Tension in OU as police arrests professor kasim ఉస్మానియా అసిస్టెంట్ ప్రొఫెసర్ కాశీం అరెస్ట్..

Tension in osmania university as police arrests professor kasim

Nadusthuna Telangana, C Kasim, Osmania University , Hyderabad police , Hyderabad Maoist raid, siddipet police, Medak, Telangana,crime

Police conducted a search at the residence of Osmania University professor and Nadusthuna Telangana newspaper editor C Kasim in early hours of Saturday and took him under custody. Kasim was also recently elected as one of the office-bearers of the revolutionary writers association, Virasam.

ఉస్మానియా అసిస్టెంట్ ప్రొఫెసర్ కాశీం అరెస్ట్.. ఓయూలో టెన్షన్

Posted: 01/18/2020 03:48 PM IST
Tension in osmania university as police arrests professor kasim

ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ సి.కాశీంను పోలీసులు అరెస్ట్ చేశారు. మావోయిస్టులతో ఆయనకు సంబందాలు వున్నాయన్న అనుమానాల నేపథ్యంలో ఆయనను అదుపులోకి తీసుకున్నారని సమాచారం. ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ లోని ఆయన నివాసంలో ఇవాళ తెల్లవారు జామునే చేరుకున్న పోలీసులు ఇంట్లో సోదాలు జరిపారు. సుమారు ఐదు గంటలకుపైగా సోదాలు చేసిన పోలీసులు కాశీం ఇంటి నుంచి కీలక డాక్యుమెంట్లు, కంప్యూటర్ హార్డ్ డిస్క్‌లు స్వాధీనం చేసుకున్నారు. ఆ వెంటనే ప్రొఫెసర్ ‌ను అరెస్ట్ చేశారు.

ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం గజ్వేల్ పోలిస్ స్టేషన్ కు ఆయనను తరలించనున్నట్లు సమాచారం. కాశీం అరెస్ట్‌పై భార్య స్నేహలత స్పందించారు. ఐదేళ్ల క్రితం కేసులో గజ్వేల్ పోలీసులు తనిఖీలు చేశారని.. 2016లో అక్రమంగా బనాయించిన కేసులో ఇప్పుడు అరెస్ట్ చేశారన్నారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై తన గళం విప్పినందుకే ప్రభుత్వం కక్షగట్టి.. తప్పుడు కేసులు బనాయించి అరెస్ట్ చేయిస్తోందని మండిపడ్డారు.

ఇవాళ తెల్లవారు జామున పోలీసులు కనీసం తలుపులు తెరవాలని కూడా సమాచారం అందించకుండా.. తలుపులు పగులగొట్టి లోపలికి వచ్చారని అమె అరోపించారు. తన ఇంట్లోని కంప్యూటర్ హార్డ్ డిస్క్, పుస్తకాలను తీసుకెళ్లిన పోలీసులు తప్పుడు కేసులు బనాయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. పోలీసుల తీరుపై హైకోర్టును ఆశ్రయిస్తాను అన్నారు. కాగా ప్రోఫెసర్ క్వార్టర్ వద్దకు చేరుకుంటున్న ఓయూ విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు.. దీంతో స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది. గజ్వేల్‌ ఏసీపీ నారాయణ నేతృత్వంలో ఖాసీం ఇంట్లో పోలీసులు ఈ తనిఖీలు చేశారు.

మావోయిస్టులతో సంబంధాలున్నాయనే అనుమానంతోనే ఈ సోదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రొఫెసర్‌ ఖాసీంపై 2016లో నమోదైన కేసులో భాగంగానే తనిఖీలు చేస్తున్నారట. ములుగు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నమోదైన కేసులో ఖాసీం ఏ-2గా ఉన్నారట. అప్పుడు ఆయన కారులో విప్లవ సాహిత్యం దొరికిందట. ఈ కేసులో మరోసారి సెర్చ్‌ వారెంట్లతో సోదాలు చేస్తున్నారట. ప్రొఫెసర్ ఖాసీం ఇటీవలే విప్లవం సంఘం (విరసం) రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles