TTD gears up for Vaikuntha Ekadasi festival వైకుంఠ ఏకాదశికి.. విమానయాన సంస్థల నిలువుదోపిడీ

No flight tickets to tirupati on vaikunta ekadasi and dwadasi

Tirumala tirupati, vaikunta ekadasi, vaikunta dwadasi, mukkoti ekadasi, flight tickets, hyderabad to renigunta, TTD, Railway, special trains

All Air services which leads to Tirumala Tirupati Devasthanam i.e, Renigunta Airport are full on Jan 5th, 6th and 7th. No flight ticket to tirupati on fay before vaikunta ekadasi and day after vaikunta dwadasi.

వైకుంఠ ఏకాదశికి.. విమానయాన సంస్థల నిలువుదోపిడీ

Posted: 01/04/2020 02:25 PM IST
No flight tickets to tirupati on vaikunta ekadasi and dwadasi

సంపన్నవర్గాలతో పాటు అధికాదాయ మధ్యతరగతి వర్గ ప్రజలకు అందుబాటులో వున్న విమానయానం సేవలు.. పండగ సీజన్ లో ప్రైవేటు బస్సు సర్వీసుల సేవలను తలపిస్తున్నాయి. ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని ఒక్కటి, రెండు రోజుల పాటు కలియుగ వైకుంఠమైన తిరుమల శ్రీవారిని దర్శంచుకునేందుకు వస్తున్న భక్తులకు నిలువుదోపిడి చేసేస్తున్నాయి. అదేంటి అంటే.. పండగ సీజన్లో బస్సుల్లో ఊళ్లకు వెళ్లే ప్రయాణికులను అధిక ధరలతో దోపిడీ చేసే పలు బస్సు సర్వీసుల మాదిరిగానే.. విమానయాన సర్వీసులు కూడా మారిపోయాయి.

ఔనా ఇలా విమానాయాస సర్వీసులు కూడా ధరలు పెంచేస్తాయా.? అంటే నిజమేనని చెప్పక తప్పదు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం సహా దేశంలోని పలు నగరాల నుంచి భక్తులు కలియుగ వైకుంఠంగా బాసిల్లుతున్న తిరుమల తిరుపతి దేవస్థానానికి విచ్చేసి.. ఉత్తర ద్వార ప్రవేశంతో పాటు శ్రీనివాసుడి దర్శనాన్ని చేసుకునేందుకు పోటీ పడుతుంటారు. దీంతో తిరుమలకు చేరువలో వున్న రేణిగుంట విమానాశ్రాయం కూడా భక్తులతో కళకళలాడుతోంది.

ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ధర్శనానికి సంపన్న భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారన్న విషయం తెలిసిన విమానయాన సంస్థలు తమ కస్టమర్లకు చుక్కలు చూపుతున్నాయి. అదెలా అంటే సాధారణ రోజుల్లో హైదరాబాద్ నుంచి తిరుపతి విమానాశ్రయ మార్గంలో టికెట్టు ధర రెండు వేల రూపాయల నుంచి రూ.3500 వరకు ఉంటుంది. కానీ భక్తల రద్దీ దష్ట్యా అదివారం నాటి టికెట్ ధర ఏకంగా రూ.17 వేల నుంచి రూ.25 వేల వరకు చేరుకుంది. ఇలా వైకుంఠ ఏకాదశికి తిరుమలకు చేరకునే భక్తులను విమానయాన సంస్థలు దోపిడి చేస్తున్నాయి.

సంపన్న కుటుంబాలకు చెందినవారు వీటిని పెద్దగా పట్టించుకోకుండా టికెట్ ధరతో సంబంధం లేకుండా ప్రయాణానికి మొగ్గుచూపుతున్నారు. ఎలాగైనా తిరుమలకు వెళ్లాలని నిర్ణయించుకున్న వారు టికెట్ ధర ఎంతైనా పర్వాలేదని అంటున్నా.. టికెట్లు మాత్రం అందుబాటులో లేవు. ఉదయం పూటకు మాత్రమే రెండింటిలో టిక్కెట్లు ఉన్నాయి. ఇక సర్లే అని వాటిని తీసుకుని తిరుగు ప్రయాణానికి టికెట్లు ప్రయత్నించినా అదే పరిస్థితి ఎదురవుతుంది. సోమవారం నాటికి కూడా హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణానికి టిక్కెట్ల ధరను భారీగా పెంచాయి.

అయితే తక్కువ ఖర్చుతో సుదూర ప్రయాణాలను అందించే ఏకైక మార్గం.. ఆపద్కాల బాంధువుడిగా వున్న రైల్వే శాఖ.. మాత్రం భక్తులకు తాను వున్నానని అభయాన్ని అందిస్తోంది. ముక్కోటి ఏకాదశి రోజుల్లో దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్‌ నుంచి తిరుపతికి రెండు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ఆలస్యంగానైనా ప్రకటించింది. శనివారం సాయంత్రం 6.30 గంటలకు సికింద్రాబాద్‌ నుంచి ప్రత్యేక రైలు (07429) తిరుపతికి బయలుదేరుతుంది. ఆదివారం ఉదయం 7 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది.

తిరిగి సోమవారం సాయంత్రం 6.50 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరి మంగళవారం ఉదయం 8.15 గంటలకు సికింద్రాబాద్‌ చేరుతుంది. ఈ రెండు రైళ్లు కాజీపేట, వరంగల్‌, మహబూబాబాద్‌, ఖమ్మం, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంటలో ఆగుతూ తిరుపతి చేరుకుంటాయి. ఈ ప్రత్యేక రైళ్లలో ఏసీ ఫస్ట్‌క్లాస్‌, ఏసీ 2 టైర్‌, ఏసీ 3 టైర్‌, స్లీపర్‌ క్లాస్‌ కోచ్‌లు ఉంటాయి. వైకుంఠ ఏకాదశి రోజు శ్రీవారిని దర్శించుకోవాలనే భక్తులు ఈ రైళ్లకు టిక్కెట్లు బుక్‌ చేసుకోవచ్ఛు వీటితో పాటు సంక్రాంతికి తిరుపతికి ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh