JP Nadda Elected Unopposed As BJP President బీజేపి అధ్యక్షుడిగా జేపీ నడ్డా ఏకగ్రీవ ఎన్నిక

Jp nadda gets full command of bjp in a journey that began with abvp

jp nadda, bjp president, bjp working president, bharatiya janata party, bjp delhi, bjp national president, who is jp nadda, JP Nadda, Amit Shah, PM Modi, Nitin Gadkari, Rajnath singh, BJP President, Bihar, Haryana, president of bjp, bjp new president, Politics

JP Nadda on Monday got full official command of the BJP. During the nomination process, a host of BJP leaders including Amit Shah, Rajnath Singh and Nitin Gadkari proposed the name of Nadda for the BJP president. And, formality was over.

బీజేపి నూతన జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా ఏకగ్రీవ ఎన్నిక

Posted: 01/20/2020 04:04 PM IST
Jp nadda gets full command of bjp in a journey that began with abvp

బీజేపి పార్టీ నూతన జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బీజేపి పార్టీకి 11వ జాతీయ అధ్యక్షుడిగా ఆయన ఇవాళ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఢిల్లీలోని బీజేపి కార్యాలయానికి చేరుకున్న పార్టీ ముఖ్య నాయకులు నడ్డాను అధ్యక్షుడిగా ప్రతిపాదించారు. దీంతో ఆయన ఎలాంటి పోటీ లేకుండా బీజేపి జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైనట్లు సీనియర్‌ నాయకులు రాధామోహన్ సింగ్‌ అధికారికంగా ప్రకటించారు. గతంలో బీజేపి జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా సేవలందించిన నడ్డా కేంద్ర హోంమంత్రి అమిత్ షా నుంచి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు.

అనంతరం పార్టీ నేతలు అమిత్ షా సహా తదితర ముఖ్య నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. అటు ప్రధాని నరేంద్ర మోదీని కూడా జేపి నడ్డా కలువనున్నారు. ఈ క్రమంతో నడ్డాను ప్రధాని సత్కరించనున్నారని కూడా సమాచారం అందింది. ఆ తరువాత అనంతరం పార్టీ ముఖ్యనేతలతో ప్రధాని, నడ్డాలు సమావేశం కానున్నారు. హిమాచల్ ప్రదేశ్ కు చెందిన ఈ నేత గతంలో మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై.. ఆ తర్వాత కేంద్ర ఆరోగ్య మంత్రిగానూ పలు పదవుల్లో పనిచేశారు. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలోనూ ఆయన బీజేపి విజయంలో కీలక పాత్ర పోషించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : JP Nadda  Amit Shah  PM Modi  Nitin Gadkari  Rajnath singh  BJP President  Bihar  Haryana  Politics  

Other Articles

Today on Telugu Wishesh