Two Rape 19-Year-Old Woman Travelling With Husband హర్యానాలో దిశ తరహా ఘటన.. టోల్ ప్లాజా వద్ద మహిళపై..

Haryana shocker two rape 19 year old woman travelling with husband

haryana rape, Haryana Shocker, Karnal Toll plaza, washroom, Panipat, Rape, gangrape, rape shocker, Sexual Assault, Harayana, Crime

In a shocking incident of sexual assault in the state, two men raped a 19-year-old woman who was travelling with her husband on a bus. The victim had got down from the bus to use the washroom near Karnal Toll plaza, while her husband waited outside. After committing the heinous crime, the two accused left their phone number with the woman.

హర్యానాలో దిశ తరహా ఘటన.. టోల్ ప్లాజా వద్ద మహిళపై..

Posted: 02/19/2020 04:32 PM IST
Haryana shocker two rape 19 year old woman travelling with husband

టోల్ ప్లాజా వద్ద తన స్కూటర్ ను పార్క్ చేసి వెళ్లిన దిశపై పథకం వేసి మరీ అమెపై అఘాయిత్యానికి తెగబడి.. ఆపై అమెను కిరాతకంగా హతమార్చి..దహనం చేసిన దిశ ఘటన గుర్తుందా.? ఈ కేసులోని నలుగురు నిందితులను తెలంగాణ పోలీసులు ఎన్ కౌంటర్ చేసి హత్యమార్చారు. సరిగ్గా ఇదే తరహాలో హర్యానాలోని చంఢీగడ్ లో మూత్రవిసర్జనకు వెళ్లిన  ఓ మహిళపై ఇద్దరు కీచకులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా ఘటనాస్థలంలో వారి మొబైల్‌ నంబర్లను ఇచ్చి మరీ వెళ్లిపోయారు.

పోలీసుల వివరాల ప్రకారం.. పంజాబ్ కు చెందిన భార్యాభర్తలు తమ బంధువులను కలవడానికి పానిపట్ కు వెళ్లారు. ఆదివారం రోజుల వారు తిరుగు పయనం అయ్యారు. బస్సులో వస్తుండగా వారికి ఇవ్వాల్సిన డబ్బు రావడంతో పానిపట్ కు చెందిన బంధువులు ఫోన్ చేసిన సమాచారం అందించారు. దీంతో బందువుల కోసం రాత్రి 11 గంటల సమయంలో కర్నల్‌ టోల్‌ప్లాజా వద్ద బస్సు దిగారు దంపతులు. వారి కోసం నిరీక్షించే సమయంలో బాధిత మహిళ(19) మూత్రవిసర్జన కోసం  పక్కనే ఉన్న పొదల్లోకి వెళ్లింది.

ఇది గమనించిన స్థానికంగా ఉన్న ఇద్దరు వ్యక్తులు మహిళను కత్తితో బెదిరించి నిర్మానుష్య ప్రాంతానికి లాక్కెళ్లారు. అక్కడ ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టారు. అనంతరం మహిళను అక్కడే వదిలేసి దుండగులు పరారయ్యారు. అయితే అంతకుముందు వారు తమ మొబైల్‌ నెంబర్లను అమె వద్ద ఇచ్చారు. ఎలాగోలా అక్కడి నుంచి బయటపడ్డ బాధిత మహిళ  భర్త దగ్గరికి వచ్చి.. తనకు జరిగిన ఘోరాన్నిచెప్పుకుని విలపించింది. దీంతో సోమవారం ఉదయం ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు నిందితుల ఫోన్ నెంబర్ల ఆధారంగా వారిని అదుపులోకి తీసుకున్నారు. అయితే నిందితులు ఇచ్చిన ఫోన్‌ నెంబర్ల ఆధారంగా వారు పోలీసులకు చిక్కారు. అయితే నిందితులు టోల్ ప్లాజా వద్ద చిప్స్‌ అమ్ముకునే మేఘరాజ్‌, సోనూలుగా పోలీసులు గుర్తించారు. నిందితులను కోర్టులో హాజరు పరిచిన పోలీసులు అనంతరం వారిని రిమాండ్‌కు తరలించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles