Andhra Pradesh, Politics

Tension prevailed at Vizag airport on Thursday afternoon as several YSRCP supporters opposed the visit of TDP Chief Chandrababu Naidu to the city. Mr. Naidu, who landed in Vizag as part of his Praja Chaitanya Yatra, was greeted by his party cadre that had gathered in large numbers at the airport..

విశాఖలో టెన్షన్.. చంద్రబాబు కాన్వాయ్ పై గుడ్లు.. చెప్పులు

Posted: 02/27/2020 02:22 PM IST
Tension at visakhapatnam airport as ysrcp supporters oppose chandrababu naidu s visit

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు విశాఖలో చేదు అనుభవం ఎదురైంది. ఆయన విశాఖ పర్యటనను అడ్డుకునేందుకు పెద్దఎత్తున వైసీపీ కార్యకర్తలు విశాఖ విమానాశ్రయానికి చేరుకుని గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. అంతటితో అగని వైసీపీ కార్యకర్తలు విశాఖ విమానాశ్రయానికి చేరకునే పలు రహదారులపై బైఠాయించి నిరసనను వ్యక్తం చేయడంతో పలుచోట్ల ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. అయితే విశాఖ విమానాశ్రాయానికి తమ అధినేత వస్తున్నాడన్న సమాచారం టీడీపీ కార్యకర్తలు కూడా రావడంతో.. వైసీపీ కార్యకర్తలకు పోటీగా వారు కూడా నినాదాలు చేయడంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం అలుముకుంది,

విశాఖ విమానాశ్రయం నుంచి చంద్రబాబు బయటకురాగానే ఆయన కాన్వాయ్ కి అడ్డంగా వైసీపీ కార్యకర్తలు పడుకున్నారు. దీంతో కాన్వాయ్‌ నిలిచిపోయింది. దాదాపు రెండు గంటల సమయం చంద్రబాబు తన వాహనంలోనే కూర్చుండి పోయారు. మధ్యమధ్యలో తన వాహనం నుంచి దిగి తమ కార్యకర్తలకు అభివాదాలు చేస్తూ.. కారులోనే కూర్చుండిపోయారు. అయితే వైసీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వున్న కారణంగా పోలీసులు చంద్రబాబును విమానాశ్రయం లాభీలోనే కూర్చోమని.. ట్రాఫిక్ క్లియర్ చేసిన తరువాత తాము సందేశానిస్తామని చెప్పారు. అయితే అందుకు సమ్మతించని చంద్రబాబు కారులోనే కూర్చున్నారు.

దాదాపు రెండు గంటల పాటు అలాగే కూర్చున్నా పోలీసులు ట్రాఫిక్‌ క్లియర్‌ చేయకపోవడంతో ఒక దశలో పాదయాత్రగా బయల్దేరేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారు. అయితే భద్రతా కారణాల దృష్ట్యా పోలీసులు ఆయనను వారించడంతో తిరిగి మళ్లీ వాహనంలోనే కూర్చున్నారు. ఈ నేపథ్యంలో పలువురు వైసీపీ కార్యకర్తలు చంద్రబాబు కాన్వాయ్ పైకి చెప్పులు, కొడిగుడ్లు, టామాటాలు విసిరారు. అయితే అవి ఆయన వాహనశ్రేణిపై పడలేదు. విమానాశ్రయం నుంచి ఎన్‌ఏడీ కూడలి వరకు వివిధ ప్రాంతాల్లో రహదారిపై వైసీపీ శ్రేణులు బైఠాయించడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్‌ నిలిచిపోయింది. ప్రభుత్వం పథకం ప్రకారమే చంద్రబాబు పర్యటనను అడ్డుకుంటోందని టీడీపీ నేతలు ఆరోపించారు.

వైసీపీ నేతలు పెయిడ్‌ ఆర్టిస్టులను తీసుకొచ్చి చంద్రబాబును అడ్డుకుంటున్నారని విమర్శించారు. రూ.500 చొప్పున ఇచ్చి జనాన్ని తరలించారని టీడీపీ నాయకురాలు అనిత ఆరోపించారు. పోలీసులు వైసీపీ కార్యకర్తలకు కొమ్ముకాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ఇలాంటి చర్యల ద్వారా అధికార వైసీపీ ప్రభుత్వ దిగజారుడు తననానికి నిదర్శనమని విమర్శించారు. ఇది ప్రతిపక్షంపై ప్రభుత్వం చేయించిన దాడిగా అభివర్ణించారు. ప్రశాంతంగా వుండే విశాఖను.. ఎలా మారుస్తున్నారో తెలియజేయడానికి ఇది ట్రైయిలర్ మాత్రమేనని.. విశాఖ ప్రజలు కూడా అప్రమత్తంగా వ్యవహరించాల్సిన సమయం ఆసన్నమైందని, లేదంటే వైసీపీ సినిమా చూపించడం ఖాయమని టీడీపీ నేతలు విమర్శించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles