SC dismisses curative plea of Nirbhaya case convict ‘నిర్భయ’ దోషి పిటీషన్ ను తిరస్కరించిన సుప్రీం

Nirbhaya case supreme court dismisses akshay thakur s curative plea

Tihar Jail authorities, Nirbhaya case convicts, Tihar jail, Nirbhaya convicts hanging, Nirbhaya case, Nirbhaya convicts mercy petition, Satish Kumar Arora, Supreme Court, Additional Registrar, deputation basis, nirbhaya murder case Pawan Gupta, Mukesh singh, Vinay Sharma, Akshay Thakur, Nirbhaya, Murder, Rape, Supreme Court, gang-rape, Mount Elizabeth Hospital, Tihar jail, Crime

The Supreme Court Thursday dismissed the curative petition of one of the four death row convicts in the Nirbhaya gang rape and murder case saying "no case is made out". The top court also rejected convict Akshay Kumar Singh's plea seeking stay of his execution.

‘నిర్భయ’ దోషి క్యూరేటివ్ పిటీషన్ తిరస్కరణ.. ఉరి ఖాయం..

Posted: 01/30/2020 07:53 PM IST
Nirbhaya case supreme court dismisses akshay thakur s curative plea

దేశవ్యాప్తంగా పెనుసంచలనం సృష్టించిన నిర్భయ హత్యాచారం కేసులో దోషులను ఉరి తీసే సమయం సమీపిస్తున్న కొద్దీ సర్వత్రా ఉత్కంఠ నెలకొంటోంది. ఈ కేసులో దోషులు ఈ సారైనా శిక్ష పడుతుందా.? అని యావత్ దేశం ఎదురుచూస్తోంది. కాగా, దోషులతో పాటు దోషుల తల్లిదండ్రులు మాత్రం.. ఈ సారి ఉరి కంబం నుంచి తప్పించుకునే మార్గం ఏదైనా కనిపించకపోతుందా.? అని ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో దోషిగా వున్న ముఖేష్ సింగ్ రాష్ట్రపతి క్షమాభిక్ష తిరస్కరణను సవాల్ చేస్తూ దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటీషన్ ను న్యాయస్థానం కొట్టివేసింది. ముఖేష్ సింగ్ పిటీషన్ అర్హమైనది కాదని తేల్చింది.

ఈ క్రమంలో ఈ కేసులో మరో దోషి అక్షయ్ కుమార్ పెట్టుకున్న క్యూరేటివ్ పిటీషన్ కూడా న్యాయస్థానం తిరస్కరించింది. న్యాయమూర్తి ఎన్వీ రమణ నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం ఈ క్యురేటివ్ పిటిషన్ పై విచారణ జరిపింది. పిటిషన్ కొట్టివేసింది. మహిళలపై హింసకు సంబంధించిన కేసుల్లో ప్రజల నుంచి ఎదురయ్యే ఒత్తిడి, ప్రజాభిప్రాయాలను అనుసరించి కోర్టులు సర్వరోగ నివారిణిగా దోషులకు మరణశిక్ష విధిస్తున్నాయని అక్షయ్ తన క్యురేటివ్ పిటిషన్ లో చెప్పాడు. అంతేకాని నిజంగా నేరస్థుల ప్రాణాలను తీయాలన్నది న్యాయస్థానాల అభిమతం కాదని పేర్కోన్నాడు

ఎన్నో ఏళ్లుగా పలు నేరాల్లో దోషులుగా తేలినవారికి కూడా చివరి క్షణంలో మరణశిక్షను తప్పిస్తున్న న్యాయస్థానాలు.. వారికి జీవిత ఖైదు శిక్షను విధిస్తున్నారని అన్నాడు. అలాగే తమకు కూడా ఉరి శిక్షను తప్పించి జీవితఖైతు శిక్షను విధించాలని కోరాడు. నిర్భయ దోషులను ఫిబ్రవరి 1న ఉరి తీయాల్సిందిగా ఢిల్లీ కోర్టు ఇటీవల రెండోసారి డెత్ వారెంట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో శిక్ష అమలును ఆపేందుకు దోషులు అన్ని విధాల ప్రయత్నిస్తున్నారు. ఉరి శిక్ష నుంచి తప్పించుకోవడానికి, ఉరి తేదీని మరింత ఆలస్యం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకరి తర్వాత ఒకరు పిటిషన్లు వేస్తూ.. ఉరి తేదీని పొడిగిస్తున్నారు. ఇప్పటికే ఉరి తేదీ వాయిదా పడిన విషయం తెలిసిందే.

ఇక తాజాగా నిర్భయ హత్యాచార కేసు దోషుల్లో ఒకడైన అక్షయ్.. దాఖలు చేసిన క్యురేటివ్ పిటిషన్ ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఉరిశిక్షను సవాల్ చేస్తూ అక్షయ్ కుమార్ సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేశాడు. ఆ పిటిషన్ కొట్టివేయడంతో క్యురేటివ్ పిటిషన్ వేశాడు. ఇక మరో దోషి వినయ్ శర్మ క్షమాభిక్ష కోరుతూ రాష్ట్రపతికి పిటిషన్ దాఖలు చేశాడు. తనకు విధించిన మరణశిక్షను యావజ్జీవ శిక్షగా మార్చాలని విజ్ఞప్తి చేశాడు. దోషులు ఇక తమకు మరణం తప్పదని తెలిసి శతవిధాలా తమకు శిక్ష అమలు కాకుండా వుండేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు.

అయితే నిర్భయ దోషులకు రెండోసారి డెత్ వారెంట్ జారీ అయిన క్రమంలో ఇక ఉరి శిక్ష తప్పదని తెలుస్తోంది. వారు చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. శిక్ష అమలు కాకుండా అనేక అడ్డంకులు సృష్టిస్తున్నా అవన్నీ వాటంతట అవే తొలిగాయి. మరణశిక్ష విధించబడిన దోషులు శిక్ష అమలుకు ముందు పెట్టుకునే పిటీషన్లను అత్యంత అవసరం కింద విచారించాలని ఇటీవలే దేశ ప్రధాన న్యాయమూర్తి బాబ్డే కూడా న్యాయస్థానాలకు సూచించారు. దీంతో వారు దాఖలు చేసిన పిటీషన్లను న్యాయస్థానాలు వెనువెంటనే విచారణకు స్వీకరిస్తున్నాయి. దీంతో అన్ని దారులు మూసుకుపోవడంతో వారికి ఉరి తీయడం ఖాయంగా కనిపిస్తోంది. షెడ్యూల్ ప్రకారమే ఫిబ్రవరి 1న ఉదయం 6 గంటలకు నలుగురు దోషులను తీహార్ జైల్లో ఉరి తీయనున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles