Tension in Tulluru as police lathi charged on women మందడంలో అమ్మవారి పూజలను అడ్డుకున్న పోలీసులు

Tension in tulluru as police lathi charged on women

YS Jagan, Amaravati, Amaravati farmers, mandadam, Tulluru, Lathi charge, women, Tension, Temples, joint action committee, YS Jagan, Capitals, Visakhapatnam, kurnool, committee report, executive capital, legislative capital, judicial capital, Amaravati farmers, vanta varpu, Amaravati bandh, Jagan Mohan reddy, Andhra Pradesh vs Telangana, national interest, Vijayawada, farmers, Capital city, Amaravati, agitation, Andhra Pradesh, Politics

Tension prevailed in the capital region of Amaravati with police foiling attempts by the women to stage PadaYatra to Vijayawada KanakaDurga Temple and lathi charged the protesting women farmers and students. At Mandadam police objected the women to offer prayers to village diety poleramma.

ఇంద్రకీలాద్రికి భక్తుల పాదయాత్ర.. అడ్డుకున్న పోలీసులు.. ఉద్రిక్తత

Posted: 01/10/2020 10:38 AM IST
Tension in tulluru as police lathi charged on women

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలని ఆ ప్రాంత రైతులు గత 24 రోజులుగా నిరసనలు కార్యక్రమాలు చేపడుతున్నారు. రాజధాని పరిధిలోని 29 గ్రామాల ప్రజలు ఆయా గ్రామాల్లో అందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. కాగా శుక్రవారం అందులోనూ పౌర్ణమి కావడంతో ఈ ఉదయం గ్రామస్థులు గ్రామదేవత పోలేరమ్మకెు మొక్కులు చెల్లింపుకునేందుకు ఆలయానికి తరలిరావడంతో వారిని పోలీసలు అడ్డుకున్నారు. దీంతో మందడంలో పోలీసులకు రైతులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.

దీంతో పోలీసులు భారీ సంఖ్యలో మోహరించి గ్రామస్థులను ఆలయంలో పూజలు నిర్వహించకుండా అడ్డుకున్నారు. ఆలయంలోకి అసలు భక్తులను వెళ్లనీయకుండా అనుమతిని నిరాకరించి ఆలయాన్ని తమ ఆదీనంలోకి తీసుకున్నారు. ఈ క్రమంలో మహిళా భక్తులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో తోపులాట జరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. శుక్రవారం పూట అమ్మవారికి నైవేద్యం పెట్టుకోడానికి పోలీసులు అనుమతి తీసుకోవాలా.? అంటూ మహిళలు నిలదీశారు.

పోలీసుల ఆంక్షలతో అమ్మవారికి పూజలు నిర్వహించలేకపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు మందడంలో 144 సెక్షన్, సెక్షన్ 30 అమల్లో వున్నాయని మైక్ ద్వారా పోలీసులు ప్రచారం చేయడం.. పోలీసులు భారీగా మోహరించడం యుద్దవాతావారణం నెలకొంది. అటు రాజధాని అమరావతి పరిధిలోని తుళ్లూరులోనూ ఉద్రిక్తత కొనసాగుతోంది. తుళ్లూరు నుంచి విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి పాదయాత్రగా బయలుదేరిన మహిళలను గ్రామశివారల్లో పోలీసులు అడ్డుకున్నారు.

తాము దైవదర్శనానికి వెళ్తున్నామని ప్రభుత్వంపై యుద్ధం చేయడానికి కాదని, తమకు అనుమతివ్వాలని మహిళలు పోలీసులను వేడుకున్నారు. పాదయాత్రకు అనుమతి లేదని, విరమించుకోవాలని చెప్పడంతో మహిళలు... పోలీసులకు మధ్య వాగ్వాదం నెలకొంది. దైవదర్శనం చేసుకోవడానికి కూడా పోలీసులు ఆంక్షలు పెడితే సహించమని మహిళలు గట్టిగానే చెప్పారు. అయినా పోలీసులు వారి పాదయాత్రకు అనుమతిని ఇవ్వలేదు. దీంతో తమను అడ్డుకున్న పోలీసులను పట్టించుకోకుండా మహిళలు ముందుకు కదిలారు.

అంతే తమను లక్ష్యపెట్టకుండా ముందుకు సాగుతారా అంటూ మహిళలపై లాఠీ ఛార్జి చేశారు. పలువురు మహిళలకు స్వల్ప గాయాలయ్యాయి. తమను పోలీసులు గ్రామనిర్భదం చేయడం సముచితంగా లేదని వారు అక్షేపించారు. పోలీసు జులుం నశించాలి, సీఎం డౌన్ డౌన్ అంటూ మహిళలు పెద్ద ఎత్తున  నినాదాలు చేశారు. శుక్రవారం అమ్మవారిని దర్శించుకునేందుకు వెళ్తుంటే పోలీసులు అడుగడుగునా అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  అమ్మవారికి మొక్కులు సమర్పించుకునేందుకు కూడా ప్రభుత్వం అనుమతికావాలా? అని నిలదీశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles