AP High Court to hear HC, capital shifting pleas separately అమరావతి అభివృద్దిపై వివరాలు కోరిన హైకోర్టు..

Ap high court directs state and central govt s to file counters on three capitals adjourns to march 17

AP HIgh Court, Decentralisation, CRDA, Three Capital Plan, GN Rao committee, Boston Group, Amaravati, three capital, State Assembly, joint action committee, YS Jagan, ys jagan mohan reddy, chandrababu naidu, andhra pradesh capital, amaravati lands case, Chief Justice JK Maheshwari, Justice AV Sesha Sai, Justice M Satyanarayana Murthy, Supreme Court, Vijayawada, farmers, Andhra Pradesh, Politics

The Andhra Pradesh High Court directed the State and Central governments to file their counters in various petitions filed against the proposal of the government to relocate the High Court to Kurnool, the government’s three-capital plan and pleas challenging the reports of the GN Rao committee, Boston Consulting Group and the High-Powered Committee.

అమరావతి అభివృద్దిపై వివరాలు కోరిన హైకోర్టు.. కేంద్ర, రాష్ట్రాలకు అదేశం..

Posted: 02/27/2020 12:41 PM IST
Ap high court directs state and central govt s to file counters on three capitals adjourns to march 17

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులు, హైకోర్టు తరలింపు వ్యవహారాలపై పూర్తి వివరాలను తెలియజేయాల్సిందిగా ఆదేశిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ ఏవీ శేషసాయి, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. రాజధానిలో పనుల కొనసాగింపు, హైకోర్టు తరలింపు వంటి పలు అంశాలపై దాఖలైన వివిధ కేసులపై విచారణ జరిపిన హైకోర్టు ఈ మేరకు అదేశాలను జారీ చేసింది.

మూడు రాజధానుల ప్రతిపాదన, హైకోర్టు తరలింపులతో పాటు జీఎన్ రావు కమిటీ నివేదిక, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్, హైపవర్ కమిటీలు ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలపై వేర్వురుగా పిటీషన్లు దాఖలైన నేపథ్యంలో వాటినిన వేర్వేరుగానే విచారిస్తామన్న న్యాయస్థానం.. సీఆర్డీఏ, మూడు రాజధానుల అంశాలను ఒక అంశంగా, కమీటీలు సమర్పించిన నివేదిక పిటీషన్లను మరో అంశంగా పరగిణించి విచారణ జరుపుతామని తెలిపింది. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అమరావతి అభివృద్దిపై నివేదికలు కోరింది. అంతకుముందు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దేవదత్ కామత్ వాదనలు వినిపించారు.

రాజధాని పరిధిలోని అభివృద్ధి పనులను రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా నిలిపివేసిందని, వెంటనే వాటిని పునరుద్ధరించేలా ఆదేశించాలని కోర్టును కోరారు. అలాగే, హైకోర్టు తరలింపు అంశం కూడా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిది కాదని, ఈ నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్రమేనని అన్నారు. అమరావతిలో శాశ్వత హైకోర్టు నిర్మాణాలను కొనసాగిస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో దేశసర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిందన్న విషయాన్ని కూడా ఆయన గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో శాశ్వత హైకోర్టు భవనం నిర్మాణాలకు చర్యలు తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు.

మాస్టర్ ప్లాన్ ప్రకారం రాజధానిలో అభివృద్ధి పనుల్ని కొనసాగించాలని మరో న్యాయవాది అంబటి సుధాకరరావు కోరారు. నిబంధనలకు విరుద్ధంగా కమిటీలను ఏర్పాటు చేశారని, కారణం లేకుండానే రాజధానిలో అభివృద్ధి పనులను నిలిపివేశారని, తిరిగి పనులు కొనసాగించేలా ఆదేశించాలని న్యాయవాదులు మురళీధరరావు, ఎమ్మెస్ ప్రసాద్ కోరారు. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అశోక్‌భాన్ తన వాదనలు వినిపిస్తూ రాష్ట్ర ప్రభుత్వం దురుద్దేశంతోనే రాజధానిని తరలిస్తోందని, ప్రభుత్వం మారినా విధానపరమైన నిర్ణయాలు మారడానికి వీల్లేదన్నారు.

వాదనలు విన్న ధర్మాసనం రాజధానితో ముడిపడి ఉన్న వ్యాజ్యాలను అంశాల వారీగా విభజించి విచారణ జరపడం మంచిదని పేర్కొంది. రాజధానికి నిధులు ఇచ్చినందున ఈ వ్యాజ్యాల్లో ప్రమాణపత్రం దాఖలు చేయాలని ధర్మాసనం కేంద్రాన్ని ఆదేశించింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కౌంటర్లు వేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను మార్చి 17కు వాయిదా వేసింది. అలాగే, పాలన వికేంద్రీకరణ బిల్లు, సీఆర్‌డీఏ చట్టం రద్దు బిల్లు, జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్, హైపవర్ కమిటీ నివేదికలను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాల్లోనూ ప్రమాణపత్రం దాఖలు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. వీటికి సంబంధించిన వ్యాజ్యాల విచారణను వచ్చే నెల 30కి వాయిదా వేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles