IRCTC Bharat Darshan Train to tour karnataka ఐఆర్సీటీసీ.. ఉడిపి, ధర్మస్థల క్షేత్రాల పర్యటన

Irctc bharat darshan tourist train to tour udipi sringeri and dharmasthala

IRCTC Udipi Sringeri Dharmasthala Yatralu, IRCTC Bharat Darshan Tourist Train from vijayawada, IRCTC Bharat Darshan Tourist Train from hyderabad, IRCTC tours from hyderabad, IRCTC tours from vijayawada, IRCTC tourism, Telangana, Andhra Pradesh

IRCTC offers Bharat darshan Udipi Sringeri Dharmasthala Yatralu Tour package in 3rd AC three tier train starting from Vijayawada with entraining points at Khammam, Warangal, Kachiguda, Mahabubnagar and Kurnool on 30th Jan with seven nights and 8 days.

ఐఆర్సీటీసీ కర్ణాటక యాత్ర: ఉడిపి, శృంగేరీ, ధర్మస్థల క్షేత్రదర్శనం..

Posted: 01/20/2020 05:04 PM IST
Irctc bharat darshan tourist train to tour udipi sringeri and dharmasthala

తెలుగు రాష్ట్రాల పర్యాటకులకు ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్-ఇఆర్సీటీసీ శుభవార్త చెప్పింది. తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల నుంచి 'భారత్ దర్శన్ టూరిస్ట్ ట్రైన్'ను ప్రకటించింది. 'ఉడుపి-శృంగేరి-ధర్మస్థల యాత్రలు' పేరుతో అందిస్తున్న ఈ ప్యాకేజీ బుక్ చేసుకున్నవారిని కర్ణాటకలోని ప్రముఖ ఆలయాలు, ఆధ్యాత్మిక క్షేత్రాలకు తీసుకెళ్తుంది. మొత్తం 7 రాత్రులు, 8 రోజుల టూర్‌లో పర్యాటకులు హంపి, గోకర్ణ, మురుడేశ్వర్, మూకాంబిక, శృంగేరి, ధర్మస్థల, కుక్కి సుబ్రమణ్యం, ఉడుపి ఫుణ్యక్షేత్రాలతో పాటు మైసూర్, బేలూర్, హలిబీడు లాంటి పర్యాటక ప్రాంతాలను కూడా దర్శించొచ్చు.

ఐఆర్‌సీటీసీ 'ఉడుపి-శృంగేరి-ధర్మస్థల యాత్రలు' పర్యాటనకు ప్రయాణికులను తీసుకెళ్లే భారత దర్శన్ టూరిస్ట్ రైలు విజయవాడ నుంచి ఈ నెల 30 అనగా(2020 జనవరి 30న) అర్థరాత్రి బయల్దేరుతుంది. అదే రోజు ఖమ్మం, వరంగల్, కాచిగూడ, మహబూబ్‌నగర్, కర్నూల్, గుంతకల్ స్టేషన్లలో పర్యాటకులు ఈ రైలు ఎక్కొచ్చు. తిరుగు ప్రయాణంలో కూడా ప్రయాణికులు తాము ఎక్కిన రైల్వే స్టేషన్లలో దిగే ఏర్పాటును చేసింది ఐఆర్సీటీసీ. కాగా థర్డ్ ఏసీ త్రి టైర్ రైలులో ప్రయాణికుల పర్యటన సాగుతంది.

30వ తేదీ రాత్రికి హోస్పేట్ చేరుకుంటింది. జనవరి 31న ఉదయం హంపికి తీసుకెళ్తారు. మధ్యాహ్న భోజనం తర్వాత గోకర్ణకు బయల్దేరాలి. సాయంత్రానికి గోకర్ణ చేరుకుంటారు. ఫిబ్రవరి 1న మహాబలేశ్వర్, మురుడేశ్వర్ తీసుకెళ్తారు. ఫిబ్రవరి 2న మూకాంబిక, శృంగేరి శారదాంబ, ధర్మస్థలలో మంజునాథస్వామి దర్శనం ఉంటాయి. ఫిబ్రవరి 3న ధర్మస్థల నుంచి బయల్దేరి కుక్కి సుబ్రమణ్య స్వామిని దర్శించుకోవాలి. ఆ తర్వాత ఉడిపికి వెళ్లాలి. దర్శనం తర్వాత మంగళూరుకు తీసుకెళ్తారు. అక్కడ మైసూరు రైలు ఎక్కాలి.

ఫిబ్రవరి 4న ఉదయం మైసూరుకు చేరుకుంటారు. మైసూర్ ప్యాలెస్, చాముండి హిల్స్, బృందావన్ గార్డెన్స్, కేఆర్ఎస్ డ్యామ్ సందర్శించాలి. రాత్రికి మైసూరులోనే బస చేయాలి. ఫిబ్రవరి 5న తిరుగు ప్రయాణం ప్రారంభం అవుతుంది. ఈ యాత్రలో రెండు క్యాటగిరీల్లో ఏదో ఒక దానిని ప్రయాణికులు ఎంచుకోవచ్చు. స్టాండర్డ్ క్యాటగరిలో పర్యటనకు ఒక్కరికి రూ.9925, కంఫార్ట్ క్యాటగిరిలో ఒక్కరికి రూ.11605 చెల్లించాల్సి వుంటుంది. ఐదేళ్లలోపు చిన్నారులను ఉచితంగా తీసుకెళ్తారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles