Godse, Modi believe in same ideology: Rahul Gandhi నాధూరాం గాడ్పేతో ప్రధానిని పోల్చిన రాహుల్

Like godse modi is filled with hatred rahul gandhi in wayanad

Rahul Gandhi, Narendra Modi Nathuram Godse, BJP, Congress, Mahatama Gandhi Assasination, Gandhi Death Annovcersary, Martyr's Day, Wayanad, PM Modi, CAA, NRC, Godse, Mahatma Gandhi, Kerala, Politics

Congress leader Rahul Gandhi on Thursday equated Prime Minister Narendra Modi with Mahatma Gandhi's assassin Nathuram Godse, saying that both believe in the same ideology.

ప్రధాని మోడీ.. గాడ్సేలు సిద్దాంతం, భావాజాలం ఒక్కటే: రాహుల్

Posted: 01/30/2020 08:54 PM IST
Like godse modi is filled with hatred rahul gandhi in wayanad

ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మరోసారి తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మరోసారి తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. కేరళలోని వయనాడ్‌ జిల్లా కాల్పెట్టలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్రలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాహుల్‌ ప్రధాని నరేంద్రమోడీపై పదునైన మాటలతో విరుచుకుపడ్డారు.

మహాత్మా గాంధీని చంపిన నాథూరామ్‌ గాడ్సే, ప్రధాని మోదీ ఇద్దరూ ఒకే భావజాలాన్ని నమ్ముతారని రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానించారు. దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందన్న రాహుల్.. ఎన్‌ఆర్‌సీ, సీఏఏ వాటి వల్ల కొత్తగా ఉద్యోగాలు రావన్నారు. భారతదేశ పౌరులు తాము భారతీయులమని నిరూపించుకోవాల్సిన పరిస్థితులు తీసుకొస్తున్నారంటూ ధ్వజమెత్తారు.  మహాత్మా గాంధీ సత్యాన్వేషణ చేస్తున్నందు వల్లే ఆయన పట్ల ద్వేషంతో గాడ్సే కాల్చి చంపాడని రాహుల్‌ అన్నారు.

గాడ్సే తనకు తాను నమ్మలేదు.. కాబట్టే గాంధీని చంపేశాడు. గాడ్సే ఎవర్ని ప్రేమగా చూడేలేదు.. తన గురించి ఎవరు ఏమనుకున్నా పట్టించుకోలేదు.. మోడీ కూడా అంతే. ఈ విషయంలో మోడీ గాడ్సేతో సమానం. మోడీ తనకు తానే ప్రేమించుకుంటారు..తనకు ఇష్టమైన పనే చేస్తాడు. ప్రజల గురించి పట్టించుకోరు. అటువంటిదే పౌరసత్వ చట్ట సవరణ. అది భారతదేశంలో చాలామందికి ఇష్టంలేదు. కానీ మోడీ అదేమీ పట్టించుకోరు. దాని వల్ల ఎటువంటి పరిణామాలు వచ్చినా ఆయనకు అనవరం.తన ఇష్టానుసారంగా చేస్తారు. అందుకే మోడీ గాడ్సేలాంటి భావజాలం ఉన్నవారు.

భారతీయులందరూ తాము భారతీయులం అని నిరూపించుకోవాల్సిన రోజులు వచ్చాయి. తాను భారతీయుడిని అని నిర్ణయించేందుకు మోడీ ఎవరు? అని రాహుల్‌ ప్రశ్నించారు. భారతీయుడా? కాదా? అని నిర్ణయించేందుకు మోడీకి ఎవరు లైసెన్స్‌ ఇచ్చారు? ప్రతీ భారతీయుడు తాను భారతీయుడినని నిరూపించుకోవాల్సిన దుస్థితికి తీసుకొచ్చారనీ ఇది మోడీ నియంతృత్వ ధోరణికి నిదర్శనమని విమర్శించారు.

భారతీయుడినని నిరూపించుకోవాల్సిన అవసరం తనకు లేదన్నారు రాహుల్‌ గాంధీ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఉద్యోగాలు అడిగినప్పుడల్లా.. మోడీ యువత దృష్టిని మరలుస్తారని రాహుల్‌ విమర్శించారు. ఎన్నార్సీ, సీఏఏలతో యువత ఉద్యోగాలు కోల్పోతున్నారని కాంగ్రెస్‌ ఎంపీ మండిపడ్డారు. దీనిపై ప్రశ్నిస్తే వారిపై దేశ ద్రోహులుగా ముద్ర వేస్తున్నారనీ విమర్శించారు రాహుల్ గాంధీ. తాము భారతీయులమని నిరూపించుకోవాల్సిన అవసరం ఏ భారతీయులకు లేదని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rahul Gandhi  PM Narendra Modi  CAA  NRC  Godse  Mahatma Gandhi  Kerala  Politics  

Other Articles