Shiv Sena hails SC order on Women in Army సుప్రీంకోర్టు నిర్ణయంపై శివసేన హర్షం.. సామ్నాలో కథనం

Sc order on women in army historic centre s stand regressive shiv sena

Shiv Sena, Saamana, Women in army, Permanent commission, Centre, Indira Gandhi, India pakistan war, Supreme Court, Army, Rani Laxmibai, Rani Chennamma, Maharani Tarabai, Captain Lakshmi Sehgal, Indian National Army, National Politics

The Shiv Sena described the Supreme Court’s direction to the government to grant permanent commission to women officers in the army as “historic” and criticised the Centre for its “regressive” stand of opposing command postings for women, while quoting former PM Indira Gandhi Victory over Pakistan in 1971.

సుప్రీం నిర్ణయంపై హర్షం.. ఇందిరను ఊటంకిస్తూ సామ్నాలో కథనం

Posted: 02/19/2020 05:32 PM IST
Sc order on women in army historic centre s stand regressive shiv sena

సైనిక దళాల్లో లింగ వివక్షకు ముగింపు పలుకుతూ సైన్యంలో మహిళా అధికారులకు ‘కమాండ్‌ హోదా’ ఇచ్చేలా దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై శివసేన హర్షం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు నిర్ణయం చారిత్రాత్మకమని కొనియాడింది. ఇదే సమయంలో మహిళా అధికారులకు కమాండ్‌ హోదా ఇవ్వడాన్ని వ్యతిరేకించిన కేంద్ర ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించింది. మహిళా ప్రధాని ఇందిరాగాంధీ హయాంలో 1971లో పాకిస్థాన్ పై మనం యుద్ధం గెలిచామన్న విషయాన్ని మరిచారా అంటూ ఎద్దేవా చేసింది.

ఈ మేరకు తమ అధికారిక పత్రిక సామ్నా సంపాదకీయంలో రాసుకొచ్చింది. సుప్రీంకోర్టు తీర్పుతో కేంద్రం షాక్‌కు గురైంది. శారీరక పరమైన పరిమితుల కారణంగా మహిళలకు కమాండ్ హోదా ఇవ్వట్లేదని ప్రభుత్వం చెప్పింది. అంతేగాక అలాంటి కఠినమైన విధులు మహిళలు నిర్వర్తించగలరా లేదా అని అనుమానించింది. ప్రగతి గురించి మాట్లాడే ప్రభుత్వం నిజమైన వైఖరి ఇదే’ అని శివసేన విమర్శించింది. ఇలాంటి మూస ఆలోచనా ధోరణిని ప్రభుత్వం మార్చుకోవాల్సిన అవసరం ఉందని సూచించింది. మహిళ అయిన ఇందిరా గాంధీ ఈ దేశానికి ప్రధాని అయ్యారని, ఆమె నాయకత్వంలో 1971లో పాకిస్తాన్ పై భారత్‌ యుద్ధం గెలిచిన విషయాన్ని గుర్తుచేసింది.

అంతేకాదు కేంద్రం చరిత్రలో వీరనారీమణులుగా నిలిచిన వారిని కూడా విస్మరించడంతో పాటు అవమానించేలా చేస్తోందని విమర్శించింది. రాణీ ఝాన్సీ లక్ష్మీభాయి, రాణి చెన్నమ్మ, రాజారామ్ మోహన్ రాయ్ సతీమణి మహారాణి తారాభాయ్, కెప్టెన్ సుబాష్ చంద్రబోస్ నిర్మించిన ఇండియన్ నేషనల్ అర్మీలో కెప్టెన్ గా వ్యవహరించిన లక్ష్మీ సెహగల్ పేర్లను కూడా ఊటంకించింది. మహిళా శౌర్యం, త్యాగం విషయంలో మహిళ, పురుషుడు అనే భేదభావం చూపించడం ఎంతమాత్రం సరికాదని హితవు పలికింది. సాయుధ బలగాలకు మహిళ అధినాయకత్వం వహించే రోజు కూడా త్వరలోనే వస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది.

సైన్యంలో మహిళా అధికారులకు మూడు నెలల్లోగా శాశ్వత కమిషన్‌ మంజూరు చేయాలని సుప్రీంకోర్టు గత సోమవారం కేంద్రాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. శారీరక పరిమితుల కారణంగా మహిళలకు కమాండ్‌ హోదా ఇవ్వడం లేదన్న ప్రభుత్వ వాదనను న్యాయస్థానం తీవ్రంగా తప్పబట్టింది.  ‘‘గర్భధారణ, మాతృత్వాన్ని పొందడం, పిల్లల పెంపకం, కుటుంబపరమైన బాధ్యతల నిర్వహణ వంటి కారణాల వల్ల మహిళా అధికారులు సైనిక విధుల్లోని సవాళ్లను అందుకోలేరన్న కేంద్ర ప్రభుత్వ వాదన మూస ఆలోచన ధోరణికి నిదర్శనం. ఇది రాజ్యాంగపరంగా చెల్లుబాటు కాదు’’ అని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shiv Sena  Saamana  Women in army  Permanent commission  Centre  Supreme Court  Army  National Politics  

Other Articles